pizza
Sai Prakash about Venkatapuram
You are at idlebrain.com > news today >
Follow Us

07 May 2017
Hyderabad

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణి కుమార్ నిర్మాతలుగా నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ `వెంకటాపురం`. హ్యాపీడేస్ ఫేం హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. వేణు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మే 12న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా `వెంక‌టాపురం` సినిమాటోగ్రాప‌ర్ సాయిప్ర‌కాష్‌తో ఇంట‌ర్వ్యూ విశేషాలు...

సాయిప్రకాష్ మాట్లాడుతూ - ``ను పుట్టి పెరిగిందంతా హైద‌రాబాద్‌లోనే బి.టెక్ కూడా ఇక్క‌డే చ‌దివాను. సుభాష్ ఘ‌య్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో సినిమాటోగ్ర‌ఫీ మీద రెండేళ్ళ కోర్సు చేశాను. ముందు సినిమాటోగ్రాఫ‌ర్‌గా `జ‌గ‌మే మాయ` అనే సినిమాకు ప‌నిచేశాను కానీ ఆ సినిమా విడుద‌ల కాలేదు. కానీ ఆ సినిమాలో నా వ‌ర్క్ చూసి ఎం.ఎస్‌.నారాయ‌ణ‌గారి కుమార్తె శ‌శికిరణ్ నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ `సాహెబా సుబ్ర‌మ‌ణ్యం` సినిమాటోగ్రాఫ‌ర్‌గా అవ‌కాశం వ‌చ్చింది. త‌ర్వాత మోస‌గాళ్ళ‌కు మోస‌గాడు సినిమాకు ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చింది. ఈ సినిమాకు అసోసియేట్‌గా ప‌నిచేసిన వేణు తో అప్ప‌టి నుండే ప‌రిచ‌యం ఉండటం వ‌ల్ల వెంక‌టాపురం సినిమాకు పనిచేసే అవ‌కాశం క‌లిగింది. అప్పుడే ఈ సినిమా బేసిక్ లైన్‌ను నాకు చెప్పాడు. ఈ సినిమాకు హీరోగా ఎవ‌రినీ అనుకుంటున్నావ‌ని అడిగిన‌ప్పుడు రాహుల్ అని నాకు చెప్పాడు. అప్ప‌ట్లో రాహుల్ సెట్ కాడేమో అని కూడా అన్నాను. అయితే రెండేళ్ళ త‌ర్వాత త‌ను పూర్తి స్క్రిప్ట్‌తో నిర్మాత‌ల‌కు క‌థ చెప్పి ఒప్పించాడు. బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్ చెప్పి నిర్మాత‌ల‌ను ఒప్పించ‌డం అంత సులువు కాదు. చాక్లెట్ బోయ్‌గా హ్యాపీడేస్ ఈ సినిమాలో చాలా కొత్త‌గా క‌న‌ప‌డ‌తాడు. సినిమాను ఎలా ట్రీట్ చేయాలి, విజువ‌ల్స్ ఎలా ఉండాలి అంటూ చాలా ఆలోచించాం. వేణు వీట‌న్నింటి గురించి త‌న మైండ్‌లోనే ఆలోచించాడు. డిఫ‌రెంట్ సీజ‌న్స్‌లో సినిమాను షూట్ చేయ‌డం అనేది కాస్తా క‌ష్టంగానే అనిపించింది. ఈ స్టోరీ అంతా వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. సీన్స్‌లో ఎక్కువ సీన్స్ వైజాగ్‌లో ఉంటాయి. స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా ఉంటూ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ ఫీల‌య్యేలా చేస్తుంది, అంద‌రినీ ఎంగేజ్ చేస్తుంది`` అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved