pizza
Sanjana Reddy interview (Telugu) about Rajugadu
ప్రేక్ష‌కుడికి ఓ క‌థ‌ను అందంగా చెప్ప‌డ‌మే సినిమా - సంజనా రెడ్డి
You are at idlebrain.com > news today >
Follow Us

27 May 2018
Hyderabad

యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నచిత్రం `రాజుగాడు`. 'ఈడో రకం ఆడో రకం', 'అందగాడు ', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వంటి విజయవంతమైన చిత్రాలనందించిన సక్సెస్ ఫుల్ బ్యానర్ నుండి వస్తుండటంతో చిత్రం భారీ ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రంతో సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో డా. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో న‌టించారు. జూన్ 1న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కురాలు సంజా రెడ్డితో ఇంట‌ర్వ్యూ...

మాది శ్రీకాకుళం జిల్లా, టెక్క‌లి. ఐటీ కంపెనీలో కొన్ని రోజులు, జ‌ర్న‌లిస్ట్‌గా కూడా వ‌ర్క్ చేశాను. ఏబీఎన్ ఛానెల్‌లో ఏడాది పాటు పనిచేశాను. అలాగే జీ టీవీలోకూడా వ‌ర్క్ చేశాను. ఐటీలో జాబ్ చేసే క్ర‌మంలో కోర్సులు మారుతుంటాయి. వాటిని నేర్చుకుని ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలి. ఆ గ్యాప్‌లోనే జ‌ర్నలిజంలోకి ఎంట్రీ ఇచ్చాను. సినిమా రంగంపై ఆస‌క్తితో వ‌చ్చాను. ఓ స్నేహితుడి స‌హాయంతో నేను రామ్‌గోపాల్ వ‌ర్మ‌గారి వ‌ద్ద స‌హాయ ద‌ర్శ‌కురాలిగా ప‌నిచేశాను. మోహ‌న్‌బాబుగారి `రౌడీ` సినిమాకు వ‌ర్క్ చేశాను. ఆ స‌మ‌యంలో రాముగారి క‌మిట్‌మెంట్ న‌చ్చి సినిమాలంటే ఆస‌క్తి ఏర్ప‌డింది. అదే స‌మ‌యంలో విదేశాల‌కు టూర్ వెళ్లాల‌నే కోరిక‌తో సింగ‌పూర్‌, మ‌లేషియా వంటి దేశాల్లో తిరిగాను. ఆ స‌మ‌యంలో ఎక్కువ‌గా పుస్తకాలు చ‌ద‌వ‌డం అల‌వాటైంది. శివ 25 వ‌సంతాల స‌మ‌యంలో అమ‌ల‌గారిని క‌లిశాను. ఆ స‌మ‌యంలో ఆమె ఏదో యాడ్ ఒప్పుకున్నారు. ఈ యాడ్‌ను డైరెక్ట్ చెయ్ చూద్దాం అన్నారు. నేను చేసిన యాడ్ అంద‌రికీ న‌చ్చింది. దాంతో నాలో న‌మ్మ‌కం పెరిగింది. అలా ట్ర‌యిల్స్ చేస్తూ వ‌చ్చాను. మంచి క‌థ‌లు కోసం చాలా మందిని క‌లిశాను. డిస్క‌స్ చేసుకుంటూ వెళుతుండ‌గా ...ఇలాంటి త‌రుణంలో రాజ్‌త‌రుణ్ ప‌రిచ‌యం అయ్యారు. ఈ సినిమా నిర్మాత‌లు కూడా అలాగే ప‌రిచ‌యం అయ్యారు. అన్ని కుద‌ర‌డంతో `రాజుగాడు` ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఇందులో హీరో క్లిప్టోమేనియా అనే డిజార్డ‌ర్ ఉంటుంది. ఈ డిజార్డ‌ర్ ఉన్న‌వాళ్లు వాళ్ల‌కు తెలియ‌కుండానే దొంగ‌త‌నం చేసేస్తుంటారు. సాధార‌ణంగా ప్ర‌తి 10 మందిలో ఒక‌రికి ఈ సమ‌స్య ఉంటుంది. హీరో ఈ డిజార్డ‌ర్ వ‌ల్ల త‌న ఉద్యోగాల‌న్ని కోల్పోతాడు. కొడుకు కోసం తండ్రి రాజేంద్ర ప్ర‌సాద్ సూప‌ర్‌మార్కెట్ న‌డుపుతుంటాడు. ఇద్ద‌రి మ‌ధ్య కామెడీ ట్రాక్ చ‌క్క‌గా ఉంటుంది. నిజ జీవితంలో స‌రిపోయే అంశాల‌ను ఇందులో స‌రిపోతాయా ? అని ఆలోచించి ఈ క్లెప్టోమేనియా డిజార్డ‌ర్‌ను ఎలిమెంట్‌ను క‌థ‌లో రాసుకున్నాను. ప్రేక్ష‌కుడికి అందంగా క‌థ చెప్ప‌డ‌మే సినిమా. అమైరా ద‌స్తూర్‌, పూజిత మెయిన్ లీడ్స్‌గా క‌నిపిస్తారు. ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ మాత్రం సినిమాటిక్‌గా ఉంటుంది. మిగ‌తాదంతా మ‌న ప‌క్కింటి క‌థ‌ను తెర‌పై చూస్తున్న‌ట్లు ఉంటుంది. ద‌ర్శ‌కురాలిగా మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయ‌నే న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.

 


 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved