pizza
Sivalenka Krishna Prasad (Telugu) interview about Sammohanam
`సమ్మోహనం` ఓ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ - శివలెంక కృష్ణ ప్రసాద్‌
You are at idlebrain.com > news today >
Follow Us

5 June 2018
Hyderabad

సుధీర్‌బాబు, అదితీరావు హైద‌రి జంట‌గా మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తోన్న‌ చిత్రం `స‌మ్మోహ‌నం`. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా తెర‌కెక్కుతోన్న `స‌మ్మోహ‌నం` జూన్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌తో ఇంట‌ర్వ్యూ...

సరిగ్గా రెండేళ్ల తర్వాత...
- ఇంద్రగంటి మోహనకృష్ణతో 2016లో 'జెంటిల్‌మన్‌' సినిమా చేశాను. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఇప్పుడు 'సమ్మోహనం' సినిమా చేయబోతున్నాను. గత ఏడాది ఆయన నాకు ఈ 'సమ్మోహనం' కథను చెప్పారు. కథ నాకు బాగా నచ్చింది. డైలాగ్‌ వెర్షన్‌తో సహా ఇంద్రగంటి ఈ సినిమాను రాసి ఓ బుక్‌ను నాకు ఇచ్చారు. అక్కడ నుండి ఈ ప్రయాణం స్టార్ట్‌ అయ్యింది. ముందుగా హీరోయిన్‌గా ఎవరు నటిస్తే బావుంటుందని అనుకున్నాం. అదితిరావు హైదరి నటిస్తే బావుంటుందనిపించింది. ఇంద్రగంటి మోహనకృష్ణగారు ఈ అమ్మాయి అయితే బావుంటుందని అన్నారు. ఆమె నటించిన మణిరత్నం సినిమా 'చెలియా' చూశాం. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు ఆమె సూట్‌ అవుతుందనిపించింది. కథ విన్న అదితి నాకు తెలుగులో మంచి డెబ్యూ మూవీ అవుతుందని వెంటనే సినిమా చేయడానికి అంగీకరించింది. తర్వాత సుధీర్‌బాబుగారిని కలిసి కథ చెప్పాం. ఆయనకు కూడా నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించారు. అలాగే ఇందులో తండ్రి పాత్ర ఎవరు చేస్తే బావుంటుందని ఆలోచించాం. చివరకు సీనియర్‌ నరేశ్‌గారైతే చక్కగా ఉంటుందనిపించింది. ఆయన నటుడిగా తనదైన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఆయన ఈ సినిమాలో తండ్రిగా అద్భుతంగా నటించారు. ''నేను సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మంచిపాత్రలు చేస్తున్నాను. అందులో నాకు గుర్తుండిపోయే పాత్రల్లో ఇదొకటి అవుతుంది' అని అన్నారు నరేశ్‌.

మేకింగ్‌లో కాంప్రమైజ్‌ కాలేదు...
- ఫీీల్‌గుడ్‌ లవ్‌స్టోరీని అందంగా తీయాలి.. ఎమోషన్స్‌ను హృద్యంగా తెరకెక్కించాలని దర్శకుడు ఇంద్రగంటి భావించి ఓ ప్లానింగ్‌తో తెరకెక్కించారు. అనుకున్న దాని కంటే కాస్త బడ్జెట్‌ లైన్‌ దాటుతుందని ముందుగానే నాకు ఇంద్రగంటి గారు చెప్పారు. నేను ఏ సినిమా చేసినా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఈ సినిమాలో మేకింగ్‌లో రిచ్‌నెస్‌ ఉండటానికి స్కోప్‌ ఉంది. డైరెక్టర్‌ సినిమా కథకు తగ్గట్టు `సమ్మోహనం` అనే టైటిల్‌ను పెట్టారు. కుటుంబంతో హాయిగా నవ్వుకుని చూసే ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ. మ్యూజిక్‌ పరంగా కూడా సినిమా అద్భుతంగా ఉంటుంది. రేపు సెన్సార్‌ పూర్తవుతుంది. అనుకున్న అవుట్‌పుట్‌ అనుకున్నట్లుగానే వచ్చింది. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు.

చాలా ప్రేమకథలున్నాయి...
- నిజ జీవితంలోనూ ఓ హీరోయిన్‌.. ఓ సాధారణ యువకుడితో ప్రేమలో పడటం అనేది చాలా సందర్భాల్లో జరిగాయి. ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమకథలుంటాయి. 'సీతామాలక్ష్మి, రంగీలా, శివరంజని' వంటి సినిమాలు కూడా ఇదే బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కాయి. పెయింటింగ్‌ వేసే ఓ సాధారణ మధ్య తరగతి యువకుడు .. సినిమా వాళ్లంటే చిన్నపాటి చిన్నచూపు ఉంటుంది. అలాంటి యువకుడికి ఓ స్టార్‌ హీరోయిన్‌ ఎలా పరిచయమైంది. వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? చివరకు ఎలాంటి మజిలీ చేరుకుందనేదే కథ.

కాంట్రవర్సిలుండవు...
- ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పాల్సిన విషయాన్ని చాలా బ్యాలెన్స్‌గా చెప్పే డైరెక్టర్‌. ఈ సినిమాలో కూడా అన్ని అంశాలను బ్యాలెన్స్‌డ్‌గానే చెప్పారు. ఈ సినిమాలో ఎలాంటి కాంట్రవర్సిలు ఉండవు.

interview galleryనాకు మొహమాటం ఎక్కువ...
- నేను సినిమాలు చేసిన దర్శకులందరూ అద్భుతమైన వ్యక్తులు. ఏదీ ముందు ప్లాన్‌ చేసుకునేవాడిని కాదు. ఇప్పుడు ప్లాన్‌ చేసుకుంటున్నాను. ఇకపై పదేళ్లు ఎలాంటి సినిమాలు చేస్తానో చూడండి. అలాగని ఏ సినిమాలు పడితే అవి చేయను. మంచి సినిమాలు.. ఎవరూ తిట్టుకోని సినిమాలు చేస్తాను. ఓసారి పనిచేసిన దర్శకుడితో మరో సినిమా చేయూలంటే మొహమాట పడేవాడిని. అయితే ఇంద్రగంటి మోహనకృష్ణతో వరుసగా రెండు సినిమాలు చేశాను. నాతో వరుసగా మరో సినిమా చేద్దామనే ప్రపోజల్‌ కూడా మోహనకృష్ణదే.

బాలకృష్ణతో సినిమా ...
- బాలకృష్ణగారు ఎప్పుడు అడిగినా సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఆయనతో మంచి కథ.. సినిమాను చక్కగా హ్యాండిల్‌ చేసే దర్శకుడు కావాలనిపించింది. అన్ని కుదిరితే తప్పకుండా చేస్తాను.

తదుపరి చిత్రం
- నెక్స్‌ట్‌ ఏ సినిమా చేయాలనేది అనుకోవడం లేదు. అయితే రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతానికి 'సమ్మోహనం' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రమోషన్స్‌ చేస్తున్నాం


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved