pizza
Samantha interview about 24 success
డార్క్ రోల్స్ చేయడానికి నేను రెడీ - సమంత
ou are at idlebrain.com > news today >
Follow Us

10 May 2016
Hyderaba
d

స్టూడియో గ్రీన్, 2డి ఎంట‌ర్ టైన్మెంట్  బ్యానర్స్ పై హీరో సూర్య త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 24. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూర్య నిర్మించారు. సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించారు. మే 6న విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గురించి హీరోయిన్ సమంత మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించారు...

గర్వంగా ఉంది...
విజయ్ హీరోగా నటించిన థెరి(తెలుగులో పోలీస్) చిత్రం సమ్మర్ లో పెద్ద హిట్టయ్యింది. ఇది మాస్ ఎంటర్ టైనర్. అలాగే 24’ ఓ ఇంటెలిజెంట్ మూవీ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విక్రమ్ దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే థెరి24 చిత్రాలు పెద్ద సక్సెస్ కావడం గర్వంగా కూడా ఉంది. ఇక బ్రహ్మోత్సవం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది.

24 కథ వినేటప్పుడు అదే ఫీలయ్యాను....
24 మూవీ కాన్సెప్టే అమేజింగ్. కథ వినేటప్పుడు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారా అనిపించింది. ఈగ సినిమా కథ వినగానే ఎలా ఫీలయ్యానో 24 సినిమా వినగానే అలానే ఫీలయ్యాను. అసలు జనాలకు కనెక్ట్ అవుతుందా, కనెక్ట్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుందని తెలుసు. అయితే రిస్క్ ఉంటుందని తెలుసు. సమంత ఒక సినిమా చేస్తుందంటే దాంట్లో కొంచెమైనా గ్యారంటీగా ఏదో కొత్తగా ఉంటుందని అనుకోవాలి. అందుకనే నేను స్క్రిప్ట్స్ ఎంపికలో కేర్ తీసుకుంటున్నాను. నా రోల్ కు ఎంత ఇంపార్టెంట్ ఉందనే విషయాన్ని ఆలోచిస్తున్నాను. 24లో సూర్య-విక్రమ్ గారి సినిమా. బలమైన కంటెంట్ ఉంది. ఇలాంటి సినిమాలో ఎంత పెద్ద పాత్ర చేసేమని కాదు, సినిమాలో భాగమయ్యామా లేదా అనేదే ముఖ్యం.

అదే ప్రేక్షకులకు ఆహ్లాదం...
విక్రమ్ కుమార్ గారి సినిమాల్లో రొమాంటిక్ పార్ట్ చాలా స్వీట్ గా, అందంగా ఉంటుంది. 24 సినిమా విషయానికి వస్తే ఇదొక ఇన్ టెన్సివ్ మూవీ. అలాంటి సినిమాలో రొమాంటిక్ పార్ట్ అనేది ప్రేక్షకులకు ఆహ్లాదంగా అనిపిస్తుంది.

Samantha interview gallery

నాకు అప్పడప్పుడు అనిపిస్తుంది....
నేను కూడా సీనియర్ హీరోయిన్ అయిపోయానని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కొత్త హీరోయిన్స్ ఎవరైనా స్టేజ్ పై నాకు సమంత అంటే చాలా ఇష్టమని ఎవరైనా అంటే, నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఇంకా వెళ్లిపోలేదు అని చెప్పాలనిపిస్తుంది.

తను సూపర్ స్టార్ హీరోయిన్ అవుతుంది...
మహేష్ ఈ విషయం చెబితే చంపేస్తాడు అయినా పరావాలేదు..సితార, నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. తను డ్యాన్స్, నవ్వు అన్నీ చూస్తుంటే గౌతమ్ కంటే సితార సూపర్ స్టార్ హీరోయిన్ అయిపోతుందనిపిస్తుంది.(నవ్వుతూ)

ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంది....
బ్రహ్మోత్సవంలోని ప్రతి క్యారెక్టర్ కు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. నా పాత్ర విషయానికి వస్తే, చాలా కొత్తగా ఉంటుంది. అలాగే అఆ చిత్రంలో నేను కామెడి ఎక్కువగా ఉండే క్యారెక్టర్ చేశాను. ఇంత రేంజ్ లో కామెడి చేయడం ఇదే మొదటిసారి.

డార్క్ రోల్ చేయాలని ఉంది....
నేను తమిళంలో డార్క్ రోల్స్ చేశాను. తెలుగులో ఇప్పటి వరకు చేయలేదు. ఎవరైనా అలాంటి పాత్రలతో వస్తే చేయడానికి నేను రెడీ. కన్నడలో యు టర్న్ మూవీ రీమేక్ లో నటించబోతున్నాను. ఈ చిత్రం తెలుగు, తమిళంలో రూపొందనుంది. అందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.

అవార్డులన్నీ ఆయనకే...
సూర్య నటుడిగానే కాదు, సూపర్బ్ ప్రొడ్యూసర్ కూడా. డైరెక్టర్ విక్రమ్ ఆలోచించడం కాదు, ఆయన ఆలోచనను తెరపైకి తీసుకురావడానికి మంచి నిర్మాత అవసరం. సూర్య ఆ జాబ్ ను సమర్దవంతంగా నిర్వహించారు. ఇక నటన విషయానికి వస్తే ఆత్రేయగా ఆయన చేసిన నటన అద్భుతం. ఈ ఏడాది అవార్డులన్నీ ఆయనకే వస్తాయి.

ఫ్యూచర్ ప్లాన్స్ ...
ఈ సినిమాల్లో నటించడంలో బిజీ అయిపోయాను. నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని ఆలోచంచలేదు. అయితే తప్పకుండా ఆలోచించే సమయం వచ్చిందని అనుకుంటున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved