pizza
Siddhi Idnani interview (Telugu) about Prema Katha Chitram 2
నేను స‌మంత‌కు పెద్ద ఫ్యాన్‌ని! - సిద్ధి ఇద్నాని
You are at idlebrain.com > news today >
Follow Us

30 March 2019
Hyderabad

శ్రీనివాస్ రెడ్డి హీరోగా న‌టించిన `జంబ‌ల‌కిడి పంబ‌` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఉత్త‌రాది భామ స‌ద్ధి ఇద్నాని. ఆమె న‌టించిన `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్2` ఏప్రిల్ 6న విడుద‌ల కానుంది. ఇందులో సుమంత్ అశ్విన్ హీరో. నందితా శ్వేత నాయిక‌. ఈ సినిమాలో మ‌రో నాయిక‌గా న‌టిస్తున్న సిద్ధి ఇద్నాని శ‌నివారం విలేరుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* చెప్పండి. ఎలా ఉంది హైద‌రాబాద్‌? ఇక్క‌డేం ఇష్టం?
- బాగా అల‌వాటైపోయింది. ఇక్క‌డ ఎప్పుడూ బిర్యానీని ఇష్ట‌ప‌డ‌తాను. ఒక్కో హోట‌ల్‌లో ఒక్కో రుచితో బిర్యానీ ఉంటుందిక్క‌డ‌.

* జంబ‌ల‌కిడి పంబ నిరుత్సాహ‌ప‌రిచిందా?
- నిజ‌మే. ఆ సినిమా బాగా ఆడి ఉంటే, ఇంకో స్థాయిలో ఉండేదాన్నేమో.

* ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2లో అవ‌కాశం ఎలా వ‌చ్చింది?
- జంబ‌ల‌కిడి ట్రైల‌ర్ విడుద‌ల కాగానే నాకు ఈ ఆఫ‌ర్ వ‌చ్చింది. మా నిర్మాత `జంబ‌ల‌కిడి పంబ‌` ట్రైల‌ర్‌, ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ చూశార‌ట‌. అబ్బాయిలా నేను న‌టించిన తీరు చూసి ఆ చిత్ర ప్రొడ్యూస‌ర్‌కి ఫోన్ చేసి నా నెంబ‌రు తీసుకున్నారు. నాతో మాట్లాడారు. న‌న్ను ఆడిష‌న్ ఇవ్వ‌మ‌ని ఏమీ అడ‌గ‌లేదు. ఇది స్టోరీ, ఇది కేర‌క్ట‌ర్ అని చెప్పారంతే. స‌రేన‌ని ఒప్పుకున్నా.

* మీ పాత్ర గురించి చెప్పండి?
- ఇందులో నా పాత్ర పేరు బిందు. కాలేజీ గోయింగ్ గ‌ర్ల్. బ‌బ్లీగా ఉంటాను. గ‌ర్వం ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి ఎవ‌రినైనా ఇష్ట‌ప‌డితే వాళ్లు త‌న‌ను ఇష్ట‌ప‌డాల్సిందే. ఒక‌వేళ ఇష్ట‌ప‌డ‌క‌పోతే త‌ను ఒప్పుకోదు.

* మీ తొలి చిత్రానికీ, దీనికీ చాలా తేడా ఉన్న‌ట్టుంది?
- నిజ‌మే. నా తొలి సినిమాకు, ఈ సినిమాకూ చాలా తేడా ఉంటుంది. తొలి సినిమాలో హౌస్ వైఫ్‌గా చేశాను.
* తొలి పార్టుకు, ఈ పార్టుకు సంబంధం ఉంటుందా?
- తొలి భాగంలో సుధీర్‌బాబు చేసిన పాత్ర‌లో ఈ చిత్రంలో సుమంత్ చేశారు. దెయ్యం పోర్ష‌న్ ఇందులో వేరుగా ఉంటుంది. ఇందులో దెయ్యం ఎవ‌ర‌న్న‌ది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

* ఈ సినిమాను చేయ‌డానికి క‌ష్ట‌ప‌డ్డారా?
- క‌ష్టం ఏమీ లేదు. తొలి పార్ట్ మెగా హిట్ అని నాకు తెలుసు. సెకండ్ హాప్ త‌ప్ప‌కుండా బావుండాల‌నే స్ట్రెస్ అయితే ఉంది. ఇందులో కొన్ని ఎక్స్ ట్రీమ్‌లీ చాలెంజింగ్ సీన్లున్నాయి. మామూలుగా కొంత హ్యాపీనెస్‌, యాంగ‌ర్ వంటి భావాల‌ను ప‌లికించాల్సి వ‌చ్చిన‌ప్పుడు తేలిగ్గానే ప‌లికిస్తాం. ఎందుకంటే అవ‌న్నీ మ‌న రెగ్యుల‌ర్ జీవితంలోనూ ఎక్స్ పీరియ‌న్స్ చేస్తాం. కానీ పొసెస్డ్ గా ఉండ‌టం ఎలా? ఆ విష‌యంలో చాలా హోమ్ వ‌ర్క్ చేశా. హ‌రిగారు చాలా బాగా సీన్లువివ‌రించారు.

interview gallery* ఈ సినిమా మీ పాత్ర మీ రియ‌ల్ లైఫ్‌కి ద‌గ్గ‌ర‌గా ఉంటుందా?
- నిజ‌మే. నా రియ‌ల్ లైఫ్‌కి నా పాత్ర చ‌లా ద‌గ్గ‌ర‌గా ఉంటుంది.

* సుమంత్ అశ్విన్ తో ప‌నిచేయ‌డం ఎలా ఉంది?
- త‌ను చాలా డౌన్ టు ఎర్త్ ఫెలో. అత‌నికి సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉంద‌ని నాకు తెలుసు. నిజానికి అత‌నికి చాలా యాటిట్యూడ్ ఉండాలి. కానీ అత‌నికి లేదు. ఫుడ్ గురించి, ట్రావెల్ గురించి చాలా మాట్లాడుకున్నాం.

* ఇందులో నందిత శ్వేత‌తో మీకు సీన్లున్నాయా?
- ఉన్నాయి. నందిత శ్వేత‌తో నాకు మూడు నుంచి, నాలుగు సీన్లున్నాయి. నందిత ఇంత‌కు ముందు కూడా స్కేరీ సినిమాలు చేసింది. కానీ నాకు మాత్రం చాలా కొత్త‌గా అనిపించింది. అందుకే నేను నందితా శ్వేతా ప్రీవియ‌స్‌ సినిమాలు చూశాను. కాంచ‌న‌, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడాతో పాటు తాప్సీ సినిమా కూడా చూశాను.

* మీరు సూప‌ర్ నేచుర‌ల్ ప‌వ‌ర్ గురించి న‌మ్ముతారా?
- సూప‌ర్ నేచుర‌ల్ ప‌వ‌ర్ గురించి న‌మ్ముతాను. ఆత్మ‌లుంటాయ‌ని నేను న‌మ్ముతా. నేను ఒక‌సారి కారులో వెళ్తుంటే కారు స‌డ‌న్‌గా స్టాప్ అయింది. డ్రైవింగ్ సీట్ వ‌ర‌కు వ‌చ్చి ఒక‌ లేడీ క‌నిపించింది. రెడ్ శారీలో క‌నిపించింది. నేను నా లైఫ్‌లో ఒక‌సారి త‌ప్ప‌కుండా ఆ అనుభ‌వంతో సినిమా చేస్తాను.

* మీ నెక్స్ట్ మూవీ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది?
- 50 శాతం పూర్త‌యింది. మే ఎండ్‌, జూన్‌లో విడుద‌ల‌వుతుంది.

* ఇంకేం చేస్తున్నారు?
- ఇంకో సినిమాకు సంత‌కం చేస్తున్నా. ఈ నెలాఖ‌రున ఫ్లోర్ మీద‌కు వెళ్తుంది

* ఎలాంటి సినిమాలు చేయాల‌నుకుంటున్నారు?
- నాకు స్క్రిప్ట్ చాలా కీల‌కం.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని కోరిగ్గా ఉంది. స‌మంత ఎంపిక చేసుకుంటున్న త‌ర‌హా సినిమాలు చేయాల‌ని ఉంది. ఆమెకు నేను అభిమానిని. మా సినిమాక‌న్నా ఒక రోజు ముందు ఆమె న‌టించిన `మ‌జిలీ` విడుద‌ల కానుంది.Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved