pizza
Sampoornesh Babu interview (Telugu) about Kobbari Matta
కొబ్బరిమట్ట' చిత్రం నా కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ - బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు
You are at idlebrain.com > news today >
Follow Us

7 August 2019
Hyderabad

'హృదయ కాలేయం' చిత్రం ద్వారా నటుడిగా మంచి గుర్తింపుపొందారు బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'కొబ్బరి మట్ట'. రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శక‌త్వంలో వల్లమ్ సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మూడు పాత్ర‌లు వేయ‌ట‌మే కాకుండా అత్యంత భారీ డైలాగ్‌లు చెప్పి లిమ్కా బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డు ని నెల‌కొల్పాడు.. పాపారాయుడు, పెద‌రాయుడు, ఆండ్రాయుడు లాంటి అత్య‌ద్బుత‌మైన మూడు పాత్ర‌ల‌తో మెప్పించ‌బోతున్నారు బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు. ఈ చిత్రం ఈనెల10న గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ సందర్భంగా బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు ఇంటర్వ్యూ...

ఈ సినిమాలో మీరు ఆగకుండా మూడున్నర నిముషాలు డైలాగ్ చెప్పారు కదా కష్టంగా అనిపించిందా?
- అవునండి! ఆ డైలాగ్ చెప్పడానికి చాలా ప్రాక్టీస్ చేశాను. డైరెక్టర్ నాకు డైలాగ్ పంపి ప్రిపేర్ కామన్నారు. ఏడు నిమిషాల డైలాగ్ ని మూడున్నర నిమిషాలలో పూర్తిచేయాలి. పదో తరగతి పిల్లాడు పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు మొత్తం డైలాగ్ బట్టీపట్టాను. మొత్తనికి ఎలాగోలా బట్టి పట్టి డైలాగ్ చెప్పాను. ఆ డైలాగ్ చెప్పగానే మోహన్ బాబు గారు ఆ వీడియో చూసి వెంటనే ఫోన్ చేసి అభినందించారు. అలాగే ఇండస్ట్రీ నుండి చాలా అప్లాజ్ వచ్చింది.

'కొబ్బరిమట్ట' విడుదల లేట్ అవడానికి రీజన్?
- ఈ చిత్రం ఎప్పుడో రావలసింది. 'హృదయకాలేయం' సినిమా విడుదల సమయంలోనే ఈ చిత్ర పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఆలస్యం కావడానికి అనేక కారణాలున్నాయి, మేము అనుకున్న బడ్జెట్ పరిమితి దాటిపోవడం, మూడు వైవిధ్యమైన పాత్రలు కావడంతో షూటింగ్ డేస్ కూడా పెరగడం జరిగింది. ఆరుగురు భార్యలు, నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు చెల్లెల్లు వంటి భారీ కాస్ట్ వలన, నేను బిగ్ బాస్ షో కి వెళ్లడం, నటుల డేట్స్ కుదరకపోవడం వలన ఇలా అనేక కారణాల వలన మూవీ ఆలస్యం అయ్యింది.

ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రలలో కనిపించడం కష్టం అనిపించిందా?
- మొదట్లో చాలా కష్టం అనిపించింది. పొద్దున్నే పెదరాయుడు గెట్ అప్ ఉండేది. మధ్యాహ్నానికి పాపారాయుడు గెట్ అప్ కోసం గమ్ పూసేవారు. వెంటనే సాయంత్రానికి ఆండ్రాయిడ్ గెట్ అప్ కోసం మళ్ళీకాస్ట్యూమ్స్ చేంజ్ చేసేవారు. అయినా కెరీర్ స్టార్టింగ్ లోనే మూడు విభిన్న పాత్రలు చేసే అవకాశం కావడంతో ఇష్టంగానే చేశాను.

కొబ్బరిమట్ట టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి ?
- ఇప్పటికే మావిడాకులు, గోరింటాకు అనే టైటిల్స్ తో సినిమాలు వచ్చాయి. ఏదైనా ఓ పెద్ద ఆకు పేరు పెడితే బాగుంటుందని అనుకున్నాం మనకు ఉన్నదాంట్లో “కొబ్బరిమట్ట” అని పెట్టాం(నవ్వుతూ ).

మీరు హీరో ఎలా అయ్యారు?
- నాకు చిన్నప్పటినుండి సినిమాలపై ఆసక్తి ఉండేది. మావూరు కరీంనగర్ మిట్టపల్లిలో నాటకాలు వేసే వాడిని . నేను సినిమాపై ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దర్శకుడు స్టీవ్ శంకర్ నన్నుచూసి, నేను ఓ వరస్ట్ హీరో కోసం చూస్తున్నాను. అది నువ్వే అన్నారు. అలా హీరో ఐపోయాను. (నవ్వుతూ)

interview gallery



హృదయకాలేయం తరువాత అనేక విమర్శలు వచ్చినట్లున్నాయి?
- అవును అప్పట్లో వీడేంటి, హీరో ఏంటి అని చాలా మంది విమర్శించారు. కొందరైతే ఫోన్ చేసి మరి తిట్టేవారు. హీరో ఐతే ఇన్ని అవమానాలు భరించాలా అనిపించేది. రాజమౌళి గారు ఒక ట్వీట్ చేశాక కొంచెం తగ్గింది.

ఈ సినిమా ఆగిపోతుందని తెలిసినప్పుడు వేరే సినిమాలలో ఎందుకు నటించలేదు?
- ఎక్కడో మిట్టపల్లి లాంటి చిన్న పల్లెటూరికి చెందిన నన్ను, హీరో చేసిన వ్యక్తి స్టీవ్ శంకర్. అలాంటి వ్యక్తి ఈ చిత్రం కోసం నిర్మాతగా కూడా మారాడు. ఆయనకోసమైనా ఈ చిత్రం విడుదలైయ్యేలా నా వంతు ప్రయత్నం చేశాను. అందుకనే ఏ సినిమాలోనూ నటించలేదు..

ఈ మధ్య కాలంలో ఒక పెద్ద డైరెక్టర్ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని వార్తలు వినిపించాయి?
- అవునండీ. పూరి జగన్నాధ్ సినిమాలో మంచి క్యారెక్టర్ కోసం ఆ టీం నన్ను సంప్రదించడం జరిగింది. అయితే అదే సమయం లో కొబ్బరి మట్టషూటింగ్ ఉండడంతో వీలు కాలేదు. అయితే తరువాత ఎలాంటి కోపం లేకుండా పూరి గారు మా సినిమా సాంగ్ ని రిలీజ్ చేయడం హ్యాపీ గా అనిపించింది.

కరెంటు తీగ చిత్రంలో సన్నీ లియోన్ నటించారు కదా?
- అవును, కానీ నాకు అప్పటికి సన్నీ లియోన్ తెలియదు. ఆమెతో ఏమైనా మాట్లాడదామంటే నాకు ఇంగ్లీష్ రాదు,ఆమెకు తెలుగు రాదు. అప్పుడు మా దర్శకుడు ఇతను సంపూ యూట్యూబ్ లో చాలా పెద్ద హీరో అని పరిచయం చేశారు.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
- ఇద్దరు నిర్మాతలు వారి సినిమాల కోసం అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సినిమా లేట్ కావడంతో వారు నన్ను సంప్రదించలేదు. అయితే కొబ్బరి మట్ట సినిమా నా కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మిగతా వాటి గురించి ఆలోచిస్తా అంటూ ఇంటర్వ్యూ ముగించారు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved