pizza
Sree Vishnu interview (Telugu) about Needi Naadi Oke Katha
ఎప్పుడూ వైవిధ్యంగా చేయాల‌ని అనుకుంటా - శ్రీవిష్ణు
You are at idlebrain.com > news today >
Follow Us

19 March 2018
Hyderabad

వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని ముందుకెళ్తున్నారు శ్రీవిష్ణు. కాన్సెప్ట్ బేస్డ్ క‌థ‌ల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్నారు. ఆయ‌న తాజా చిత్రం `నీదీనాదీ ఒకే క‌థ‌` ఈ నెల 23న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా శ్రీవిష్ణు హైద‌రాబాద్‌లో సోమ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* `నీదినాదీ ఒకే క‌థ‌`లో డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నారా?
- లేదండీ. డ్యూయ‌ల్ రోల్ కాదు. కాక‌పోతే సినిమాను చూసే ప్రేక్ష‌కుడు మాత్రం డ్యూయ‌ల్ రోల్ కింద ఫీల‌వుతారు. ఎందుకంటే తెర‌ముందు అత‌ను, తెర‌మీద నేను అన్న‌మాట‌. అలా ప్రేక్ష‌కులు డ్యూయ‌ల్ రోల్ ఫీల‌వుతారు.

* స్టూడెంట్ లైఫ్‌ని తెర‌మీద చూపించిన‌ట్టున్నారు?
- అవునండీ. స్ట్ర‌గుల్ ఉంటుంది.

* మీరు ఫేస్ చేశారా అలాంటి స్ట్ర‌గుల్‌?
- లేదండీ. నాకు చ‌దువు పూర్త‌య్యాక ఏం చేయాలో క్లారిటీ ఉంది. అందువ‌ల్ల నేను బీబీఎం చ‌దివా. ఇంట‌ర్ త‌ర్వాతే నేను సినిమాల్లోకి రావాల‌ని అనుకున్నా.

* ప‌రిశ్ర‌మ‌లో ఛాన్సెస్ కోసం స్ట్ర‌గుల్ అయ్యే టైమ్ లో ఉన్న మెంట‌ల్ స్టేట‌స్‌కి... ఈ సినిమాలో పాత్ర‌కి రిలేట్ చేసుకున్నారా?
- చేసుకున్నానండీ. కాక‌పోతే చ‌దువుకునే రోజుల్లో స్ట్ర‌గుల్ లేదుకాబ‌ట్టి, ఇండ‌స్ట్రీ తొలినాళ్ల‌ని ఊహించుకున్నాను. ఉదాహ‌ర‌ణ‌కి చెప్పుకోవాలంటే ఇంట‌ర్ అయ్యాక ఇంజనీరింగ్ చేయ‌క‌పోతే పిల్ల‌ను ఇవ్వ‌ర‌నో, పిల్లాడు దొర‌క‌డ‌నో చాలా మంది ఇంజినీరింగ్ చ‌దువుతారు. సొసైటీ కూడా ఇంజినీరింగ్ చ‌దివేవారిని ఒక ర‌కంగా చూస్తుంది. డిగ్రీ చ‌దివేవాళ్ల‌ని ఇంకో ర‌కంగా చూస్తుంది. చ‌చ్చీచెడి ఇంజినీరింగ్ పాస్ అయినా, న‌చ్చింది చేయ‌లేక‌పోయామ‌నే బాధ‌తో ప్ర‌తి రోజూ దాన్ని త‌ల‌చుకుని బాధ‌ప‌డే వాళ్లు చాలా మందే ఉంటున్నారు. వాళ్లు జీవితంలో 80 శాతం శాటిస్‌ఫైడ్‌గా ఉండ‌రు. అది త‌ప్పు అంటాను. మ‌నం ఏం కావాల‌నుకుంటున్నామో ముందు మ‌న‌కొక క్లారిటీ ఉంటే, దాన్ని గ‌ట్టిగా పేరెంట్స్ ద‌గ్గ‌ర చెప్ప‌వ‌చ్చు. కొన్నిసార్లు మ‌నం అనుకున్న‌ది త్వ‌ర‌గా సాధించ‌గ‌లం. కొన్నిసార్లు కాస్త ఆల‌స్య‌మ‌వుతుంది. అయినా న‌చ్చిందే చేస్తున్నామ‌నే తృప్తి ఉంటుంది.

* ఇదంతా సినిమాలో ఉంటుందా?
- స్టోరీ లైన్ అదే. జీవితంలో కీల‌క స‌మ‌యాల్లో సొసైటీ గురించి ఆలోచిస్తాం. కానీ సొసైటీ మ‌న‌కేమైనా చేస్తుందా అంటే చేయ‌దు. అందుకే అన్ని సంద‌ర్భాల్లోనూ సొసైటీ గురించి ఆలోచించి, ఇష్టాయిష్టాల‌ను చంపేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు అని చెబుతున్నాం.

* ఏ క‌ల‌ర్‌లో ఉంటుంది?
- రూరల్ ప్లేస్‌లో జ‌రిగిన స్టోరీ కాబ‌ట్టి, మిడిల్ క్లాస్ త‌ర‌హాలోనే ఉంటుంది. చాలా నేచుర‌ల్‌గా ఉంటుంది.

* దేవి ప్ర‌సాద్ ఫాద‌ర్ రోల్ చేశారు క‌దా. ఆయ‌న‌తో ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంది?
- ఆయ‌న పాత్ర చాలా బాగా ఉంటుంది. ఓవ‌రాల్ గా ఆయ‌న బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మామూలుగా సినిమా మొద‌ల‌య్యాక హీరో రోల్‌తో ఎక్కువ క‌నెక్ట్ అవుతాం. ఈ సినిమాలో యంగ్ స్ట‌ర్స్ హీరోతో క‌నెక్ట్ అవుతారు. పేరెంట్స్ ఆయ‌న‌తో క‌నెక్ట్ అవుతారు. ఆయ‌న డైర‌క్ట‌ర్ అని ఎప్పుడూ మాకు ఏమీ హంగామా చూపించ‌లేదు. సెట్లో మాతో న‌టుడిగ‌లా కలిసిపోయారు. ఆయ‌న పాత్ర చూసి థ్రిల్ అయ్యారు. ఒక ఫీల్డ్ లో ఉన్న‌వారు థ్రిల్ కావ‌డం గొప్ప‌.

interview gallery



* ఉన్న‌ట్టుండి సినిమా అనౌన్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ప‌బ్లిసిటీ గురించి హైరానా లేదా?
- పెద్ద సినిమాల పబ్లిసిటీకి అయ్యే ఖ‌ర్చుతో మా సినిమాలు చేసేస్తాం. నా సినిమా ఫ‌స్ట్ లుక్ వ‌దిలిన‌ప్ప‌టి నుంచి నాకు మీడియా స‌పోర్ట్ చేస్తుంది. నాకే కాదు.. చిన్న సినిమాలకు ప్ర‌మోష‌న్ అన్నేసి కోట్లు పెట్టి చేయ‌లేం. ప్యాష‌న్‌తో చేసే చిన్న సినిమాల‌ను జ‌నాల‌కు రీచ్ చేసేది మీడియానే. మ‌మ్మ‌ల్ని మీడియామిత్రులే జ‌నాల్లోకి తీసుకెళ్తారు. అది ఎంత వ‌ర‌కు రీచ్ అయితే నేను అంత హ్యాపీ. మ‌న ప‌రిశ్ర‌మ‌లో ఎక్కువ మంది హీరోలున్నారు. చాలా మంది ద‌ర్శ‌కులు ఉన్నారు. ప్లాట్ దొరికిన‌ప్పుడే సినిమా విడుద‌ల చేయ‌డం హ్యాపీ. అంతేగానీ మీన‌మేషాలు లెక్కించ‌కూడ‌దు.

* హీరోలుగా చేస్తూనే కేర‌క్ట‌ర్లు చేస్తుంటారు.. ఇక‌పై కూడా చేస్తారా?
- నేను దాదాపుగా అన్ని సినిమాల‌కూ అలాగే ఫీల‌వుతుంటానండీ. త‌ప్ప‌కుండా చేస్తాను.

* కొత్త ద‌ర్శ‌కులతో ఎక్కువ ట్రావెల్ అవుతుంటారు క‌దా?
- చాలా ప్యాష‌న్ ఉంటుంది. నా బ‌డ్జెట్ క‌థ‌ల‌కి త‌గ్గ‌ట్టు ఉంటారు. నాకు కంఫ‌ర్ట్ గా ఉంటుంది. పెద్ద ద‌ర్శ‌కుల‌తో చేయ‌కూడ‌ద‌నేం లేదండీ.

* `నీదీ నాదీ ఒకే క‌థ` ఎందుకు లేట్ అయింది?
- ఈ సినిమా మొద‌లుపెట్టి కాస్త షూటింగ్ పూర్త‌య్యాక‌, మ‌ధ్య‌లో మా `మెంట‌ల్ మ‌దిలో` చేశాం. పెళ్లిచూపులు డేట్‌కి ఆ చిత్రాన్ని రిలీజ్ చేద్దామ‌న్నారు. అప్ప‌టికి కుద‌ర‌లేదు. అంత‌లో ఆ చిత్రాన్ని సురేశ్‌బాబుగారు సినిమా తీసుకున్నారు. అది ఐదు నెల‌లు ఆయ‌న ద‌గ్గ‌రుంది. ఆ స‌మ‌యంలో దీన్ని రిలీజ్ చేయ‌డం బావుండ‌దు కాబ‌ట్టి కాస్త ఆగాం. ఇప్పుడు విడుద‌ల చేస్తున్నాం. అంతేగానీ మ‌రేం లేదు.

* డోగ్మే 95 టెక్నిక్‌ని వాడార‌ట క‌దా?
- అవునండీ. జీరో బ‌డ్జెట్‌తో సినిమా చేయ‌డం ఎలా అనేది అందులో మెయిన్‌. చాలా మంది దీన్ని ఫాలో అయి సినిమాలు చేస్తారు. ట్రాలీలు, జిమ్మీలు, సెట్ లు వంటివి ఉండ‌వు. ఒక్క సింక్ సౌండ్ మాత్రం మేం మిస్ అయ్యాం. అది కూడా ఎందుకు చేయ‌లేక‌పోయామంటే మా షూటింగ్ ఎక్కువ‌గా ఔట్‌సైడ్ ఉంటుంది. అందుకే కుద‌ర‌లేదు. ఒక‌ప్ప‌టి రెవ‌ల్యూష‌న్ ఇది. డోగ్మీ టెక్నిక్‌తో మ‌ల‌యాళంలో ఓ కంప్లీట్ సినిమా చేశారు. కానీ అది విడుద‌ల కాలేదు. ఇప్ప‌టివ‌ర‌కు ఆ టెక్నిక్‌తో రిలీజ్ అయ్యేది మా సినిమానే. మేం సినిమా చూసుకున్నాం. చాలా హ్యాపీ. యాస్ప‌యిరింగ్ ఫిల్మ్ మేక‌ర్స్ కూడా చేశారు. ఇందులో ట్రాలీ లేకుండా ట్రాలీలాంటి షాట్‌లు చేశాం. సినిమాలో 13-14 సింగిల్ షాట్స్ కింద చేశాం. రెండు సీక్వెన్స్ లు 6 మినిట్స్ ప్ల‌స్ ఉన్నాయి. నేను ఈ సినిమాకు రిహార్స‌ల్స్ చేయ‌లేదు. ఈ సినిమా షూటింగ్‌కి ముందు రెండు నెల‌లు నేను, డైర‌క్ట‌ర్ క‌లిసే తిరిగాం. రెగ్యుల‌ర్ ఫిల్మ్ మేకింగ్‌గా ఇది జ‌ర‌గ‌లేదు లేదు. అది సినిమా చూసిన‌ప్పుడు క‌చ్చితంగా గుర్తిస్తారు.

* `మెంట‌ల్ మ‌దిలో` హిట్ వ‌చ్చింది క‌దా. ఆ కైండ్ సినిమాలు రాలేదా?
- రెగ్యుల‌ర్ సినిమాలు నాకు ఇంట్ర‌స్ట్ ఉండ‌దండీ. ఏదో కొత్త‌గా చేయాలి అని ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేశాను. కొత్త‌ల్లో కాబ‌ట్టి న‌చ్చ‌క‌పోయినా చేయాల్సి వ‌చ్చింది. అట్లీస్ట్ యాక్టింగ్‌ ప్రాసెస్ నేర్చుకోవ‌డానికి ప్రాక్టిక‌ల్ ఎక్స్ పీరియ‌న్స్ కోసం చేశాను. అయినా చాలా సంద‌ర్భాల్లో నా వ‌ల్ల అయ్యేది కాదు. జెన్యూన్‌గా చేసిన‌ట్టు ఉండేది కాదు. డిఫ‌రెంట్‌గా న‌చ్చిందే చేయాల‌ని అనుకునేవాడిని.

* `ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ` త‌ర్వాత పెద్ద సినిమాల వారు అప్రోచ్ అయ్యారా?
- తిరుమ‌ల కిశోర్ నాకు చాలా బాగా క్లోజ్‌. అందుకే చేసేట‌ప్పుడు కంఫ‌ర్ట్ ఉండేది. అందుకే చేశా. నాకు ఏదైనా మంచి జ‌రిగింది అంటే హ్యాపీగా ఫీల‌య్యేవారిలో కిశోర్ ఒక‌రు. నేను చేసిన డైర‌క్ట‌ర్లు అంద‌రూ సింక్ అయ్యేవారే. ఇప్ప‌టికీ అడుగుతూనే ఉన్నారు. థ్రిల్ ఫీల‌యితే చేస్తాను.

* మాస్ హీరో కావాల‌నే ఫీలింగ్ ఉందా?
- అలాంటిదేమీ లేదండీ. ఎందుకంటే మాస్ హీరో అవుదామ‌నుకున్నా అయిపోవ‌డం అంత ఈజీ కాదు. చాలా క‌ష్టం.

* మీకు గోల్ ఏంటి?
- డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో డిఫ‌రెంట్ సినిమాలు చేయాలి. క‌థ‌ల వైజ్ ఎక్స్ పెరిమెంట్స్ కాదు.. కానీ డిఫ‌రెంట్‌గా చేయాలి.

* ఆర్టిస్ట్ గా మీ స్ట్రెంగ్త్స్, వీక్‌నెస్‌లు ఏంటి?
- అవ‌న్నీ ప్రాసెస్‌లో తెలుస్తాయి. ఆడియ‌న్‌గా క‌థ వింటాను. ఆ క‌థ‌లో నా ఫేస్ అంత ఈజీగా క‌న్విన్స్ కావాలి. క‌న్విన్స్ చేయ‌గ‌లుగుతాను అని అనుకున్న‌ప్పుడు చేస్తా. దిగిన త‌ర్వాతే అది ఎంత వీల‌వుతుందో తెలుస్తుంది. ఒకే ర‌కంగా ప్రిపేర్ అయి చేస్తే నాలుగైదు సినిమాల త‌ర్వాత `వీడు ఒకే టైప్ చేస్తున్నాడురా` అంటారు. కేర‌క్ట‌ర్ స్టేజ్‌లోనే ఆ చేంజ్ చేస్తే బావుంటుంది. మ‌న ప్ర‌య‌త్నం కొన్నిసార్లు హిట్ కావ‌చ్చు, కొన్నిసార్లు హిట్ కాక‌పోవ‌చ్చు. ఒక వేళ కాలేద‌నుకోండి. ఆలోచించి అలాంట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

* బోయ్ నెక్స్ట్ డోర్ త‌ర‌హా పాత్ర‌లు చేస్తే కెరీర్ లిమిట్ అయ్యే అవ‌కాశాలున్నాయా?
- లేదండీ. బోయ్ నెక్స్ట్ డోర్‌లు ఉంటూనే ఉంటారు కాబ‌ట్టి, కెరీర్ స్పాన్ బాగానే ఉంటుంది.

* మీకు న‌చ్చిన హీరోలు ఎవ‌రు?
- వెంక‌టేశ్‌గారంటే చాలా అభిమానమండీ.

* కొత్త హెయిర్ స్టైల్ ఏంటండీ?
- వీర‌భోగ‌వ‌సంత‌రాయ‌లు కోసం అండీ. ఇలా తిర‌గాలంటే సిగ్గేస్తోంది. త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసి మామూలుగా క‌ట్ చేయించుకోవాలి.

* త‌దుప‌రి సినిమాలేంటి?
- `అసుర` డైర‌క్ట‌ర్‌తో `తిప్ప‌రా మీసం` చేస్తాను. మ‌రో పోలీస్ స్టోరీని కూడా అంగీక‌రించా.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved