pizza
Sree Vishnu about Appatlo Okadundevadu
`అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన క్రికెటర్ క‌థ - శ్రీ విష్ణు
You are at idlebrain.com > news today >
Follow Us

22 December 2016
Hyderaba
d

నారా రోహిత్‌, శ్రీ విష్ణు, తాన్యా హోప్ తారాగ‌ణంగా ఆర‌న్ మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి, కృష్ణ విజ‌య్ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు`. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 30న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో శ్రీవిష్ణుతో గురువారం పాత్రికేయుల‌తో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ - ``నేను ఇండస్ట్రీకు వచ్చి 11 ఏళ్ళు అవుతుంది.. డైరెక్టర్ అవుదామని అనుకున్నా.. నాకున్న మోహమాటానికి నటుడ్ని అవుతాననుకోలేదు.. ప్రస్తుతం జర్నీ ఇలా సాగుతోంది. మూడేళ్ల క్రితం ఈ సినిమా చేద్దామ‌ని అనుకున్నాం. రెగ్యుల‌ర్ సినిమాల కంటే భిన్నంగా ఉండాల‌నే ఉద్దేశంతో ఈసినిమా ప్రాసెస్‌ను నెమ్మ‌దిగానే స్టార్ట్ చేశాం. ద‌ర్శ‌కుడు గా ప్రాసెస్ మొదలుపెట్టాం. 1990లలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకొని ఈ సినిమా చేశాం. అందులో ఐదారు సన్నివేశాలు రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని కూడా షేక్ చేశాయి. ఓ క్రికెటర్ కు ఓ పోలీస్ ఆఫీసర్ కు మధ్య నడిచే కథ. ఈ సినిమాలో నేను రైల్వే రాజు పాత్రలో నటించాను. కర్ణుడి లాంటి పాత్ర. మరో ఒకటి, రెండు సంవత్సరాల్లో ఇండియా తరఫున ఆడబోయే క్రికెటర్ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వాటి వలన తన జీవితం ఎలా మారిపోయింది. అనుకున్నది జరగకపోతే అతడు ఎంతదారుణంగా మారిపోయాడు. హైదరాబాద్ ను షేక్ చేస్తాడు.. అటువంటి పాత్రలో నేను నటించాను. నారా రోహిత్ ఉద్యోగం కోసం ఏదైనా చేసే ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపిస్తాడు. డ్యూటీ కోసం రూల్స్ బ్రేక్ చేస్తాడు.. అలానే తనకు నచ్చినట్లు రూల్స్ రాసుకుంటాడు. ఎవరైనా నలుగురు కలిసి మాట్లాడుకునేప్పుడు.. అప్పట్లో ఒకడుండేవాడు అని అంటుంటారు.. అందుకే సినిమాకు అదే టైటిల్ ను పెట్టాం. నీది నాది ఒకే ప్రేమ కథ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాను. అలానే 'మెంటల్ మదిలో' అనే మరో సినిమా ఓకే చేశాను..వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి నుండి సినిమా షూటింగ్ మొదలుకానుంది`` అన్నారు.

Sree Vishnu interview gallery

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved