pizza
Sampath Nandi interview (Telugu) about Gautham Nanda
క్యారెక్టరైజేషన్‌కి బలమైన కథ తోడైతే ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుంది - సంప‌త్‌నంది
You are at idlebrain.com > news today >
Follow Us

27 July 2017
Hyderabad

'ఏమైంది ఈవేళ', 'రచ్చ', 'బెంగాల్‌ టైగర్‌'తో హ్యాట్రిక్‌ హిట్స్‌ సాధించి కమర్షియల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సంపత్‌ నంది తాజాగా 'గౌతమ్‌ నంద'తో మరోసారి హెడ్‌లైన్స్‌లోకి వచ్చారు. ఈ సినిమా టీజర్‌కి, ట్రైలర్‌కి సోషల్‌ మీడియాలో మిలియన్‌ వ్యూస్‌ వస్తున్నాయి. ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ హీరోగా అందాల భామలు హన్సిక, కేథరిన్‌ థెస్రా హీరోయిన్స్‌గా శ్రీ బాలాజీ సినీ ఆర్ట్స్‌ పతాకంపై సంపత్‌ నంది దర్శకత్వంలో జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన 'గౌతమ్‌నంద' చిత్రం జూలై 28న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గోపీచంద్‌ కెరీర్‌లో హైయ్యస్ట్‌ బడ్జెట్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.థమన్‌ మ్యూజిక్‌ అందించారు. ఈ చిత్రం రిలీజ్‌ అవుతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు సంపత్‌ నందితో ఇంటర్వ్యూ.

'గౌతమ్‌ నంద' చిత్రం ఎలా ఉండబోతోంది?
- ఇది పక్కా కంటెంట్‌ బేస్డ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. ఇప్పటివరకూ రాని మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించాను.

గోపీచంద్‌ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?
- ఈ చిత్రంలో గోపీచంద్‌ రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ వున్న క్యారెక్టర్స్‌లో కన్పిస్తారు. గౌతమ్‌ ఘట్టమనేని అనేవాడు గౌతమ్‌ నందగా ఎలా మారాడు? అనేది కథ. డాన్‌ క్యారెక్టర్‌ కాదు. ఒక డబ్బు వున్న వున్నోడు ఎలా మంచి మనిషి అయ్యాడు అనేది మెయిన్‌ కాన్సెప్ట్‌. తన జీవితంలో కొన్ని మెయిన్‌ ఎలిమెంట్స్‌ మిస్‌ అవుతాయి. అవి ఏంటి? అనేది సస్పెన్స్‌.

ఇప్పటివరకు మీరు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తీశారు? ఇప్పుడు కాన్సెప్ట్‌ సినిమా తీయడానికి రీజన్‌?
- కమర్షియల్‌ ఫిలింస్‌ చేసినప్పుడు కథ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలిగింది. 'రచ్చ'లోగానీ, 'బెంగాల్‌ టైగర్‌'లో గానీ ఒక బలమైన కథని, ఒక బలమైన ఫ్లాష్‌బ్యాక్‌ని చెప్పలేకపోయానేమో అని నాకు అన్పించింది. సినిమాలు సూపర్‌హిట్‌ అయినా కానీ అందుకే అవి నెంబర్‌వన్‌ స్థానానికి వెళ్లలేకపోయాయి అనే ఫీలింగ్‌ కలిగింది. క్యారెక్టరైజేషన్‌కి బలమైన కథ తోడైతే ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుందని నా స్ట్రాంగ్‌ ఒపీనియన్‌. హండ్రెడ్‌ పర్సెంట్‌ ఈ సినిమాని బేలెన్స్‌ చేసాను అని నమ్ముతున్నాను.

ఇలాంటి సబ్జెక్ట్‌ చేయడం ఏమన్నా ఛాలెంజింగ్‌గా అన్పించిందా?
- కథ రాసేటప్పుడే నాకు చాలా శాటిస్‌ఫ్యాక్షన్‌ కలిగింది. కథ రాసి షూట్‌ కంప్లీట్‌ అయ్యాక హండ్రెడ్‌ పర్సెంట్‌ శాటిస్‌ఫ్యాక్షన్‌ తృప్తి కలిగింది.

ఈ ప్రాజెక్ట్‌ ఎలా మెటీరియలైజ్‌ అయ్యింది?
- 'బెంగాల్‌ టైగర్‌' రిలీజ్‌ అయ్యాక ఈ సినిమా కథపై వర్క్‌ చేస్తున్నాను. 'రచ్చ' టైమ్‌ నుంచే నేను భగవాన్‌, పుల్లారావుగారికి సినిమా కమిట్‌ అయ్నాఅ. అప్పట్నుంచీ నాతో ట్రావెల్‌ అవుతున్నారు. సో.. ఈ కథ వారికి చెప్పడం జరిగింది. కథ చాలా అద్భుతంగా వుంది. దానికి గోపీచంద్‌గారు పర్‌ఫెక్ట్‌గా యాప్ట్‌ అవుతారు అని చెప్పారు. గోపీ రెండున్నర గంటలు కథ విని బాగా ఎగ్జైట్‌ అయి సినిమా ఎప్పుడు చేస్తావ్‌ అని అడిగారు. అలా ఈ చిత్రం స్టార్ట్‌ అయ్యింది.

గోపీచంద్‌ క్యారెక్టర్‌ని ఎలా డిజైన్‌ చేశారు?
- కథ రాసుకున్నప్పుడే గౌతమ్‌ ఘట్టమనేని క్యారెక్టర్‌ డిజైన్‌ చేసుకున్నాను. స్కెచెస్‌ కూడా వేశాను. అవన్నీ చూసి గోపీచంద్‌ సార్‌ సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఏడు, ఎనిమిది గెటప్స్‌ డిజైన్‌ చేశాం. పవన్‌కళ్యాణ్‌గారి హెయిర్‌ స్టైలిష్‌ రాము అద్భుతమైన గెటప్స్‌ డిజైన్స్‌ చేశాడు. కాస్ట్యూమ్స్‌ విషయంలో కూడా చాలా కేర్‌ తీసుకున్నాం. లుక్‌ పరంగా మేము అనుకున్నదానికి 99 పర్సెంట్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమా ఒప్పుకొని చేయడం గోపీచంద్‌ గొప్పతనం.

ఈ సినిమా కోసం ఎలాంటి కేర్‌ తీసుకున్నారు?
- టాప్‌ టెన్‌ బిలియనీర్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని వారి లైఫ్‌ స్టైల్‌ ఎలా వుంటుంది? వారి పిల్లలు ఎలా వుంటారు? వాళ్ల బిహేవియర్‌ ఎలా వుంటుంది? కాస్ట్యూమ్స్‌, బ్రాండ్స్‌ ఎలా వుంటాయి. అన్నీ రీసెర్చ్‌ చేసి ఈ సినిమాకి అన్నీ ఒరిజినల్స్‌ వాడాం. రోలెక్స్‌ వాచ్‌, షూస్‌ అన్నీ ప్రాపర్‌గా బ్రాండ్స్‌ ఐటెమ్స్‌ వాడటం జరిగింది. చాలా కేర్‌ తీసుకుని ఎంతో రీసెర్చ్‌ చేసి ఈ సినిమాకి వర్క్‌ చేశాం. ప్రాపర్‌గా ఈ సినిమా ప్రేక్షకులకి నచ్చుతుందని నమ్మకం కలిగింది.

గౌతమ్‌ ఘట్టమనేని పేరు పెట్టడానికి రీజన్‌?
- 'గౌతమ్‌ నంద' క్యారెక్టర్‌కి గోపీచంద్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశారు. 'గౌతమ్‌ నంద' ఘట్టమనేని ఆ సర్‌ నేమ్‌కి ఒక గొప్ప పేరు, గౌరవం వుంది. సమాజంలో ఆ ఫ్యామిలీతో వున్నవారు చాలా గొప్పస్థానంలో వున్నారు. అలాంటి పేరు పెట్టగానే హీరోని కూడా ఆడియన్స్‌ ఫస్ట్‌ ఏక్సెప్ట్‌ చేస్తారనే ఫీలింగ్‌ కలిగింది. అందుకనే 'గౌతమ్‌ ఘట్టమనేని పేరు పెట్టడం జరిగింది.

ఈ సినిమా మెయిన్‌ కాన్సెప్ట్‌ ఏంటి?
- భూమి సూర్యుని చుట్టూ తిరినట్టు ప్రపంచమంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది. అదే ఈ సినిమా మెయిన్‌ కాన్సెప్ట్‌. హీరో చాలా మెమొరీతో వుంటాడు. ఒక మనిషి జర్నీలో నేను ఎవరు? అని ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నతోనే ఈ సినిమా స్టార్ట్‌ అవుతుంది.

interview gallery

ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఎలా వుంటుంది?
- గోపీచంద్‌ ఫ్యాన్స్‌ అందరూ సంతృప్తి పడేవిధంగా ఈ సినిమా వుంటుంది. గోపీచంద్‌గారు చేసిన సినిమా అన్నింట్లో కంటే విజువల్‌గా చాలా కొత్తగా ఈ చిత్రం వుంటుంది. ప్రాపర్‌ బ్లెండింగ్‌ వుంటుందని కాన్ఫిడెన్స్‌గా చెప్పగలను.

మీరు ఇంత గ్యాప్‌ తీసుకోవడానికి రీజన్‌?
- 'బెంగాల్‌ టైగర్‌' రిలీజ్‌ అయి వన్‌ అండ్‌ ఆఫ్‌ ఇయర్‌ అయింది. ఈ సినిమా లాస్ట్‌ జూలైలో స్టార్ట్‌ అయ్యింది. ఈ సినిమా ప్రాసెస్‌కి వన్‌ ఇయర్‌ పట్టింది. కథ రాయడానికి సిక్స్‌ మంత్స్‌ పట్టింది. సో.. గ్యాప్‌ ఎక్కడా రాలేదు.

ఈ సినిమాలో డాగ్‌ని ప్రత్యేకంగా వాడారు కదా?
- చాలా ఇంపార్టెంట్‌ రోల్‌ డాగ్‌ది. గౌతమ్‌కి ఆ డాగ్‌ ఫ్రెండ్‌లాంటిది. గౌతమ్‌ లైఫ్‌లో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఆ డాగ్‌ ఎలా హెల్ప్‌ చేసింది అనేది సస్పెన్స్‌. డాగ్‌తో వర్క్‌ చేయడం చాలా టఫ్‌ అన్పించింది. అందరం ముద్దుగా యువ అని పిలిచేవాళ్లం. జర్మన్‌ నుంచి ఆ డాగ్‌ని తెప్పించాం. గౌతమ్‌ చేసే పనులన్ని ఆ డాగ్‌ చేస్తుంటుంది. అది ఆడియన్స్‌కి సర్‌ప్రైజింగ్‌గా వుంటుంది. చాలా క్యూట్‌గా డాగ్‌ కన్పిస్తుంది.

సినిమా బడ్జెట్‌ ఎక్కువైందని టాక్‌ వినిపిస్తోంది?
- బిగినింగ్‌ నిర్మాతలకి నేను ఏదైతే చెప్పానో అంతలోనే చేయడం జరిగింది. దుబాయ్‌లో చేసిన సాంగ్‌ విజువల్‌గా చాలా గ్రాండియర్‌గా వచ్చింది. పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమా చేశాం. అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా కంప్లీట్‌ చేయడం జరిగింది.

ఇద్దరు హీరోయిన్స్‌ని పెట్టడానికి రీజన్‌?
- ఒక బంగారు షాపులో పని చేసే అమ్మాయి హన్సిక. స్ఫూర్తి క్యారెక్టర్‌లో నటించింది. ఒక మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలో జీవించే ఒక అమ్మాయి. ఆ చిన్న ప్రపంచంలోనే ఎంతో హ్యాపీగా వుంటుంది. స్ఫూర్తి అంటే ఇన్‌స్పిరేషన్‌. ఇంకో అమ్మాయి కేథరీన్‌. బాగా రిచ్‌ గర్ల్‌. తను ముగ్ధ మనోహరంగా వుంటుంది. అందుకే ముగ్ధ అనే పేరు పెట్టాం. కథలో ట్రావెల్‌ అయ్యే ముఖ్యమైన క్యారెక్టర్స్‌ ఇద్దరివి.

కామెడీ ఎంతవరకు వుంటుంది?
- వెన్నెల కిషోర్‌, బిత్తిరి సత్తి, జబర్దస్త్‌ టీం చేసిన కామెడీ సినిమాకి ప్లస్‌ అవుతుంది. సెపరేట్‌ కామెడీ అంటూ వుండదు. కథలో భాగంగా కామెడీ రన్‌ అవుతుంది. కామెడీ కోసం ఏదీ క్రియేట్‌ చేసి రాయలేదు.

యాక్షన్‌ పార్ట్‌ ఎంతవరకు వుంటుంది?
- రెయిన్‌ ఫైట్‌ చాలా హైలైట్‌ అవుతుంది. ఈ చిత్రంలో మొత్తం నాలుగు ఫైట్స్‌ వుంటాయి. స్టోరికి రిలేటెడ్‌గా యాక్షన్‌ సీన్స్‌ వుంటాయి.

ఈ సినిమా మీకు ఎలాంటి పేరు తెస్తుంది?
- ఈ సినిమాని చాలా రెస్పాన్సిబులిటీగా ఫీలై కొత్తగా తీయడానికి ట్రై చేశాను. ఎంతో హోప్స్‌ పెట్టుకుని చేశాను. నేను చేసిన గత సినిమాల కంటే ఈ సినిమా నాకు ఎంతో గొప్ప పేరు తెస్తుందని నమ్మకంతో వున్నాను.

నిర్మాతగా కూడా చేస్తున్నట్లున్నారు?
- నా ఫ్రెండ్స్‌తో కలిసి పేపర్‌ బోయ్‌ అనే సినిమా తీస్తున్నాం. నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్‌ అది. రెండో షెడ్యూల్‌ జరుగుతుంది.

సెన్సార్‌ సభ్యులు సినిమా చూసి ఏమన్నారు?
- వారికి బాగా నచ్చింది. నన్ను బాగా తీసావ్‌ అని అప్రిషియేట్‌ చేశారు. మంచి కథ అని అందరూ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇద్దరు లేడీస్‌కి ఈ సినిమా బాగా నచ్చింది. సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడి అప్రిషియేట్‌ చేశారు.

పవన్‌కళ్యాణ్‌గారితో సినిమా ఎప్పుడు?
- ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు సినిమా చేయడానికి రెడీ.

ఇండస్ట్రీలో మీకు గాడ్‌ఫాదర్‌ ఎవరు?
- మా ఫాదర్‌ నాకు అన్నీ. ఇండస్ట్రీలో నేను రాయడానికి, సినిమాలు ఎలా తియ్యాలి అని పోసాని కృష్ణమురళిగారి దగ్గర నేర్చుకున్నాను. ఒకరకంగా ఆయనే నాకు ఎక్కువ గుర్తు వస్తుంటారు.

మీ జర్నీ ఎలా వుంది?
- 'ఏమైంది ఈవేళ'లాంటి ఒక కొత్త కాన్సెప్ట్‌తో సినిమా చేసావ్‌ అని చిరంజీవిగారు కథ విని 'రచ్చ' సినిమా చేసే అవకాశం ఇచ్చారు. అది చాలా గొప్ప విషయం. నా జీవితంలో అన్నీ మంచి ఎక్స్‌పీరియన్స్‌ జరిగాయి. ఈ జర్నీలో ఎంతో నేర్చుకున్నాను. ఈ జర్నీలో ఎంతో నేర్చుకున్నాను.

ఈ సినిమాకి ఇన్‌స్పిరేషన్‌ ఏమిటి?
- భగవాన్‌ రమణ మహర్షిగారు రాసిన కథ ఈ సినిమాకి ఇన్‌స్పిరేషన్‌. అలాగే కొన్ని రియల్‌ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్‌ ఆధారంగా ఈ కథ రాసుకున్నాను. ఈ సంవత్సరం మంచి కథల్లో టాప్‌ టెన్‌ కథల్లో ఈ సినిమా కథ వుంటుంది..


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved