pizza
Sandeep Vanga interview (Telugu) about Arjun Reddy
నేను అశ్లీలతను క్యాష్‌ చేసుకోవాలనుకోలేదు - సందీప్‌ వంగా
You are at idlebrain.com > news today >
Follow Us

23 August 2017
Hyderabad

విజయ్‌దేవర కొండ, షాలిని హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మాత. ఈ సినిమా ఆగస్టు 25న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్‌ వంగాతో ఇంటర్వ్యూ..

సినిమా ఎలా ఉంటుంది?
- ఎమోషనల్‌గా డ్రైవ్‌ అయ్యే స్టోరీ. రొమాన్స్‌ కూడా ఓపెన్‌. ఓపెన్‌ అంటేఎ గ్రేడ్‌ సీన్స్‌లో వేరే అర్థంలో ఉండదు. చాలా రియల్‌గా ఉంటుంది. చాలా కాలం తర్వాత ఓ రియల్‌ స్టోరీని తెరపై చూస్తారు.

సినిమా స్టోరీ ఏంటి?
- బ్రేకప్‌ స్టోరీస్‌లోని డార్క్‌ మూడ్‌లో ఎప్పుడూ సినిమా స్టార్ట్‌ కాదు. కానీ అలా స్టార్ట్‌ చేద్దాం అని నేను అనుకున్న ఆలోచన నుండి ఈ కథ పుట్టింది. క్లైమాక్స్‌లో అమ్మాయి కలుస్తుందా లేదా అని సినిమా చూడాల్సిందే. సినిమాలో ఓ శాడ్‌ సెలబ్రేషన్స్‌ ఉంటాయి.

ఇన్‌స్పిరేషన్‌ ఏంటి?
- మన చుట్టూ జరిగే చాలా విషయాలు నుండి ఈ కథను తయారు చేసుకున్నాను. కథను తయారు చేసేటప్పుడు మన వ్యక్తిగత విషయాలు సినిమా కథపై ప్రభావం చూపిస్తుంది.

నేపథ్యం...?
- నేను ఆస్ట్రేలియాలో ఫిలిం మేకింగ్‌లో మూడేళ్ల కోర్సు చేశాను. ఇండియాకు వచ్చిన తర్వాత నాగార్జునగారి కేడీ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. తర్వాత దర్శకుడు క్రాంతి మాధవ్‌ నాకు మంచి మిత్రుడు. కాబట్టి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాకు స్క్రిప్ట్‌ వర్క్‌ చేశాను.

Sandeep Vanga interview gallery

విజయ్‌దేవరకొండతో సినిమా చేయడానికి కారణం?
- విజయ్‌దేవరకొండతో ఈ కథ చెప్పే సమయానికి పెళ్లి చూపులు స్టార్ట్‌ కాలేదు. నేను ఆఫీస్‌ తీసుకున్న తర్వాతే పెళ్లిచూపులు స్టార్ట్‌ అయ్యింది. ముందుగా రిలీజ్‌ అయ్యింది. అర్జున్‌రెడ్డి చిత్రాన్ని రియల్‌ లోకేషన్స్‌లోనే షూట్‌ చేశాం. ప్రీ ప్రొడక్షన్‌కు చాలా సమయం పట్టింది. ఆ సమయంలో పెళ్లిచూపులు స్టార్ట్‌ అయ్యింది. తర్వాత ద్వారక సినిమా కూడా స్టార్ట్‌ అయ్యింది.

ముందు శర్వాను హీరోగా అనుకున్నారా? కథలో మార్పులేమైనా చేశారా?
- అవును. ముందుగా శర్వాకు కథ చెప్పాను. కానీ వర్కవుట్‌ కాలేదు. ఆ తర్వాత విజయ్‌ కు చెప్పాను. కథలో మార్పులైతే ఏం చేయలేదు.

సినిమాలో సీన్స్‌ బోల్డ్‌గా ఉన్నట్లున్నాయి?
- సన్నివేశాలు బోల్డ్‌గా ఏం లేవు. లిప్‌లాక్‌ సీన్‌ చూస్తే హీరో హీరోయిన్స్‌ డీప్‌ కిస్‌లో కళ్లు మూసుకుని ఉన్నారు. డీప్‌ ఎక్స్‌ప్రెషన్‌ కనపడుతుంది. అందరూ ఆ ఎక్స్‌ప్రెషన్‌ను గమనిస్తారని అనుకున్నాను కానీ అలా జరగలేదు. నేను అశ్లీలతను క్యాష్‌ చేసుకోవాలనుకుంటున్నట్లు అన్నారు. కానీ నిజం చెప్పాలంటే నా సినిమాలో పాతిక ముద్దు సీన్స్‌ ఉంటాయి. నేను క్యాష్‌ చేసుకోవాలనుకుంటే ఆ విషయాన్నే చెప్పి ఉండొచ్చు కానీ నేను అలా చేయలేదు.

సినిమాలో బూతు మాటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే సెన్సార్‌బోర్డ్‌ అభ్యంతరం చెప్పిందంటున్నారు?
- బూతు మాటలు మీరెప్పుడూ మాట్లాడలేదా? మాట్లాడుతాం. అలాగని మనం చేసే ప్రతి పనిని స్క్రీన్‌పై చూపంచలేం. కానీ కొన్ని సీన్స్‌ను చూపించవచ్చు. నేను హిందీలో చెప్పిన మాటలనే తెలుగులో చాలా సినిమాల్లో ఉపయోగించారు. రీసెంట్‌గా ఓ హీరోయిన్‌ ఓ మాటను నాలుగుసార్లు అంది ఆ సినిమాకు సెన్సార్‌వాళ్లు అభ్యంతరం పెట్టలేదు. కానీ నా సినిమాకు అబ్జక్షన్‌ పెట్టారు. సెన్సార్‌ బోర్డు కొన్ని పదాలకు అభ్యంతరం చెప్పింది. వాటిని మ్యూట్‌ చేశాం. అవేమంత తప్పుపట్టాల్సిన పదాలు కాదు. ఆ పాత్ర, అది ఉన్న పరిస్థితులకు ఆ పదాలే కరెక్ట్‌. కానీ సెన్సార్‌ బోర్డు అడ్డు చెప్పడం వలన తీసేశాం.

సినిమా రన్‌ టైమ్‌ ఎక్కువగా ఉందని?
-సినిమాకి కొంత టైమ్‌ పిరియడ్‌ ఉంటుంది. ఎమోషనల్‌ గా చెబితే ఆ రన్‌ టైమ్‌ బోర్‌ కొట్టదు. ఈ సినిమాకు అంతే. మూడు గంటలు పెద్ద విషయం కాదు. ఎందుకంటే సినిమాలో ఎమోషనల్‌ కంటెంట్‌ ఉంది కాబట్టి.

తదుపరి చిత్రాలు
- రెండు స్క్రిప్ట్స్‌ రెడీగా ఉన్నాయి. ఒక పెద్ద హీరో నుండి కాల్స్‌ కూడా వస్తున్నాయి. ముందు ఇది సక్సెస్‌ అయితే నెక్స్ట్‌ స్క్రిప్ట్‌ మీద వర్క్‌ చేస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved