ఈ సంక్రాంతి నాకు బాగా కలిసొస్తుంది...
- సినిమాను అల్రెడి చూశాం. అందరికీ బాగా నచ్చింది. సంక్రాంతి పండుగకు సాధారణంగా మన ఊర్లో, మన ఇంటికి బంధువులు అందరూ వచ్చి పోతుంటారు. అప్పుడు ఊరు కానీ, ఇళ్ళు కానీ ఓ రకమైన సందడిగా ఉంటుంది కదా..అలాంటి సందడి ఈ సినిమాలో కనపడుతుంది. సినిమాలో కూడా సంక్రాంతి పండుగనే సెలబ్రేట్ చేస్తారు. గతేడాదిలాగానే ఈ సంక్రాంతి నాకు బాగా కలిసొచ్చేలా కనపడుతుంది. అవుటండ్ అవుట్ సంక్రాంతి మూవీ `శతమానం భవతి`.
చిన్న చిన్న ఎమోషన్స్....
- మన కుటుంబంలో మన తల్లిదండ్రులతో ఎలా ఉంటున్నాం. మన చుట్టుపక్కల వారితో ఎలా ఉంటున్నామని, మన మధ్య ఉన్న చిన్న చిన్న ఎమోషన్స్‌ను చూపించే చిత్రమే ఈ `శతమానం భవతి`. ఇందులో బావామరదళ్ళ ప్రేమకథ కూడా ఉంటుంది. గొప్ప మెసేజ్ ఉన్న చిత్రం కాదు కానీ సినిమా చూసిన తర్వాత మంచి ఫీల్‌తో బయటకు వస్తారు.
సంక్రాంతి సినిమాలు గురించి....
- సంక్రాంతి అంటే వారం పది రోజులు సెలవులు వస్తాయి. ఈ టైంలో ఎన్ని సినిమాలు వచ్చినా ఏం పర్లేదు. గడాది నాలుగు సినిమాలు వచ్చినట్టుగానే ఈ సంక్రాంతికి కూడా నాలుగు సినిమాలు వస్తున్నాయి. టైం ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు అన్నీ సినిమాలను చూస్తారు.
చేసిన పాత్ర గురించి....
- ఈ సినిమాలో బాయ్ నెక్ట్స్ డోర్ క్యారెక్టర్ చేశాను. ఉచ్చరణ విషయంలో కాస్తా కేర్ తీసుకున్నాను. ఆనందాన్ని పది మందికి పంచాలనుకునే ఓ యువకుడిగా కనపడతాను. ఈ సినిమాతో నాకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఇంకా మంచి గుర్తింపు వస్తుందనుకుంటున్నాను.
Sharwanand interviewgallery
క్లారిటీ ఉంది....
- డైరెక్టర్ సతీష్ వేగేశ్న...మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్. ప్రతి సీన్‌ను క్లారిటీతో తీయడం వల్ల అనుకున్న విధంగా సినిమాను పూర్తి చేయగలిగాం.
ప్రతి పాత్ర ఆకట్టుకుంటుంది...
- సినిమాలో ప్రతి పాత్ర చాలా బావుంటుంది. అనుపమ పరమేశ్వరన్ నాకు మరదలిగా నటించింది. అద్భుతమైన నటి. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. అలాగే నరేష్‌గారి క్యారెక్టర్ కూడా బావుంటుంది.
పెళ్ళి గురించి...
- ఇప్పట్లో పెళ్ళి ఆలోచన లేదు. జరగాల్సినప్పుడు జరగుతుంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్...
- బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌గారి సినిమా షూటింగ్ పూర్తైంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ ఏడాదిన మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను.