pizza
Sreenu Vaitla interview (Telugu) about Mister
ప్రేక్ష‌కుల ప్రేమ కోసం చేసిన ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `మిస్ట‌ర్‌` - శ్రీనువైట్ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

09 April 2017
Hyderabad

వరుణ్‌తేజ్‌ హీరోగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై శ్రీనువైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్‌ మధు నిర్మించిన చిత్రం 'మిస్టర్‌'. ఏప్రిల్‌ 14న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనువైట్లతో ఇంటర్వ్యూ....

ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ...
- 'మిస్టర్‌' ఓ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ, నేను చాలా రోజులుగా ఎమోషన్స్‌తో కూడిన ట్రావెల్‌ మూవీ చేయాలనుకుంటున్నాను. అలాంటి సమయంలో 'మిస్టర్‌' సినిమా లైన్‌ను గోపీమోహన్‌ నాకు చెప్పాడు. అలా 'మిస్టర్‌' సినిమా జర్నీ స్టార్ట్‌ అయ్యింది. లైన్‌ వినగానే ఎవరైతే బావుంటారు అనుకోగానే, వరుణ్‌ బావుంటాడని నేను చెప్పాను. గోపీమోహన్‌ కూడా వరుణ్‌ తేజ్‌ అయితే ఈ కథకు సూట్‌ అవుతాడని అన్నాడు. అలా వరుణ్ తేజ్ ను హీరోగా అనుకుంటుండగా, నిర్మాతలు బుజ్జి, మధుగారు సినిమా చేయడానికి అప్రోచ్ అయ్యారు. మిస్టర్ కథ వరుణ్ తో అనుకుంటున్నానని వారికి చెప్పాను. వారు కూడా సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో హ్యాపీగా అనిపించింది. అక్కడ నుండి ఎనిమిది నెలలు సమయం తీసుకుని సినిమా చేశాం.

ఎగ్జయిటింగ్‌గా అనిపించింది..
- నాకు ఈ సినిమా చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. సాధారణంగా మనం షూటింగ్‌ కోసం ఎక్కడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక దగ్గర షూటింగ్‌ చేసుకుని వచ్తేస్తాం. కానీ 'మిస్టర్‌' సినిమా కోసం స్పెయిన్‌లోని 11 సిటీస్‌లో సినిమా షూటింగ్‌ చేశాం. తర్వాత మన దేశంలో చిక్‌ మంగళూరులో షూట్‌ చేశాం. ట్రావెల్‌ బ్లాక్‌ అంతా ఈ ప్రాంతాల్లో చేశాం. అలా ఊటీ, కేరళ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. ఓ కొత్త లుక్‌తో సినిమా చేయాలని ముందుగానే అనుకుని చేశాను.

వరుణ్‌ను అన్నీ యాంగిల్స్‌లో చూపించాను..
- వరుణ్‌తేజ్‌ను చాలా రోజుల క్రితం చూసి కుర్రాడు చాలా బావున్నాడని అంటే..నాగబాబుగారు నువ్వు తనతో సినిమా చెయ్యొచ్చు కదా అని నవ్వుతూ అనేవారు,తప్పకుండా చేస్తాను అన్నయ్య అనేవాడిని.,ముకుంద సినిమా తర్వాత నేను నాగబాబుగారికి ఫోన్‌ చేసి వరుణ్‌ చాలా బావున్నాడని అన్నాను. అలా మా కాంబినేషన్‌ ఈ 'మిస్టర్‌' సినిమాకు కుదిరింది. వరుణ్‌ ఈ సినిమాలో అన్నీ యాంగిల్స్‌లో చూపించే ప్రయత్నం చేశాను. తను కూడా ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. కామెడి చేయడం చాలా కష్టం., కానీ వరుణ్‌ కామెడి ట్రాక్‌లో చక్కగా నటించాడు.

Sreenu Vaitla interview gallery

ప్రేక్షకులు మెచ్చే కామెడి ఉంటుంది...
-నేను ఇప్పటి వరకు చేయని ఫ్రెష్‌ లవ్‌స్టోరీ. అదీ కాక నా గత చిత్రంలో నా నుండి ఆశించిన కామెడి ప్రేక్షకులకు దొరకలేదు. కాబట్టి ప్రేక్షకులు నా సినిమాల్లో కామెడి ఉండాలని ఆశిస్తారు. అది ఈ సినిమాలో చాలా మంచి కామెడి ఉంది.

హీరోయిన్స్ గురించి...
- చంద్రముఖి అనే క్యారెక్టర్‌ను లావణ్య చేసింది. మీరా అనే క్యారెక్టర్‌లో హెబ్బాపటేల్‌ నటించింది. ఇద్దరూ వారి పాత్రల్లో హండ్రెడ్‌ పర్సెంట్‌ నటించారు.

అందుకు 60 రోజులు తీసుకున్నాడు...
- మేకింగ్‌లో కొత్తగా ఉండాలనే మిక్కి జె.మేయర్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీసుకున్నాను. తను ఎలా చేస్తాడోనని చాలా మంది అనుకున్నారు. కానీ తను నాకు చాలా బాగా సింక్‌ అయ్యాడు. అన్నీ పాటలకు అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కు 60 రోజులు తీసుకుని చేశాడు.

అలాంటి క్యారెక్టర్స్‌ లేవు...
- రెడీ సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్‌ ఉంటాయో, ఈ సినిమాలో కూడా అన్ని క్యారెక్టర్స్‌ ఉంటాయి.

నిర్మాతలతో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్...
- నిర్మాతలు దర్శకుడిగా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాకు ఏం కావాలో దాన్ని సమకూర్చారు.

అందుకే రిజెక్ట్‌ చేశారేమో..
- 'బ్రూస్‌లీ' చిత్రం నేను అనుకున్న విధంగా ఎందుకనో కుదరలేదు. అందుకని ఎవరినీ బ్లేమ్‌ చేయలేదను. నేను మంచి సినిమా చేయలేదు కాబట్టి ప్రేక్షకులు రిజెక్ట్‌ చేశారని నేను అనుకుంటాను. నేను సక్సెస్‌ కోసం కాకుండా ప్రేక్షకుల ప్రేమ కోసం చేసిన సినిమా 'మిస్టర్‌'. నాకు సినిమా అంటే ప్రాణం. సినిమాల పరంగా నేనెప్పుడూ అప్‌డేట్‌ అవుతుంటాను. అదెలా అయ్యానో తెలుసుకోవాలంటే 'మిస్టర్‌' సినిమా చూడాల్సిందే.

రెండింటినీ చూశాను.. అప్పుడే ఎక్కువ సీిరియస్ గా పనిచేస్తాను...
- సాధారణంగా సక్సెస్‌ కంటే ఫెయిల్యూర్‌ నుండి ఎక్కువగా నేర్చుకుంటాం. నా కెరీర్‌లో గెలుపు ఓటమి..రెండింటినీ చూశాను. ఓటమి వచ్చినప్పుడే ఎక్కువ సీరియస్‌గా పనిచేస్తాను.

తదుపరి చిత్రాలు..
- ప్రస్తుతం 'మిస్టర్‌' సినిమా విడుదల అవుతుంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అలాగే రెండు లైన్స్‌తో రెండు కథలను సిద్ధం చేసుకున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved