pizza
Shriya Sharma interview (Telugu) about Nirmala Convent
I Am Very Happy To Work With A Star Hero Like Nagarjuna - Shriya Sharma
నాగార్జున వంటి స్టార్ హీరోతో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీగా ఫీల‌య్యాను - శ్రియా శ‌ర్మ‌
You are at idlebrain.com > news today >
Follow Us

13 September 2016
Hyderaba
d

Under the presentation of 'King' Nagarjuna in his Annapurna Studios banner, Hero Srikanth's son Roshan is debuting as hero in 'Nirmala Convent'. Shriya Sharma is playing as heroine in this film. This youthful entertainer is combinely produced by Annapurna Studios, Matrix Team Works, Concept Film Productions. Nagarjuna played a very crucial role in this film. 'Nirmala Convent' is scheduled to release on September 16th. On this occasion Shriya Sharma shared details about her character in the film.

About Background
I am from Himachal Pradesh. Father is an engineer and mother is a dietitian. Working in several AD's and Serial's since i was a kid, developed my interest towards acting.

About Character
'Nirmala Convent' is a fresh, pure and inspiring love stroy. I played the role of a girl named 'Shanthi'. Contrary to her name, Shanthi is full of anger and envy. Most of the Girls will connect with my character in this film.

Working With Superstars
I debuted as heroine with 'Gayakudu' film. Earlier i was acted with superstars like Chiranjeevi, Rajinikanth, Shahrukh Khan. Coming to 'Nirmala Convent' I worked with Nagarjuna sir for 'Kotha Kotha Bhaasha...' song. I am very happy working with such a big star and i also learned a lot of things from him.

Working Experience WIth Roshan
Even though this is first film for Roshan, he is very confident before camera and gave a very good performance. We both discuss about the scenes before performing them before camera.

About Director
Director G. Nagakoteswara Rao sir did a great job in making the film. He dealt each and every scene filled with freshness. He took care in each and every detail. He is the main reason behind the film's output which is really come out very well.

About Roshan Saaluri
Music by Roshan Saaluri has already been a huge hit in the market. He is the main reason behind Nagarjuna sir's singing for a song in this film. That song has became instant chart buster and created sensation. He also gave beautiful background score for the film. my favourite songs is 'Muddu' song in the album. Lyrics and picturisation are too good for that song.

Future Films
Currently I am waiting for the release of 'Nirmala Convent'. AFter this film only i will think about my next film in Telugu. A couple of offers came in my way, but nothing has been finalised yet. I will be doing a film in Hindi very soon.

Shriya Sharma interview gallery

నాగార్జున వంటి స్టార్ హీరోతో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీగా ఫీల‌య్యాను - శ్రియా శ‌ర్మ‌

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌, శ్రియా శర్మ హీరో హీరోయిన్లుగా హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, కాన్సెప్ట్‌ ఫిలిం ప్రొడక్షన్‌ బ్యానర్స్‌ నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'నిర్మలకాన్వెంట్‌' కింగ్‌ నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ శ్రియా శర్మ చిత్ర విశేషాలను తెలియజేశారు....

నేపథ్యం...
- మాది హిమాచల్‌ ప్రదేశ్‌. నాన్నగారు ఇంజనీర్‌, అమ్మ డైటిషియన్‌. చిన్నప్పట్నుంచి పలు యాడ్స్‌, సీరియల్స్‌లో నటించడంతో నటన అంటే ఆసక్తి పెరిగింది.

క్యారెక్టర్‌....
- 'నిర్మలాకాన్వెంట్‌' ఫ్రెష్‌, ప్యూర్‌ అండ్‌ ఇన్‌స్పైరింగ్‌ లవ్‌స్టోరీ. ఈ చిత్రంలో శాంతి అనే అమ్మాయి పాత్రలో కనపడతాను. చాలా కోపం. అసూయ ఉండే అమ్మాయే శాంతి. ఈ సినిమా చూసేటప్పుడు అమ్మాయిలు నా పాత్రతో బాగా కనెక్ట్‌ అవుతారు.

సూపర్‌స్టార్స్‌తో నటించాను....
- నేను గాయకుడు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చాను. అంత కంటే ముందు చిరంజీవిగారు, రజీనీకాంత్‌, షారూక్‌ఖాన్‌ వంటి సూపర్‌స్టార్స్‌తో యాక్ట్‌ చేశాను. ఇక నిర్మలాకాన్వెంట్‌ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో నాగార్జునగారితో కొత్త కొత్త భాష..సాంగ్‌లో యాక్ట్‌ చేశాను. అంత పెద్ద నటుడితో యాక్ట్‌ చేయడం హ్యాపీగా అనిపించింది. చాలా కొత్త విష‌యాలు నేర్చుకున్నాను.

రోషన్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌....
- రోషన్‌కు ఇదే తొలి సినిమా, అయినా తను చాలా కాన్ఫిడెంట్‌గా యాక్ట్‌ చేశాడు. సీన్స్‌ ఎలా చేయాలనేది ఇద్దరం డిస్కస్‌ చేసి చేశాం.

దర్శకుడు గురించి...
- డైరెక్టర్‌ జి.నాగకోటేశ్వరరావుగారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి సీన్‌ను చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. సినిమా ఇంత బాగా వచ్చిందంటే ఆయనే కారణం. ప్రతి విషయంలో ఎంతో కేర్‌ తీసుకోవడమే కాకుండా మంచి అవుట్‌పుట్‌ రావడానికి ఎంతగానో శ్రమించారు.

రోషన్‌ సాలూరి...
- రోషన్‌ సాలూరి దర్శకత్వంలో వచ్చిన ఆడియో అల్రెడి చాలా పెద్ద హిట్‌ అయ్యింది. తన వల్లనే నాగార్జునగారు పాట పాడారు. ఆ పాట సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ట్యూన్స్‌తో పాటు మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అందించారు. ఈ ఆల్బమ్‌లో ముద్దు సాంగ్‌ నాకు బాగా ఇష్టమైన సాంగ్‌. ఆ సాంగ్‌లో లిరిక్స్‌ కానీ, పిక్చరైజేషన్‌ కానీ చాలా బావుంటాయి.

తదుపరి చిత్రాలు...
- తెలుగులో 'నిర్మలాకాన్వెంట్‌' సినిమా విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నాను. ఈ సినిమా తర్వాతే తెలుగులో నెక్ట్స్‌ మూవీ గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అలాగే హిందీలో కూడా ఓ సినిమా చేయబోతున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved