pizza
Samantha interview about A..Aa
నా కెరీర్‌లో `అ...ఆ..` చాలా కీల‌కం - స‌మంత‌
You are at idlebrain.com > news today >
Follow Us

31 May 2016
Hyderaba
d

ఇవాళున్న తెలుగు టాప్ హీరోయిన్ల‌లో స‌మంత‌కి తొలి వ‌రుస‌లో చోటుంటుంది. తెలుగులో తొలి చిత్రం ఏమాయ‌చేసావెతోనే ఆమె అంత క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస చిత్రాలు చేసి మెప్పించిన స‌మంత ఇప్పుడు `అ... ఆ.. `అన‌సూయ రామ‌లింగం వ‌ర్సెస్ ఆనంద్ విహారి అనేది ఉప‌శీర్షిక‌. ఇందులో నేను అన‌సూయ రామ‌లింగం అంటూ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. ఈ వేస‌విలో వ‌స్తున్న పెద్ద చిత్ర‌మిదే. ఈ సినిమా జూన్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి స‌మంత మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడింది. ఆ విశేషాలు..

* అ.. ఆ.. గురించి చెప్పండి?
- నేను ఇప్ప‌టిదాకా ప‌లు ర‌కాల చిత్రాలు చేశాను. వాటిలో సీరియ‌స్ చిత్రాలున్నాయి. ఇంటెన్సిటీ ఉన్న‌వి ఉన్నాయి. రొమాంటిక్ చిత్రాలున్నాయి. అయితే ఎప్పుడూ పెద్ద‌గా కామెడీ ట్రై చేయ‌లేదు. అ.. ఆ.. లో అన‌సూయ రామ‌లింగం పాత్ర‌లో కామెడీ ట్రై చేశా.

* కామెడీ చేయ‌డం ఈజీగానే అనిపించిందా?
- క‌ష్ట‌మండీ బాబూ. అయినా న‌న్ను న‌మ్మి ఈ జోన‌ర్ చిత్రాన్ని ఇచ్చినందుకు త్రివిక్ర‌మ్‌గారికి థాంక్స్ చెప్పాలి. నా వ‌ర‌కు పాత్ర‌కు జ‌స్టిస్ చేశాన‌నే అనుకుంటున్నా.

* ఈ రోల్ చేశాక క‌మెడియ‌న్స్ ను చూసే దృష్టిలో ఏమైనా మార్పు వ‌చ్చిందా?
- నేను మొద‌టి నుంచి కామెడీ ఆర్టిస్ట్లు అంటే చాలా గౌర‌వం అండీ. అది క‌ష్ట‌మైన జోన‌ర్ అనీ తెలుసు.

* మీ కెరీర్‌లో ఇది ఎలాంటి చిత్ర‌మ‌వుతుంది?
- త‌ప్ప‌కుండా ఇది కీల‌క‌మైన సినిమానే.

Samantha interview gallery

* ఇందులో కామెడీ చేస్తున్న‌ప్పుడు ఎవ‌రిని స్ఫూర్తిగా తీసుకున్నారు?
- అంద‌రూ న‌టుల‌ను చూసి స్ఫూర్తి పొందుతారు.నేను మాత్రం ద‌ర్శ‌కుడిని చూసి స్ఫూర్తి పొందా. త్రివిక్ర‌మ్‌గారికి సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్ ఎక్కువ‌. అందుకే ఆయ‌న్నే ఇమిటేట్ చేశాను. చూస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ ముఖంపై చిరున‌వ్వు త‌ప్ప‌కుండా ఉంటుంది. నేను ఫ‌స్టాప్ చూసిన త‌ర్వాత మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించింది. ఇది కొత్త కాన్సెప్టా? అని ఎవ‌రైనా అడిగితే చెప్ప‌లేను కానీ త‌ప్ప‌కుండా డిఫ‌రెంట్ గా మాత్రం ఉంటుంది.

* త్రివిక్ర‌మ్‌గారి డైర‌క్ష‌న్ అని సినిమా చేశారా? లేకుంటే ముందే స్క్రిప్ట్ విన్నారా?
- నేనెప్పుడూ ఎవ‌రి కోస‌మూ పేర్లు చూసి సినిమాలు చేయ‌ను. స్క్రిప్ట్ న‌చ్చితేనే సంత‌కం చేస్తా. లేకుంటే నిక్క‌చ్చిగా నో చెప్పేస్తాను. అయినా ఇందులో నా పాత్ర‌కు ఎంత ప్రాముఖ్య‌త ఉందో టైటిల్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. ప్రేమ క‌థ మాత్ర‌మే కాదు.. ఇందులో కుటుంబంలోని బంధాల‌ను ఎక్కువ‌గా చూపించారు. హీరో, హీరోయిన్ల‌కు ఇద్ద‌రికీ స‌మ ప్రాధాన్య‌త ఉంటుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. నా పాత్ర నా నిజ జీవితానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అల్ల‌రిగా ఉంటూ, త్వ‌ర‌గా నిర్ణ‌యాలు తీసుకుంటూ.. అలాగ‌న్న‌మాట‌.

* కాంబినేష‌న్స్ రిపీట్ కావ‌డం ప‌ట్ల మీ అభిప్రాయం ఏంటి?
- రిపీట్ అయిన‌ప్పుడు కంఫ‌ర్ట్ గా ఉంటుంది. లేకుంటే లేదు. ఈ చిత్రం ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, హీరో నితిన్ ఇద్ద‌రూ మంచి స్నేహితులు. అందుకే కొన్ని చోట్ల కొన్ని స‌న్నివేశాలు చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి అర‌మ‌రిక‌లు లేకుండా చేయ‌గ‌లిగాను.

* ముందు నితిన్‌తో మీకు ప‌డ‌లేద‌ట క‌దా?
- అంద‌రితో పాటు త్రివిక్ర‌మ్‌గారు కూడా అలాగే అనుకున్నారు. రెండు, మూడు రోజులు మాకు కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ కాక‌పోయే స‌రికి ఆయ‌న కూడా అలాగే భావించారు.

* ఫ్లాప్స్ గురించి ఆలోచిస్తారా?
- హిట్ల‌ను గురించి ఆలోచించిన‌ప్పుడు ఫ్లాపుల గురించి ఎందుకు ఆలోచించం. త‌ప్ప‌కుండా ఆలోచిస్తాను. హిట్లు నాకు ఎంత ఉత్సాహాన్నిస్తాచ‌యో, ఫ్లాప్ లు అంత బాధ‌పెడుతాయి. ఈ ఏడాది తెరి, 24 హిట్ట‌య్యాయి. బ్ర‌హ్మోత్స‌వం మాత్రం అనుకున్న రిజ‌ల్ట్ ఇవ్వ‌లేదు. రిజ‌ల్ట్ ఆడియ‌న్స్ చేతిలో ఉంటుంది.

* ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాలేంటి?
- యూ టర్న్ రీమేక్ ఉంది. ప‌వ‌న్ ద‌ర్శ‌కుడు. తెలుగు, త‌మిళంలో విడుద‌ల‌వుతుంది. ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ ఉంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved