pizza
Sree Vishnu interview (Telugu) about Maa Abbayi
డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో వ‌స్తోన్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `మా అబ్బాయి` - శ్రీ విష్ణు
You are at idlebrain.com > news today >
Follow Us

12 March 2017
Hyderabad

శ్రీ విష్ణు హీరోగా వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బేబీ సాక్షి సమర్పణలో కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాష్ రావు నిర్మాతగా రూపొందిన చిత్రం `మా అబ్బాయి`. ఈ సినిమా మార్చి 17న విడుల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో శ్రీ విష్ణుతో ఇంట‌ర్వ్యూ...

బిగ్ బ‌డ్జెట్ మూవీ....
- `మా అబ్బాయి` సినిమా నా కెరీర్‌లో ఎక్కువ బ‌డ్జెట్‌తో రూపొంది స్పాన్ ఎక్కువ‌గా ఉన్న సినిమా. బ‌డ్జెట్ ఎక్కువ అన‌గానే నాకు మార్కెట్ లేదు క‌దా..నాపై భారీ బ‌డ్జెట్ సినిమా ఎందుక‌ని ఆలోచించాను. అయితే నిర్మాత‌గారు క‌థ‌పై చాలా న‌మ్మ‌కంగా ఉండి సినిమా చేద్దామ‌ని అన‌డంతో టీంగా ముందుకెళ్ళాం.

రెగ్యుల‌ర్ క‌థ‌..కొత్త స్క్రీన్‌ప్లే...
- కొత్త క‌థ అని చెప్ప‌ను..రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ. అయితే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు రాని స్క్రీన్‌ప్లేతో రూపొందిన సినిమా అని గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌ను.

interview gallery

టైటిల్ జ‌స్టిఫికేష‌న్‌...
- మా అబ్బాయి అనే మాట‌ను మ‌నం త‌రుచుగా వింటుంటాం. మ‌నం త‌రుచుగా వాడుతుంటాం. అలాంటి కామ‌న్ అబ్బాయి క‌థే `మా అబ్బాయి` సినిమా. ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే కుర్రాడ‌న్న‌మాట‌. సిస్ట‌ర్‌, బ్ర‌ద‌ర్ మ‌ధ్య అనుబంధాన్ని తెలియ‌జేసే చిత్రం.

క్యారెక్ట‌ర్ గురించి...
- ఇందులో కాన్ఫిడెంట్‌గా ఉండే కుర్రాడిగా క‌న‌ప‌డ‌తాను. ఓపెన్‌గా ఉండే పాత్ర‌. యాక్ష‌న్ పార్ట్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. కానీ యాక్ష‌న్ అంతా క‌థ‌లో భాగంగానే ఉంటుంది. త‌న ఫ్యామిలీకి ఓ స‌మ‌స్య‌ను హీరో ఎలా ప‌రిష్క‌రించుకున్నాడ‌నేదే క‌థ‌. చిన్న సోష‌ల్ మెసేజ్‌తో, రెండు మూడేళ్ళ క్రితం హైద‌రారాబాద్‌లో జ‌రిగిన నిజ ఘ‌ట‌న ఆధారంగా సినిమా ఉంటుంది.

- ద‌ర్శ‌కుడు కుమార్ వ‌ట్టి నాకు సోలో సినిమా నుండి ప‌రిచ‌యం. సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. ఇక సినిమా చూస్తే త‌న డైరక్ష‌న్ గురించి మాట్లాడుకుంటాం. అలాగే నిర్మాత బ‌ల‌గ ప్ర‌కాష్‌గారు సినిమాను క్వాలిటీ విషయంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు.

త‌దుప‌రి చిత్రాలు..
- మెంట‌ల్ మ‌దిలో, నీది నాది ఒకే క‌థ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. అలాగే పెద్ద బ్యాన‌ర్స్‌లో కూడా సినిమాలున్నాయి. ప్ర‌స్తుతం సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved