pizza
Sharwanand interview (Telugu) about Radha
క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన `రాధ` చిత్రం ట్రీట్‌మెంట్ కొత్త‌గా ఉంటుంది - శ‌ర్వానంద్‌
You are at idlebrain.com > news today >
Follow Us

11 May 2017
Hyderabad

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శ‌త‌మానం భ‌వ‌తి వంటి వ‌రుస సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌తో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `రాధ‌`. ఈ సినిమాను మే 12న విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా...

* `రాధ` సినిమా చేయ‌డానికి కార‌ణం?
ఇందులో కొత్త‌గా ట్రై చేశానంటే నా పాత్రే. పాయింట్ వైజ్ రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్ర‌మే. ట్రీట్‌మెంట్ మాత్ర‌మే కొత్త‌గా ఉంటుంది. కృష్ణుడు, భ‌గ‌వ‌ద్గీత‌, పోలీస్‌.. వంటివ‌న్నీ ఈ సినిమాలో ఉంటాయి. 100కి డ‌య‌ల్ చేస్తే 365 రోజులు ఎప్పుడైనా కాపాడే డిపార్ట్ మెంట్ పోలీస్‌. మ‌నం పండుగ‌లు చేసుకున్నా వారు మ‌న‌ల్ని వ‌చ్చి కాప‌లా కాస్తుంటారు.. దీనికి నేను ట్రిబ్యూట్ ఈ సినిమా. స‌మ్మ‌ర్‌లు, వింటర్‌లు లేకుండా మ‌న‌ల్ని కాపాడుతాడు పోలీస్‌..

* క‌థ విన‌గానే ఫ‌స్ట్ ఫీలింగ్ ఏంటి?
- కాప్ స్టోరీస్ అన‌గానే, యాక్ష‌న్‌, పేజీలు పేజీలు డైలాగులు వంటివి ఉంటాయి క‌దా... అలా కాకుండా కృష్ణుడు అనేది తీసుకొచ్చి ఈ సినిమాను చాలా బాగా తీర్చిదిద్దారు. బేసిగ్గా హీరో కృష్ణుడుగా ఫీల‌వుతుంటాడు. ప‌క్క‌నున్న‌వారిని కూడా కుంతీ పుత్ర‌, అర్జునా అని పిలుస్తుంటాడు.

* క‌రెప్ట‌డ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రా?
- కాదు కాదు... ఇది చాలా సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ క‌థ‌. ఈ క‌థ‌ను చాలా సిన్సియ‌ర్‌గా చూపిస్తాం. పోలీస్ డిపార్ట్ మెంట్‌ని పాజిటివ్‌గా చూపించాం.

* ర‌ఫ్ బాడీ లాంగ్వేజ్ క‌నిపిస్తుంది?
- లేదండీ... నా బాడీ లాంగ్వేజ్ క‌నిపిస్తుంది. ఎక్స్ ప్రెస్ రాజా, ర‌న్ రాజా ర‌న్‌లాగా ఉండ‌దు. కానీ కొత్త‌గా ఉంటుంది. శ్రీకృష్ణుడైతే ఎలా చేస్తాడ‌ని ఆలోచించి నేను చేశాను.

* ప‌టాస్‌లోనూ క‌ల్యాణ్‌రామ్ పాత్ర కూడా ఇదేగా...
- అవునా... ఇందులో నేను ఎవ‌రినీ కొట్ట‌ను. శిక్ష వేయ‌డ‌మంటే భ‌గ‌వ‌ద్గీత చ‌దివించ‌డ‌మే. శ్లోకం.. సారాంశం కాదు.. సందేశ‌మే క‌రెక్ట్ అన్న‌ట్టు చెబుతాడు.

* భ‌గ‌వంతుడు పోలీస్‌ రూపంలో వ‌స్తాడ‌నే కాన్సెప్ట్ మీలో ఎందుకు వ‌స్తుంది?
- ఒకసారి రాధ అనే క్యార‌క్ట‌ర్ చిన్న‌త‌నంలో న‌డుచుకుంటూ వ‌స్తుంది. వెన‌క బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు ఏం కావాల‌న్నా నేనుంటాను. నేను ఆప‌ద‌ల నుంచి ర‌క్షిస్తాను అని చెబుతుంది.. స‌రిగా ఆ స‌మ‌యంలోనే అత‌ను ప‌క్క‌న ఎక్క‌డో కాలువ‌లో ప‌డ‌బోతాడు. స‌మ‌యానికి ఓ పోలీస్ వ‌చ్చి కాపాడుతాడు. అంటే కృష్ణుడు పోలీస్ రూపంలో వ‌చ్చి కాపాడాడు అని పిల్లాడికి మ‌న‌సులో ప‌డిపోతుంది. అప్ప‌టి నుంచి కేక్ క‌టింగుల నుంచి, ఫ్యాన్సీ డ్ర‌స్సుల నుంచి ఏదైనా `రాధ‌`కు పోలీస్ డ్ర‌స్సే.

* మీరు స్పిరిచువ‌ల్ ప‌ర్స‌నా?
- అవునండీ. నేను స్పిరిచువ‌లే.

* భ‌గ‌వ‌ద్గీత చదివారా?
- చ‌దివానండీ.. కాక‌పోతే మొత్తం కాదు. కొన్ని కొన్ని పార్టులు మాత్రం చ‌దివాను.

* మీరు సీరియ‌స్ పాత్ర‌లు చేశారు.. ఇప్పుడు ఎంట‌ర్‌టైనింగ్ పాత్ర‌లు చేశారు.. తేడా ఎలా ఉంది?
- సీరియ‌స్ పాత్ర‌లు న‌న్ను న‌టుడిగా నిల‌బెట్టాయి. కానీ ఈ మ‌ధ్య చేస్తున్న ఎంట‌ర్‌టైనింగ్ పాత్ర‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి అమిత‌మైన స్పంద‌న వ‌స్తోంది.

* ప్ర‌స్థానం త‌ర‌హా చిత్రాలను మ‌ర‌లా చేయ‌రా?
- శ‌త‌మానం భ‌వతిలో నేను చేసింది ఆ త‌ర‌హా పాత్రే. నా చుట్టూ ఉన్న వాళ్లు కామెడీ చేస్తుంటారు కానీ, నేను చేయ‌ను. వాళ్లంద‌రితో పాటు ఫ్రేములో ఉంటానంతే. అలాంటి పాత్ర‌లు చేసి చేసీ నాకే బోర్ వ‌చ్చేసింది. స‌ర‌దాగా చేస్తున్న ఈ సినిమాలు ఇప్పుడు బావున్నాయి.

* పోలీస్ అన‌గానే మాస్ ఎలిమెంట్స్ ని ప్రేక్ష‌కులు ఆశిస్తారేమో..
- ఉంటాయండీ. మాస్ విష‌యాలు కూడా ఉంటాయి. కాక‌పోతే ఈ చిత్రంలో నా పేరు రాధాకృష్ణ‌. అంద‌రూ రాధ అని పిలుస్తారు. హీరోయిన్ పేరు రాధ‌. ఫ్యామిలీ ఆడియ‌న్స్ కూడా వ‌స్తార‌ని రాధ అనే టైటిల్ పెట్టాం. అలా టైటిల్ చాలా బాగా కుదిరింది.

* శ‌త‌మానం భ‌వ‌తిక‌న్నా ముందే ఈ సినిమాను మొద‌లుపెట్టిన‌ట్టున్నారు..
- అవునండీ. నిజ‌మే. శ‌త‌మానం భ‌వ‌తిక‌న్నా ముందే ఈ సినిమాను మొద‌లుపెట్టాం. కాక‌పోతే ఆ సినిమా సంక్రాంతి అంశాల‌తో ఉండ‌టం వ‌ల్ల సంక్రాంతికి విడుద‌లైతే మంచిద‌ని రాజుగారు అన‌డంతో, వాళ్లూ వాళ్లూ మాట్లాడుకుని, ముందు ఆ సినిమాను చేశాం. ఆ త‌ర్వాత ఈ సినిమా ముందుకొస్తోంది.

* ఈ మ‌ధ్య శ్రీకాంత్ అడ్డాల కూడా మీకు ఓ స్టోరీ చెప్పార‌ని వార్త‌లొచ్చాయి..
- నేను ఇంకా ఏదీ ఫైన‌లైజ్ చేయ‌లేదు.

* త‌మిళ సినిమాల‌కు వెళ్లే ఆలోచ‌న గురించి చెప్పండి?
- త‌మిళ చిత్రాల‌కు వెళ్లాలంటే ఎక్స్ ట్రార్డిన‌రీ క‌థ అని అనిపించాలి. ఈ మ‌ద్య‌నే జ‌ర్నీ డైర‌క్ట‌ర్ శ‌ర‌వ‌ణ‌న్ కూడా వ‌చ్చి ఓ క‌థ చెప్పాడు. అంత ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించ‌లేదు. ఆ మాటే అత‌నికి చెప్పా.

* ఇప్పుడు మీ జ‌ర్నీ ఎలా ఉంది?
- చాలా ప్ర‌శాంతంగా ఉంది.

* అస‌లు మీకు ఈ ఫీల్డ్ బ‌ర్డ‌న్‌గా అనిపించిందా?
- ప్ర‌తి సినిమాకూ నాకు బ‌ర్డ‌న్ ఉంటూనే ఉంటుంది. అన్నీ స‌రిగా ఉన్నాయ‌ని అనుకున్నా.. మీడియా వాళ్లు ఏమంటారో.. ఇంకెవ‌రు ఏమంటారో అనే ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది.

* `శ‌త‌మానం భ‌వ‌తి` త‌ర్వాత మీ క‌థ‌ల ఎంపిక‌లో ఏమైనా మార్పులు వ‌చ్చాయా?
- అలాంటిదేమీ లేదండీ. నేను ఈ రంగంలోకి వ‌చ్చిన‌ప్పుడు ఎలా ఉన్నానో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను.

interview gallery

* సోష‌ల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండ‌రెందుకు?
- నాకు ఆ గోల ప‌ట్ట‌దు. దాన్లో ఎవ‌రేమి రాస్తారో నాకు తెలియ‌దు. అవ‌న్నీ ప‌ట్టించుకోవ‌డం వేస్ట్ అండీ.

* వేదాంత ధోర‌ణి వ‌చ్చేసిన‌ట్టుందండీ...
- అలాంటిదేమీ లేదండీ. నేను ఎప్పుడూ ఇలాగే ఉన్నాను.

* లావ‌ణ్య గురించి చెప్పండి?
- సూప‌ర్ అండీ. ఎప్పుడూ న‌వ్వుతూనే ఉంటుంది. తిట్టినా న‌వ్వుతూనే ఉంటుంది.

* మీరు ఏ హీరోయిన్‌తోనైనా ఇబ్బందులు వ‌చ్చాయా?
- నాకు ఎవ‌రితోనూ రాలేదండీ. కాక‌పోతే తెలుగు సినిమాలో నేను తెలుగులో డైలాగులు చెబుతుంటే, ఎదురుగా అమ్మాయి హిందీలో డైలాగులు చెబితేనే ఇబ్బంది.. అందుకే ముందు ద‌ర్శ‌కుడిని.. ఆ అమ్మాయి తెలుగు మాట్లాడుతుందా? లేదా? అని అడుగుతా. తెలుగు మాట్లాడుతుంద‌ని అంటే నాకు హ్యాపీ.

* మారుతి సినిమా ఎంత వ‌ర‌కు వ‌చ్చింది?
- ఒక షెడ్యూల్ పూర్త‌యింది.

* సుధీర్‌తో సినిమా అని అన్నారు..
- సుధీర్‌తో ఉంటుంది.. కానీ క‌థ బౌండెండ్‌గా రావాలి.

* మీ దృష్టిలో అలా చేయాల్సిన వాళ్లు ఎంద‌రున్నారండీ?
- ఆరేడుగురు ఉన్నారండీ.

* బౌండ్ స్క్రిప్ట్ రానిదే సినిమా చేయ‌ర‌ట క‌దా..
- అవునండీ. దాని వ‌ల్ల చాలా ఉప‌యోగం ఉంటుంది. నిర్మాత‌కు కూడా చాలా బ‌డ్జెట్ మిగులుతుంది.

* మీ సినిమాల‌కు బ‌డ్జెట్ ఏమైనా పెంచుతున్నారా?
- అలాంటిదేమీ లేదండీ. నా సినిమాల‌కు 10-15 కోట్ల బ‌డ్జెట్ చాలు. అంత‌కు మించి ఎక్కువ వ‌ద్దండి. ఒక‌వేళ పెట్ట‌గ‌ల స్క్రిప్ట్ వ‌చ్చినా ఇద్ద‌రు, ముగ్గురు క‌లిసి చేస్తే ఓకే.

* ప్రొడ‌క్స‌న్ చేస్తున్నారా?
- లేదండీ. దానికి చాలా లెక్క‌లు తెలిసి ఉండాలి. టైమ్ పెట్ట‌గ‌ల‌గాలి. డిస్ట్రిబ్యూష‌న్ వ్య‌వ‌హారం తెలియాలి. అబ్బో చాలా ఉంటుంది. అవ‌న్నీ అవ‌గాహ‌న‌లోకి వ‌స్తేనే చేయాలి... లేకుంటే చేయ‌కూడ‌దు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved