pizza
Siddhi Idnani interview (Telugu) about Jamba Lakidi Pamba
ఇక్క‌డుంటే తెలుగు నేర్చుకోవాల్సిందే! - సిద్ధి ఇద్నానీ
You are at idlebrain.com > news today >
Follow Us

17 June 2018
Hyderabad

సింధీ భామ సిద్ధి ఇద్నానీ న‌టించిన తొలి తెలుగు సినిమా `జంబ‌ల‌కిడి పంబ‌`. శ్రీనివాస‌రెడ్డి హీరోగా న‌టించిన చిత్ర‌మిది. మ‌ను ద‌ర్శకుడు. ఈ నెల 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్‌లో ఆదివారం ఉద‌యం సిద్ధి ఇద్నాని విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

- మా నాన్న సింధీ. మా అమ్మ గుజ‌రాతీ. వాళ్ల‌ది ప్రేమ వివాహం. మా అమ్మ హిందీ టెలివిజ‌న్ సీరియ‌ల్స్, గుజ‌రాతీ చిత్రాల్లో న‌టించేవారు. నాన్న‌కు బ్యాగ్స్ బిజినెస్ ఉంది. నాన్న‌కు ఏడు భాష‌లు వ‌చ్చు. ఆయ‌న‌కు వాయిస్ మోడులేష‌న్స్ బాగా వ‌చ్చు. మా నాన్నకి స్పీకింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి. నా చిన్న‌త‌నంలో నేను మా అమ్మతో సీరియ‌ల్ సెట్‌కి వెళ్లేదాన్ని. అప్ప‌ట్నుంచే ఇండ‌స్ట్రీని ద‌గ్గ‌ర నుంచి చూసేదాన్ని. ఓ గుజ‌రాతీ నాట‌కానికి నేను అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా ప‌నిచేశాను. వాళ్లు న‌న్ను యాక్టింగ్ చేయ‌మ‌న్నారు. నేను ప్లేలో న‌టించాను. అప్పుడు నాకు 17 ఏళ్లు. ఆ త‌ర్వాత దేవాంక్ ప‌టేల్‌తో గుజ‌రాతీ సినిమా చేశాను. గ్రాడ్యుయేష‌న్ స‌ర్టిఫికెట్ చాలా ఇంపార్టెంట్‌. అందుకే నేను ఆడి నేష‌న‌ల్ కాలేజీలో బ్యాచ్‌ల‌ర్ ఆఫ్ మాస్ మీడియా చేశాను.

- ఓ వైపు సీరియ‌ల్స్, క‌మ‌ర్షియ‌ల్స్ చేస్తుండ‌గా ఓ ఏజెన్సీ వాళ్లు ఫోన్ చేసి తెలుగు సినిమా ఉంద‌ని చెప్పారు. నాకు తెలుగు తెలియ‌దు కానీ త‌ప్ప‌కుండా చేస్తాను అని అన్నాను. ఆడిష‌న్‌కి వెళ్లాను. నాకు ముందు ఇంకో న‌లుగురు అమ్మాయిలు ఉన్నారు. స్క్రిప్ట్, డైలాగులు ఉన్నాయా అని అడిగితే ఫ‌ర్వాలేద‌న్నారు. టెస్ట్ పెట్టారు. 4 లైన్లు తెలుగులో చెప్ప‌మ‌ని అడిగారు. స్క్రిప్ట్ పేప‌ర్ చూసి, ఐదు నిమిషాల త‌ర్వాత `నేను రెడీ ` అని చెప్పాను. రెండు రోజుల త‌ర్వాత హైద‌రాబాద్‌కి ర‌మ్మ‌ని పిలిచారు. మ‌నుగారు, నిర్మాత‌లు, శ్రీనివాస‌రెడ్డి ఉన్నారు. నా క‌ళ్లు, నా న‌వ్వు చూసి నేను చేస్తాన‌ని వాళ్లు న‌మ్మారు.

- `జంబ‌ల‌కిడి పంబ` సినిమాలో ఇంట‌ర్వెల్ త‌ర్వాత రోల్స్ ఎక్సేంజ్ అవుతాయి. అబ్బాయిగా న‌టించ‌డం అంత తేలిక కాదు. డ్యాన్స్ చేయ‌డం ఈజీ. కానీ చేంజింగ్ ప‌ర్స‌నాలిటీ ఈజీ కాదు. అబ్బాయిలా మాట్లాడ‌టం, న‌డ‌వ‌డం అన్నీ వేరుగా ఉంటాయి. నేను శ్రీనివాస‌రెడ్డిలాగా క‌నిపించ‌డానికి ఆయ‌న గ‌త‌ సినిమాలు అన్నీ చూశాను. ఆయ‌న ఎలా న‌డుస్తాడు? ఎలా మాట్లాడుతాడు? వ‌ంటివ‌న్నీ తెలుసుకున్నా. అది చాలా ఇంపార్టెంట్‌. చాలా వ‌ర్క్ షాప్‌లు కూడా చేశాం.

- ఇందులో నేను ఫ‌స్టాఫ్‌లో డిజైన‌ర్‌గా క‌నిపిస్తాను. శ్రీనివాస‌రెడ్డి పాత్ర‌ను ప్రేమిస్తాను. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డుతాం. ఈ జ‌న‌రేష‌న్‌లో ప్రేమించామా? పెళ్లి చేసుకున్నామా? అని అంటామే కానీ, త‌ర్వాత ఏంటి? గొడ‌వ‌లు వ‌చ్చినా త‌ట్టుకోగ‌ల‌గాలి. కానీ అలా త‌ట్టుకోవ‌డం లేదు. విడాకులు కావాలి అని అనుకుంటున్నాం. అలాంటి ట్విస్ట్ అండ్ ట‌ర్న్స్ అన్నీ ఉంటాయి. ఇంట‌ర్వెల్ త‌ర్వాత మా సోల్స్ ఎక్సేంజ్ అవుతాయి. కొన్ని ప్రాబ్ల‌మ్స్ ఉంటాయి. అమేజింగ్ పాత్ర‌లున్నాయి.

- నేను తెలుగు అంత బాగా మాట్లాడ‌ను. తొలుత నాకు ప్రాప్టింగ్ ఇస్తాన‌ని అన్నారు. కానీ నేను థియేట‌ర్ నుంచి వ‌చ్చాను కాబ‌ట్టి నాకు తెలిసి ప్రాప్టింగ్ అనేది చాలా మెకానిక‌ల్‌గా ఉంటుంది. నా నుంచి ఎమోష‌న్స్ కావాలంటే జ‌స్ట్ కాపీ చేయ‌డం వ‌ల్ల రాదు. అందుకే నేను నా డైలాగులు, శ్రీనివాస‌రెడ్డి డైలాగుల‌ను బ‌ట్టీ ప‌ట్టేశాను. కొంత ఇబ్బంది అయినా నేర్చుకున్నాను.

interview gallery



జంబ‌లకిడి పంబ అంటే ఫ‌న్నీ స్టేట్‌మెంట్ అని అన్నారు. జంబ‌ల‌కిడి పంబ పాత సినిమా కూడా చూశాను. నా హోమ్ వ‌ర్క్ లో భాగంగా ఆ సినిమా చూశాను. ఆ సినిమాకీ, మాకూ పోలిక ఉండ‌దు. ఇందులో హీరో, హీరోయిన్లు సోల్స్ మాత్రం ఎక్సేంజ్ అవుతాయి.

- ఇప్పుడు గుజ‌రాత్‌లో ఇంకే సినిమాలు చేయ‌డం లేదు. నా దృష్టిలో యాక్టింగ్ అంటే యాక్టింగే. భాష క‌న్నా భావాలు ఎక్కువ‌గా మాట్లాడుతాయి. నాకు కేర‌క్ట‌ర్ , స్క్రిప్ట్ చాలా కీల‌కం.

- శ్రీనివాస‌రెడ్డిని తొలిసారిని నేను క‌లిసిన‌ప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. నేను, పోసాని, శ్రీనివాస‌రెడ్డి క‌లిసి తొలి సీన్ చేశాం. ఆ టేక్ ఒకే ఒక షాట్‌తో ఓకే చేశారు. అప్ప‌టి నుంచి ఇక వెనుక తిరిగి చూడాల్సిన అవ‌స‌రం లేదు. అంద‌రితోనూ గౌర‌వ‌ప్ర‌ద‌మైన కెమిస్ట్రీ కుదిరింది.న‌న్ను కొత్త‌దానిలా చూడ‌లేదు. అంత గౌరవించేవారు. శ్రీనివాస‌రెడ్డి అమేజింగ్ యాక్ట‌ర్‌. ఆయ‌న కామిక్ టైమింగ్స్ కూడా చూశాను. ఆయ‌న హీరోగా ఎంపిక చేసుకునే స్క్రిప్ట్ ల‌న్నిటిలోనూ హీరోయిన్ల‌కు కూడా స‌మ ప్రాధాన్య‌త ఉంటుంది. అది చాలా గొప్ప విష‌యం.

- కామెడీ చేయ‌డం చాలా ట‌ఫ్‌. అందులోనూ లాంగ్వేజ్ తెలియ‌న‌ప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎక్క‌డ పంచ్ వేయాలో, ఎక్క‌డ స్ట్రెస్ చేయాలో మ‌న‌కు తెలియ‌దు. అందుకే ఇక్క‌డ ఉండాలంటే మ‌న‌కు లాంగ్వేజ్ తెలియాలి. ఇప్పుడు నాకు తెలుగు తెలుసు. నేను ఆరు నెల‌లుగా ఇక్క‌డున్నాను. నేను ఇంగ్లిష్ టు తెలుగు క్లాసెస్ తీసుకుంటున్నాను.

- ఈ చిత్రం ఆడియ‌న్స్ కి చాలా బావుంటుంది. త‌ప్ప‌కుండా ఈ సినిమాతో అంద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. ఎందుకంటే చాలా ఫ‌న్నీగా ఉంటుంది. ఇప్పుడున్న‌ది ఇంపల్సివ్ జ‌న‌రేష‌న్‌. అలాంటివారికి ఈ సినిమా చాలా నేర్పుతుంది. చాలా మంది న‌టీన‌టులున్నారు. ఇందులో యాక్ష‌న్ సీక్వెన్స్ ఉన్నాయి. మాస్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. పిల్ల‌ల‌తో, మ‌న‌వ‌ళ్ల వెళ్లినా ఎంజాయ్ చేయొచ్చు.

- నేను ఇప్పుడు క‌థ‌లు వింటున్నా. ఇంకా ఏ సినిమాకీ సంత‌కం చేయ‌లేదు. 22 వ తేదీ ఈ సినిమా త‌ర్వాత మిగిలిన చిత్రాల‌కు సంత‌కం చేస్తాన‌ని అన్నాను.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved