pizza
Sonal Chauhan interview about Size Zero
డ్ర‌స్‌ని బ‌ట్టి నిర్ణ‌యించ‌కూడ‌దు - సోనాల్ చౌహాన్‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 November 2015
Hyderabad

రెయిన్ బో సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన నాయిక సోనాల్ చౌహాన్. లెజెండ్ సినిమాతో ఆమెకు ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చింది. ఆమె న‌టించిన సినిమా సైజ్ జీరో శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ప్ర‌కాష్ కోవెల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో ఆర్య‌, అనుష్క‌, సోనాల్ చౌహాన్ కీల‌క పాత్ర‌ధారులు. పీవీపీ నిర్మించిన ఈ సినిమా గురించి సోనాల్ గురువారం విలేక‌రుల‌తో మాట్లాడింది. ఆ విశేషాలు...

* ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?
- ఇందులో నా పాత్ర పేరు సిమ్ర‌న్‌. ఎన్నారై పాత్ర చేశా. స్వ‌చ్ఛ‌భార‌త్‌, స్వ‌చ్ఛ హైద‌రాబాద్ వంటి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డానికి కేంప‌యిన్ చేస్తుంటా. చాలా మంచి అమ్మాయి. ఇది ఒక ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ.

* మీకు సైజ్ జీరో ఇష్ట‌మా?
- లేదండీ. నాకు సైజ్ జీరోలు ఇష్టం ఉండ‌వు. నేను నోరు క‌ట్టేసుకోను. న‌చ్చిన‌వ‌న్నీ చాలా ఇష్టంగా తింటాను. హైద‌రాబాద్ బిర్యానీ అంటే ఇష్టం. కాకపోతే రెగ్యుల‌ర్ వ‌ర్క‌వుట్లు చేస్తుంటా.

* మీ పాత్ర కోసం ముందు శ్రుతిహాస‌న్‌ని అనుకున్నార‌ట‌?
- ఆ విష‌యం నాకు తెలియ‌దు. త‌న‌ని ఓ పాట కోసం అడిగార‌ని అనుకున్నానంతే.

* పీవీపీ గురించి చెప్పండి?
- చాలా గొప్ప సంస్థ ఇది. ఈ సంస్థ‌లో ప‌నిచేయ‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నా. ఈ సినిమా ద్వారా త‌మిళంలోనూ అడుగుపెడుతున్నా.

* మీరు ఇప్ప‌టిదాకా చేసిన సినిమాల గురించి చెప్పండి?
- ఏదీ ఒక‌టే ర‌కంగా ఉంటే నాకు న‌చ్చ‌దు. అందుకే పాత్ర‌ల‌ను వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాను. పండ‌గ‌చేస్కోలో పొగ‌రుబోతు ఎన్నారైగా న‌టించా. ఈ సినిమాలోనూ ఎన్నారైనే కాక‌పోతే మంచి ఎన్నారైని. ఎన్నారై అన‌గానే చెడుగా అనుకుంటారు. అయితే ఈ సినిమాలో నా పాత్ర‌ను చూసిన వారు ఆ భావ‌న‌ను పోగొట్టుకుంటారు.

* అనుష్క గురించి చెప్పండి?
- త‌న పేరులో ఉన్న‌ట్టే త‌ను చాలా స్వీట్‌. డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌న్‌. షి డిజ‌ర్వ్స్ ఆల్ ద స‌క్సెస్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ.

* గోల్డ్ కాంటెస్ట్ గురించి చెప్పండి?
- ఇవాళ్రేపు పైర‌సీ అనేది తెలుగు సినిమాను ప‌ట్టి ఊపేస్తోంది. దాని నుంచి బ‌య‌ట‌ప‌డటానికి పీవీపీ వేసిన తొలి అడుగు ఈ కాంటెస్ట్. చాలా మంచి కాన్సెప్ట్.

* డిక్టేట‌ర్ గురించి చెప్పండి?
- చాలా మంచి పాత్ర చేస్తున్నా. సంక్రాంతికి విడుద‌ల‌వుతుంది.

* తెలుగులో డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నారా?
- నాకైతే చెప్పాల‌ని ఉంది. కానీ ఇంకా నా తెలుగు మీద అవ‌త‌లివారికి న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదు.

* ద‌ర్శ‌కుడి గురించి చెప్పండి?
- సెన్సిబుల్ ఫిల్మ్ మేక‌ర్‌. ఈ సినిమాను చాలా సెన్సిబుల్‌గా ట్రీట్ చేశారు. మామూలుగా అమ్మాయిల గురించి ఓ అబ్బాయి ఇంత‌లా ఫీల్ కావ‌డం నిజంగా గ్రేట్‌.

 



Photo Gallery (photos by G Narasaiah)
Click here for other galleries of Sonal Chauhan : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved