pizza
Sai Dharam Tej interview about Thikka
`తిక్క‌`సినిమాలో నా క్యారెక్ట‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన చిత్రాల‌కు భిన్నంగా ఉంటుంది - సాయిధ‌ర‌మ్ తేజ్
You are at idlebrain.com > news today >
Follow Us

11 August 2016
Hyderaba
d

సాయిధరమ్‌తేజ్‌ హీరోగా లారిస్సా బోనేసి, మన్నారా చోప్రా హీరోయిన్స్‌గా సునీల్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్‌ పతాకంపై డా|| సి. రోహిన్‌కుమార్‌రెడ్డి నిర్మించిన చిత్రం 'తిక్క'. ఈ చిత్రం ఆగస్టు 13న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్‌తేజ్‌తో ఇంటర్వ్యూ.

'తిక్క' కథ వినగానే ఏమనిపించింది..?
- సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అయితే ఇప్పటి వరకు చేసిన సినిమాలకు డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేయడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని చిన్న టెన్షన్‌ క్రియేట్‌ అయ్యింది.

మీ క్యారెక్టర్‌కి ఎలా ఉండబోతుంది?
- ఈ చిత్రంలో నేను రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేసే ఒక నార్మల్‌ బోయ్‌ క్యారెక్టర్‌ని ప్లే చేశాను. నాచురల్‌గా చాలా సింపుల్‌గా నా క్యారెక్టర్‌ ఉంటుంది. అనుకోకుండా అతని లవ్‌ బ్రేకప్‌ అవుతుంది. ఎమోషన్‌ క్యారీ అవుతూ త్రూ అవుట్‌ ఫిలిం అంతా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.

'తిక్క' టైటిల్‌ పెట్టడానికి రీజన్‌ ఏంటి?
- సినిమాలో హీరో ఎదుర్కొనే క్యారెక్టర్స్‌ అన్నీ తిక్క తిక్కగా ఉంటాయి. సో టైటిల్‌కి యాప్ట్‌గా ఉంటుందని ప్రొడ్యూసర్‌ రోహిన్‌గారు, సునీల్‌గారు 'తిక్క' టైటిల్‌ని కన్ఫర్మ్‌ చేశారు.

శింబు, ధనుష్‌లతో పాటలు పాడించడానికి రీజన్‌ ఏంటి?
- పర్టిక్యులర్‌గా రీజన్‌ అంటూ ఏం లేదండీ. అది థమన్‌ ఐడియా. ఈ సాంగ్‌ శింబు, ధనుష్‌ పాడితే బాగుంటుందని వారిని థమన్‌ అప్రోచ్‌ అయి ట్యూన్స్‌ వినిపించాడు. వాళ్లు చాలా ఇంప్రెస్‌ అయి సాంగ్స్‌ బాగా నచ్చి ఈ సినిమాలో పాడటం జరిగింది.

మీ కెరీర్‌లో ఇది భారీ బడ్జెట్‌ చిత్రం అనుకోవచ్చా?
- అలాంటిదేం లేదు. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా రోహిన్‌కుమార్‌ రెడ్డిగారు ఈ చిత్రాన్ని నార్మల్‌ బడ్జెట్‌లోనే చేశారు. టెక్నికల్‌ యాస్పెక్ట్స్‌ మిస్‌ అవకుండా భారీ క్వాలిటీతో సినిమా నిర్మించారు. వర్కింగ్‌ డేస్‌ కూడా 95 డేస్‌ అయ్యాయి. సుప్రీమ్‌ 93 డేస్‌లో ఫినిష్‌ చేశాం. అలాగే ఈ చిత్రంలో 25 మంది ఆర్టిస్టులు వర్క్‌చేశారు. టీమ్‌ అందర్నీ చాలా బాగా చూసుకున్నారు. అందరి సహకారంతో ఒక మంచి సినిమా చేశాం.

Sai Dharam Tej interview gallery

మెయిన్‌ కథాంశం ఏమిటి?
- హీరో, హీరోయిన్‌ మధ్య బ్రేకప్‌ అవుతుంది. తర్వాత బ్రేకప్‌ పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశాడు, కొత్త క్యారెక్టర్స్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి, వారితో కలిసి అతను ఏం చేశాడు అన్నది ముఖ్య కథాంశం.

ఈ ప్రాజెక్ట్‌ ఎలా సెట్‌ అయింది?
- 'పిల్లా నువ్వులేని జీవితం' టైంలో 'తిక్క' కథ వినటం జరిగింది. సునీల్‌, రోహిన్‌ అన్న వచ్చి కథ వినిపించారు. అప్పుడు అనుకున్న కథనే ఇప్పుడు సినిమాగా చేశాం. ఏ మార్పులు చేయలేదు. హ్యూమర్‌ ఇంకా పెంచాం తప్ప తగ్గించలేదు.

టెక్నికల్‌గా ఎలా ఉంటుంది?
- డైరెక్టర్‌ సునీల్‌కి టెక్నికల్‌గా చాలా గ్రిప్‌ ఉంది. అందులో అతను మాస్టర్‌ అని చెప్పవచ్చు. అలాగే కెమెరామెన్‌ గుహన్‌గారు ఈచ్‌ అండ్‌ ఎవ్రీ ఫ్రేమ్‌ని అద్భుతంగా తీర్చిదిద్దారు. టాప్‌ టెక్నీషియన్స్‌ అందరూ ఈ సినిమాకి వర్క్‌చేశారు. ఆడియన్స్‌ సర్‌ప్రైజ్‌ అయ్యే ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో చాలా ఉన్నాయి.

నిర్మాత రోహిన్‌రెడ్డిగారి మేకింగ్‌ ఎలా ఉంది?
- ఫస్ట్‌ టైం రోహిన్‌ అన్న కలిసినపుడు మంచి సినిమా తీస్తాను అని చెప్పారు. అలాగే 'తిక్క'లాంటి ఒక మంచి ఫిలింని గ్రాండ్‌గా నిర్మించారు. వెరీ కోపరేటివ్‌ ప్రొడ్యూసర్‌. డైరెక్టర్‌కి ఏం కావాలో అవన్నీ ప్రొవైడ్‌ చేశారు. అలాగే ఆర్టిస్టులకి ఎలాంటి అవసరం వచ్చినా ముందుండి చూసుకున్నారు. కొత్త ప్రొడ్యూసర్‌ అనే తేడా లేకుండా అందర్నీ బాగా డీల్‌చేశారు.

ఈ సినిమా కోసం ఎలాంటి కేర్‌ తీసుకున్నారు?
- ఆల్కహాల్‌ తాగే సన్నివేశాల్లో చాలా కష్టపడి చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో తాగుబోతు రమేష్‌ కొన్ని టిప్స్‌ చెప్పారు. అలాగే చిరంజీవిగారి సినిమాలు, కళ్యాణ్‌ గారి సినిమాలు చూసి పెరిగాను. వారిలా కాకుండా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి కొత్తగా నేను ఏం చేయగలను అని ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ సినిమా చేశాను.

'తిక్క' టైటిల్‌ అనుకోగానే మీ ఫ్యామిలీ మెంబర్స్‌ రియాక్షన్‌ ఎలా ఉంది?
- చరణ్‌, బన్నీ కలిసినప్పుడల్లా ఏంట్రా తిక్క హీరో అని పిలిచే వారు. ఇక ఎవరూ ఏమీ అనలేదు.

హీరోయిన్స్‌ క్యారెక్టర్స్‌ గురించి?
- లారిస్సా బోనేసి ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా నటించింది. మన్నారా సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. ఇద్దరూ మంచి టాలెంట్‌ ఉన్న ఆర్టిస్టులు. తమ క్యారెక్టర్స్‌కి బాగా న్యాయం చేశారు. లారిస్సాతో నా లవ్‌ బ్రేకప్‌ అవుతుంది. మన్నారా నన్ను లవ్‌ చేసే క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించింది.

మీరు ఒక కథని ఎంచుకునే ముందు మీ జడ్జిమెంట్‌ ఎలా ఉంటుంది?
- కథ వినగానే అందులో ఉన్న మెయిన్‌ పాయింట్స్‌ ఏంటి, ఆ కథ నాకు కరెక్టా కాదా అనేది ఆలోచించి కథలు ఎంపిక చేసుకుంటాను. ఒక ఆడియన్‌గా కథ వింటాను. అప్పుడు మనకి కరెక్ట్‌గా ఐడియా వస్తుంది. 70 పర్సెంట్‌ కథ నచ్చి ధర్టీ పర్సెంట్‌ కరెక్షన్స్‌ చేసి డెవలప్‌ చేసుకోవచ్చు. సో ఆ బేసిస్‌లో కథ ఓకే చేస్తాను. నాకు అవకాశాలు వచ్చినవి సిన్సియర్‌గా చేసుకుంటూ వెళ్తాను.

నెక్ట్స్‌ మూవీస్‌ ఏంటి?
- గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, ఠాగూర్‌ మధుల చిత్రం ఆగస్టు 28 నుండి స్టార్ట్‌ అవుతుంది. కృష్ణవంశీ గారి 'నక్షత్రం' మూవీలో పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. ఈ చిత్రం ఆగస్టు 17 నుండి ఉంటుంది. అలాగే కళ్యాణ్‌రామ్‌గారితో ఓ మూవీ కోసం డిస్కషన్స్‌ జరుగుతున్నాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved