pizza
Satish Vegesna interview (Telugu) about Shatamanam Bhavati
'శతమానం భవతి' సక్సెస్‌ దర్శకుడిగా నా బాధ్యత మరింత పెరిగింది - సతీష్‌ వేగేశ్న
You are at idlebrain.com > news today >
Follow Us

08 February 2017
Hyderaba
d
.

శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం 'శతమానం భవతి'. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం పెద్ద స‌క్సెస్‌ను సాధించిన సందర్భంగా ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న‌తో ఇంట‌ర్వ్యూ....

సక్సెస్‌ రెస్పాన్స్‌...
- 'శతమానం భవతి' సక్సెస్‌కు ముందు, తర్వాత సతీష్‌ వేగేశ్న ఒకేలానే ఉన్నాడు. కాకుంటే శతమానం భవతి సక్సెస్‌తో మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు ముందు నేను కథలు చెబుతానని ఫైల్‌ పట్టుకుని తిరిగేవాడిని. ఈ సక్సెస్‌తో కథలు చెప్పమని అడుగుతున్నారు. అంతే తప్ప సతీష్‌ మారడు. ఏ స్క్రిప్ట్‌ అయినా నమ్మే చేస్తాం. కొన్నిసార్లు ఆడియెన్స్‌కు మనం చెప్పే కథ కనెక్ట్‌ అవుతుంది. కొన్నిసార్టు కనెక్ట్‌ కాదు. ఇక ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. కామన్‌గా ఆడియెన్స్‌ అందరూ కనెక్ట్‌ అయ్యే సబ్టెక్ట్‌ కాబట్టి సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. డెఫనెట్‌గా సినిమా సక్సెస్‌ అవుతుందని ఊహించాం కానీ ఇంత పెద్ద హ్యుజ్‌ సక్సెస్‌ అవుతుందని అనుకోలేదు.

వారితో చేయలేకపోవడానికి కారణమదే...
- ముందు 'శతమానం భవతి' కథ విన్న సాయిధరమ్‌ తేజ్‌ కానీ, రాజ్‌తరుణ్‌ కానీ కథ నచ్చింది..సినిమా చేద్దామనే అన్నారు. అయితే కానీ డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడానికి వారికి కుదరలేదు. సంక్రాంతి కాన్సెప్ట్‌ మూవీ కాబట్టి సంక్రాంతికే సినిమా రిలీజ్‌ చేయాలని గోల్‌గా పెట్టుకున్నాం. కాబట్టి సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నాం. ఒకపక్క హీరోల డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేకపోవడంతో, ఎవరైతే బావుంటుందని ఆలోచించాం. శర్వానంద్‌ అయితే సరిపోతాడనిపించి శర్వాను కలవడం, అతనికి కథ నచ్చడంతో సినిమాను స్టార్ట్‌ చేశాం.

రాజుగారిపై నమ్మకంతోనే....
- నేను దర్శకుడుగా సక్సెస్‌లో లేను. అలాంటప్పడు నన్ను నమ్మి సినిమా చేసే నిర్మాత కానీ, లేదా కథను నమ్మి సినిమా చేసే నిర్మాత కానీ ఉండాలి. కథ నచ్చితే దర్శకుడుకి ఇంతకుముందు సక్సెస్‌ ఉందా లేదా అని ఆలోచించకుండా సినిమా చేసే ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుగారు. రాజుగారికి కమర్షియల్‌ సినిమాలంకటే బొమ్మరిల్లు, కొత్తబంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి సినిమాల ద్వారా వచ్చిన పేరే ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మంచి కథను చెబితే రాజుగారు నమ్మి చేస్తారని నమ్మడంతోనే ఆయనకు ఈ కథను చెప్పాను.

ఆడియెన్స్‌ అలా కనెక్ట్‌ అయ్యారు..
- ఇంతకు ముందు కూడా ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ చిత్రాలు వచ్చాయి. అయితే ఆడియెన్స్‌ కనెక్ట్‌ అయిన సన్నివేశాలు తక్కువగా ఉన్నాయి. కానీ శతమానం భవతి చిత్రంలో ఆడియెన్స్‌ కనెక్ట్‌ అయ్యే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఎమోషనల్‌ పాయింట్‌ను ఎవరూ టచ్‌ చేయలేదు. కథ కొత్తది కాకపోవచ్చు కానీ, వెళ్ళిన స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. అందుకే ఆడియెన్స్‌ పర్సనల్‌గా బాగా కనెక్ట్‌ అయ్యారు.

ఆయన దగ్గరుండి చూసుకుంటారు...
- దిల్‌రాజుగారి బ్యానర్‌లో వచ్చే ఏ సినిమా అయినా ఆయన ప్రొడక్ట్‌. ఈ సినిమాకు ఇంత మంచి ఆదరణ లభింస్తుందంటే కారణం ముందు ఇది దిల్‌రాజు బ్యానర్‌లో వస్తున్న సినిమా అని ఆడియెన్స్‌ అనుకోవడమే. ఆయన దగ్గరుండి ప్రతి వ్యవహారాన్ని దగ్గరుండి చూసుకుంటారు.

ఈ ఆలోచన అప్పటిదే...
- నేను ఈనాడు జర్నలిస్ట్‌గా వర్క్‌ చేశాను. నేను పనిచేస్తున్నప్పుడు పత్రికలకు దసరా,దీపావళి, సంక్రాంతి పండుగలప్పుడే సెలవులుండేవి. సెలవు వస్తుందనగానే రేపు సెలవు కదా..అనే ఫీలింగ్‌ ఉండేది. నిద్ర లేవగానే ఈరోజు పండుగ వాతావరణం లేదేంటి అనే బాధ ఉండేది. దీని బేస్‌ చేసుకుని పల్లె పయనమెటు? అనే షార్ట్‌ స్టోరీ రాశాను. ఆ కథను ఆంధ్రప్రభ ఉగాదికథల పోటీకి కూడా పంపాను. కానీ వారు ముద్రించలేదు. నేను రాసిన కథలో ఓ అమ్మాయి సంక్రాంతి పండుగ కోసం తన తాతగారి ఊరుకి వస్తుంది కానీ, తను ఊహించిన విధంగా ఊర్లో పండుగ వాతావరణం కనపడదు. అదే విషయాన్ని తాత దగ్గర అడుగుతుంది. తాతయ్యేమో..ఈ ప్రశ్నకు జనమే సమాధానం చెప్పాలి. పల్లెటూర్లు ఎదగాలి కానీ మూలాలు మరచి ఎదగడం ఎంత వరకు కరెక్టో తెలియడం లేదంటూ చెబుతాడు. ఈ కథను కబడీ కబడీ టైంలో జగపతిబాబుగారికి చెప్పాను. ఆయన ఈ కథను షార్ట్‌ ఫిలిం చేద్దాం నేను ప్రొడ్యూస్‌ చేస్తానని అన్నారు. సరేనని అన్నాను కానీ, మళ్లీ వర్క్‌లో పడిపోయాను. కొన్ని రోజుల తర్వాత ఇదే కథను కొంత మంది స్నేహితులకు చెబితే ఈ కథను సినిమా కథగా డెవలప్‌ చేయమని వారు అన్నారు. అప్పుడు నేను నా పాయింట్‌ను సినిమా కథగా డెవలప్‌ చేసి పక్కన పెట్టుకున్నాను. రామయ్యా వస్తావయ్యా, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ సినిమాలకు దిల్‌రాజుగారి బ్యానర్‌లో పనిచేశాను. ఆయనైతే ఈ కథను చేస్తారని నమ్మి ఈ కథను ఆయనకు చెప్పాను. ఆయనకు నచ్చడంతో సినిమా ప్రయాణం మొదలైంది. పక్కా స్క్రిప్ట్‌ను తయారు చేసుకోవడంతో సినిమాను 49 రోజుల్లోనే పూర్తి చేయగలిగాం. 'శతమానం భవతి' సక్సెస్‌ దర్శకుడిగా నా బాధ్యత మరింత పెరిగింది.

నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌..
- ఇంకా ఏ సినిమా చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదు. కథను సిద్ధం చేసుకున్న తర్వాత ఎవరితో చేస్తే బావుంటుందో వారికి కథ వినిపించి సినిమా చేస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved