pizza
Sekhar Kammula interview (Telugu) about Fidaa
`ఫిదా` దుమ్ముదులిపేస్తుంది - శేఖ‌ర్ క‌మ్ముల‌
You are at idlebrain.com > news today >
Follow Us

18 July 2017
Hyderabad

శేఖ‌ర్ క‌మ్ముల పేరు చెప్ప‌గానే ఓ సెన్సిటివ్ డైర‌క్ట‌ర్ అనిపిస్తుంది. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌, లీడ‌ర్‌.. ఆయ‌న నుంచి చాలా మంచి సినిమాలు వ‌చ్చాయి. అవ‌న్నీ మ‌న‌సుకు హ‌త్తుకున్న‌వే. ఆలోచింప‌జేసిన‌వే. తాజాగా అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి మ‌ధ్య ఏర్ప‌డిన ప్రేమ క‌థ‌తో ఆయ‌న `ఫిదా`ను తెర‌కెక్కించారు. విలువ‌లున్న సినిమాల నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న `ఫిదా` గురించి శేఖ‌ర్‌క‌మ్ముల ఏమ‌న్నారో.. చ‌దివేయండి.

* చాలా గ్యాప్ త‌ర్వాత చేస్తున్నారు?
- అలాంటిదేమీ లేదండీ. నేను స్టోరీ బాగా వ‌చ్చేదాక సినిమా చేయ‌ను. అలా ఈ సినిమా మొద‌లు కావ‌డానికి కాస్త స‌మ‌యం ప‌ట్టిందేమో.

* మ‌హేశ్‌కి, రామ్‌కీ, మ‌రికొంద‌రికీ స్టోరీ చెప్పారు క‌దా..
- అంద‌రికేం చెప్ప‌లేదు. జ‌స్ట్ ఒక మీటింగ్‌.. అది కుదిరిందా? కుద‌ర‌లేదా? అనేది చూశాను. స్టోరీ మొత్తం వెళ్లి ఎవ‌రికీ చెప్ప‌లేదు. ఒక ల‌వ్ స్టోరీ ఉంది.. చేద్దామా?... అనే లెవ‌ల్‌లోనే అది ఆగిపోయింది. అంతేకానీ.. నేనేదో మొత్తం క‌థ చెప్ప‌డం, వాళ్లేదో అన‌డం.. అంత‌ ఏమీ కాలేదు. ఇది నా ఎక్స్ పీరియ‌న్స్ అంతే.

* స‌బ్జెక్ట్ ఎలా పుట్టింది?
- చాలా రోజుల త‌ర్వాత ఓ ల‌వ్ స్టోరీ చేద్దామ‌ని చేశాను. అమెరికా బేస్డ్ సినిమా. జ‌న‌ర‌ల్‌గా అక్క‌డ ఉండి వ‌చ్చాను కాబ‌ట్టి ఎప్పుడో ఒక‌ప్పుడు చేద్దామ‌నుకున్నా. ఆ నేప‌థ్యంలో చేసిన క‌థ ఇది. క‌థంటే నాకు క‌థ అంటూ ఏమీ ఉండ‌దు. జ‌న‌ర‌ల్‌గా నేను అనుకునే క‌థ 150 పేజీలు రాదు. స్క్రీన్ ప్లే వంటివి క‌లిపితే అవుతాయి. క‌థ‌ రాయ‌డం బిగిన్ చేసిన త‌ర్వాత తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ల‌వ్‌స్టోరీ చేద్దామ‌ని అనుకున్నాం. అది క‌రెక్ట్ డిసిష‌న్ అనిపించింది. అక్క‌డి నుంచి తెలంగాణ నేప‌థ్యంతో రాయ‌డం మొద‌లుపెట్టాను. బాన్సువాడ‌లో ఒక బ్యూటీఫుల్ లొకేష‌న్ లో చేశాం. చాలా రోజుల త‌ర్వాత ఇంత బాగా లొకేష‌న్లు ఉంటాయా అనిపించే సినిమా. అమెరికాలోనూ జీవ‌న విధానం చూపిద్దామ‌ని లొకేష‌న్స్ సెల‌క్ట్ చేశాం.

* ఈ సినిమా క‌థ‌ను అనుకున్న‌ప్పుడు మీ మ‌న‌సులో ఎవ‌రున్నారు?
- ఇందాకే సినిమా చూసి వ‌చ్చా. ఇప్పుడు అస‌లు పాత‌వ‌న్నీ ఆలోచించే ప‌రిస్థితుల్లో లేను. ఈ సినిమా వ‌ర‌కు వ‌రుణ్‌తేజ్‌, సాయిప‌ల్ల‌వి డ‌న్ ఎ ఫాబ్యుల‌స్ జాబ్‌. 3, 4 సార్లు చూశా. ప్ర‌తి ఒక్క‌రూ 2,3 సార్లు చూస్తారు. యంగ్‌స్ట‌ర్స్, ఫ్యామిలీస్‌, అమ్మాయిలు త‌ప్ప‌కుండా చూస్తారు. దుమ్ము దులుపేస్త‌ది ఈ సినిమా.

* సినిమా మీద అంత న‌మ్మ‌కం ఏంటండీ?
- రిఫ్రెషింగ్ సినిమా ఇది. ఫ్రెష్ వ్యూ ఉంటుంది సినిమాలో. ఫ‌స్ట్ టైమ్ సినిమా చూసి బ‌య‌టికి వ‌చ్చాక నాకు అనిపించింది. మేజిక‌ల్‌గా అనిపిస్తుంది.

* శేఖ‌ర్ కైండ్ డైర‌క్ష‌న్ ఉంటుందా?
- నా మార్క్ ఉంటుంది. అలాగే రాసుకున్నా. నేనేమీ మ‌రీ మార‌లేదు. కొన్ని విష‌యాలు జీవితంలో చేంజ్ అయ్యాయి. అంతేగానీ నేనేం మార‌లేదు. ఏ జోన‌ర్ క‌థ‌ను రాసుకుంటే దానికి న్యాయం చేస్తాను. పొలిటిక‌ల్ డ్రామా అంటే లీడ‌ర్ లాగా ఉంటుంది. స్టూడెంట్స్ అంటే హ్యాపీడేస్‌. అలాంటిద‌న్న‌మాట‌. ఇప్పుడు ఫిదా ల‌వ్‌స్టోరీ. బ్యూటీఫుల్‌గా పొయిటిగ్గా ఉంటాయి. మంచి వాన ప‌డుతున్న‌ట్టుంటుంది సినిమా.

Sekhar Kammula interview gallery

* మీ ప్ర‌తి చిత్రంలో హీరోయిన్ పాత్ర‌కు మంచి ప్రాధాన్యం ఉంటుంది..
- ఈ సినిమాలోనూ హీరో, హీరోయిన్లు ఈక్వెల్‌గా ఉంటారు. ప్ర‌తి ల‌వ్ స్టోరీలోనూ ఈక్వ‌ల్‌గానే ఉంటుంది. మామూలు సినిమాల్లో హీరోయిన్‌ని కాస్త ఎక్కువ‌గా చూపిస్తార‌ని అనుకుంటారేమో. ఈ సినిమాలో ఆమెకో యాటిట్యూట్ ఉంటే, అత‌నికి ఇంకో ర‌క‌మైన యాటిట్యూడ్ ఉంటుంది.

* నా కూతురిలాంటి సినిమా అని అన్నారు..
- నా ప్ర‌తి సినిమాను అలా చెబుతుంటాను. ఈ సినిమాను చూసిన త‌ర్వాత అమ్మాయిలు వాళ్ల‌కు క‌థ చెప్పిన‌ట్టే ఫీల‌వుతారు. నా కూతురు కూడా ఈ క‌థ‌లాగా ఉండాల‌ని అనుకుంటా. యాటిట్యూడ్ ఉండాలి.

* హీరోయిన్ కోసం 9 నెల‌లు వెయిట్ చేశార‌ట క‌దా..
- అలాంటిదేమీ కాదు. ఆమె బేసిగ్గా చ‌దువుతూ ఉండేది. ఒన్ ఇయ‌ర్ వ‌రుణ్ యాక్సిడెంట్ వ‌ల్ల మిస్ట‌ర్ ఫ‌స్ట్ రిలీజ్ అయి, ఇది త‌ర్వాత వ‌స్తోంది.

* మిస్ట‌ర్ ప్ర‌భావం ఏదైనా ఉంటుందా?
- లేదండీ. ఫిదా ఫిదాలాగానే ఉంటుంది.

* మూడేళ్ల త‌ర్వాత సినిమా అంటే మీ మాన‌సిక స్థితి ఎలా ఉంది?
- అలా అన‌లేం కానీ.. ఇప్పుడు రేడియోలో అంద‌రి ద‌ర్శ‌కుల పాట‌లూ వ‌స్తుంటాయి. నా పేరు వినిపించ‌దు. అలాగే నా పిల్ల‌లు చిన్న‌ప్పుడు ఉన్నప్పుడు సినిమాలు చేశాను. ఇప్పుడు వాళ్ల కాస్త పెద్ద‌వాళ్ల‌యిపోయారు. వాళ్ల‌కి నేను సినిమాలు తీస్తాన‌ని కూడా పెద్ద‌గా తెలియ‌దేమో. నాక్కూడా ఏంటంటే.. టేస్ట్ లు మారాయా? అనే ఆలోచ‌న‌లు లోప‌ల లోప‌ల ఉంటాయి కానీ.. ఈ సినిమా మాత్రం చాలా బాగా తీశా. ఇలాంటి సినిమాను ఇంత‌కు ముందు ఎవ‌రూ చూసి ఉండ‌రు.

* మీది ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్‌, దిల్‌రాజుగారిది వేరు. స్క్రిప్ట్ డిస్క‌ష‌న్‌లో ఎలా ఉండేది?
- స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్‌కీ, స్క్రిప్ట్ డిస్క‌ష‌న్‌కీ తేడా ఉంటుంది. నా స్క్రిప్ట్ ని ఒక సారి రాసుకున్నాక మార్చ‌డం అనేది నాకే కుద‌ర‌దు. ఎంత మార్చాల‌న్నా కొన్నిసార్లు క‌న్విన్స్ కాదు. కాబ‌ట్టి అలాంటిదేమీ ఉండ‌దండీ. శేఖ‌ర్‌క‌మ్ముల సినిమా కావాల‌నే దిల్‌రాజుగారు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. ఒక‌వేళ స్క్రిప్ట్ లో ఏమైనా చేయి పెట్టాల్సి వ‌స్తే మొద‌టికే దెబ్బ ప‌డుతుంద‌ని అంద‌రికీ తెలుసు. కాబ‌ట్టి నేను దిల్‌రాజుగారి నిర్మాణ విలువ‌ల‌ను కోరుకున్నా. ఆయ‌న రెండుసార్లు వ‌చ్చారు షూటింగ్‌కి. సినిమా చూశాక ఆయ‌న‌కు న‌చ్చింది. ఆయ‌న అస‌లు ఏదీ ట‌చ్ చేయ‌లేదు. ఆడియ‌న్‌గా కొన్ని ఒపీనియ‌న్స్ చెప్పారు. ఒక్క సీన్‌లో మాత్రం ఏదో కాస్త మార్చిన‌ట్టున్నాం అంతే.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved