pizza
Sidhu Jonnalagadda interview about Guntur Talkies
సినిమాల్లోకి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చాను – సిద్ధు జొన్నలగడ్డ
You are at idlebrain.com > news today >
Follow Us

29 February 2016
Hyderaba
d

నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుంటూర్‌ టాకీస్‌’. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, నరేష్‌ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సిద్ధు జొన్నలగడ్డతో ఇంటర్వ్యూ....

సినిమాల్లో ఎంట్రీ.....
-మా అమ్మగారు ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేసేవారు. నాకు మ్యూజిక్ పై ఆసక్తి ఉండటంతో తబలా నేర్చుకున్నాను. చిన్నప్పటి నుండి సినిమాల్లోకి రావాలనే ఆసక్తి లేదు. భీమలి కబడ్డీ జట్టు సినిమా టైంలో ఓ వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారికి నేను నచ్చడంతో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కు నన్ను సెలక్ట్ చేశారు. ఆ తర్వాత వలినం సినిమాలోకి నటించాను. అలా సినిమాల్లో ఎంట్రీ అనుకోకుండా జరిగింది.

క్యారెక్టర్ గురించి....
-ఈ సినిమాలో హరి అనే స్లమ్ ప్లే బోయ్ పాత్రలో నటించాను. మెడికల్ షాప్ లో పనిచేస్తుంటాను. చిన్న చిన్న దొంగతనాలు చేసే పాత్ర. నాతో పాటు గిరి అనే మరో వ్యక్తి కూడా ఉంటాడు. అంటే సినిమా ఇద్దరి దొంగ వెధవల దరిద్రమైన కథ. ఇక ఘటనతో అనుకోకుండా వారి జీవితాల్లో మార్పు వస్తుంది. ఆదేంటనేది సినిమాలో చూడాల్సిందే. ప్రవీణ్ గారి ఎల్.బి.డబ్ల్యు సినిమాలో యాక్ట్ చేశాను. ప్రవీణ్ సత్తారు గారి మూవీస్ సెటిల్డ్ గా, రియలిస్టిక్ గా ఉంటాయి.

Sidhu Jonnalagadda interview gallery

 

సినిమాటిక్ గా టుంది....
-గుంటూరు బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా. అందుకే ఈ టైటిల్ పెట్టాం. కన్ ఫ్యూజన్ కామెడి ఎంటర్ టైనర్. సినిమాటిక్ గా ఉంటుంది. నేను, నరేష్ గారు సీరియస్ గా బాధలు పడుతుంటే ఆడియెన్స్ కు నవ్వు వస్తుంటుంది. సినిమా వల్గర్ గా ఉండదు.

సాంగ్ పాడాను..డైలాగ్స్ రాశాను...
-ఈ సినిమాలో ర్యాపో సాంగ్ లిరిక్స్ రాయడమే కాకుండా పాడాను కూడా. అలాగే స్క్రిప్ట్ వర్క్ చేశాను. డైలాగ్స్ రాశాను. మొత్తం మీద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్...
-ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నెక్ట్స్ సినిమా ఇంకా ఏదీ కమిట్ కాలేదు.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved