pizza
Sri Divya interview about Rayudu
మ‌హిళ‌ల‌ను గౌరవించే చిత్ర‌మిది - శ్రీదివ్య‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 May 2016
Hyderaba
d

బ‌స్టాప్‌, మ‌ల్లెల‌తీరంలో సిరిమ‌ల్లె పువ్వు, కేరింత చిత్రాల్లో న‌టించిన తెలుగమ్మాయి శ్రీదివ్య‌. ఇటీవ‌ల విశాల్ ప‌క్క‌న మ‌రుదు చిత్రంలో న‌టించింది. ఆ సినిమా తెలుగులో రాయుడు పేరుతో ఈ నెల 27న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా గురువారం శ్రీదివ్య హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడింది. ఆ విశేషాలు...

* రాయుడులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- ఇందులో నా పాత్ర పేరు భాగ్య‌ల‌క్ష్మి. చాలా రోజుల త‌ర్వాత విలేజ్ కేర‌క్ట‌ర్‌లో న‌టిస్తున్నాను. చాలా ప‌వ‌ర్‌ఫుల్ ఉమెన్ పాత్ర ఇది. ఎక్క‌డా వీక్‌గా ఉండ‌దు. బోల్డ్ గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. త‌ప్పు జ‌రిగితే హీరో అయినా, విలన్ అయినా ఎవ‌రనేది చూడ‌కుండా లాగిపెట్టి కొట్టే అమ్మాయిగా న‌టించాను.

* మ‌హిళా ప్రాధాన్య‌త ఉన్న చిత్ర‌మ‌న్నారు క‌దా? ఎలాగ‌?
- ఇందులో నా పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుంది. మా అమ్మ పాత్ర‌, హీరో అమ్మమ్మ పాత్ర‌, మ‌రోవైపు విల‌న్ ఇంట్లో ఇద్ద‌రు మ‌హిళ‌లుంటారు. వారి పాత్ర‌లు కూడా కీల‌క‌మే. ఇలా మ‌హిళ‌లంద‌రూ క‌లిసి న‌డిపించే చిత్ర‌మిది.

* క‌థా ప‌రంగా చెప్పాలంటే ఏం చెబుతారు?
- అమ్మ‌మ్మ‌- మ‌న‌వ‌డు మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌షిప్‌ని అందంగా చెప్పే చిత్ర‌మ‌వుతుంది.

* సంగీతం గురించి చెప్పండి?
- ఇమాన్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో నేను న‌టించిన ఐదో చిత్ర‌మిది. పాట‌లు చాలా బావున్నాయి. త‌మిళంలో ఎంత హిట్ అయ్యాయో తెలుగులోనూ అంతే విజ‌యం సాధించాయి. తెలుగులో డా.చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి రాసిన `ఒంటి జ‌డ రోజా` పాట నా ఫేవ‌రేట్‌. విశాల్‌గారి ఫేవ‌రేట్ కూడా అదేన‌ని తెలిసింది.

* విశాల్‌తో న‌టించ‌డం ఎలా ఉంది?
- చాలా బావుందండీ. పెద్ద హీరో క‌దా.. ఎలా రిజీవ్ చేసుకుంటారోన‌ని ముందు భ‌య‌ప‌డ్డాను. కానీ చాలా బాగా చూసుకున్నారు. ఆయ‌న‌తో ఒక‌సారి ప‌రిచ‌య‌మైతే చాలా బావుంటుంది. మంచి మ‌నిషి. రాజ‌పాళ్యంలో మేం ఒక స్ల‌మ్‌లో షూటింగ్ చేశాం. అక్క‌డ మ‌రుగుదొడ్లు లేక మ‌హిళ‌లు చాలా ఇబ్బందులు ప‌డేవారు. ఆ విష‌యాన్ని గ‌మ‌నించి విశాల్ టాయిలెట్లు క‌ట్టించారు.

* మీరు కూడా చాలా సాయం చేశార‌ట‌గా?
- న‌న్ను కూడా సాయం చేయ‌మ‌న్నారు. నా వంతుగా ప‌ది టాయిలెట్ల‌ను క‌ట్టించాను.

Sri Divya interview gallery

* విశాల్‌తో సెట్లో తెలుగే మాట్లాడేవారా?
- అవునండీ. హాయిగా మాట్లాడుకునేవాళ్లం. విశాల్ చాలా స‌ర‌దా మ‌నిషి. ఈ సినిమాలో సూరి అని ఇంకో ఆర్టిస్ట్ ఉంటారు. ఆయ‌న, విశాల్ క‌లిస్తే అక్క‌డ సంద‌డే. స‌జెష‌న్ షాట్స్ లో న‌న్ను చాలా ఇబ్బందిపెట్టేసేవారు.

* మీతో వ‌రుస సినిమాలు చేస్తున్నారు నిర్మాత హ‌రి. ఆయ‌న గురించి చెప్పండి?
- చాలా మంచి నిర్మాత హ‌రి. ఆయ‌న గురించి త‌ప్ప‌కుండా ఓ విష‌యం చెప్పాలి. పెన్సిల్ సినిమా చాలా క‌ష్టాల‌ను ఎదుర్కొంది. ఆ స‌మ‌యంలో హ‌రి ఆ సినిమాతో కొలాబ‌రేట్ అయ్యారు. అప్పుడు ఆ సినిమాను రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకొచ్చారు. అనువాద చిత్రాల‌కు కూడా ప్ర‌త్య‌క్ష చిత్రాల‌కు చేసినంత ప‌బ్లిసిటీ చేస్తున్నారు హ‌రి. ఇలాంటి పేష‌నేట్ నిర్మాత‌లుంటే సినిమాలు త‌ప్ప‌కుండా బ‌తుకుతాయి. నా వ‌ర‌కు హ‌రి క‌ష్ట‌ప‌డే నిర్మాత‌. పాజిటివ్ వైబ్రేష‌న్స్ ఉన్న వ్య‌క్తి.

* త‌మిళ్‌లోనే సెటిలైపోయిన‌ట్టున్నారు?
- అలాగ‌నేం కాదు. నేను కోరుకునే పాత్ర‌లు అక్క‌డ వ‌స్తున్నాయి. అయినా నేను చిన్న‌ప్ప‌టి నుంచి త‌మిళ సినిమాలు చూసేదాన్ని. అప్పుడు త‌మిళం అర్ధ‌మ‌య్యేది. ఇప్పుడు నేర్చుకుని మాట్లాడుతున్నాను. అక్క‌డ వ‌రుస‌గా సినిమాలు చేస్తుండ‌టంతో ఇక్క‌డ చేయ‌డానికి కుద‌ర‌డం లేదు. ఇక్క‌డ కూడా మంచి స్క్రిప్ట్ వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాను. కేరింత త‌ర్వాత వ‌చ్చిన గ్యాప్‌ను ఇలాంటి సినిమాలు భ‌ర్తీ చేస్తున్నాయ‌నే అనుకుంటున్నాను.

* ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డ‌ట్టున్నారు?
- అవునండీ. బ‌రువు త‌గ్గాను. ప‌ల్లెటూరి వేషం కోసం చాలా మందిని క‌లిశాను. కానీ ఎవ‌రూ ఆ పాత్ర‌కు సూట్ అయ్యే హావ‌భావాల‌ను చూపించ‌లేదు. అందుకే మా ద‌ర్శ‌కుడు ముత్త‌య్య చెప్పిన‌ట్టు చేశాను. చాలా క‌రెక్ట్ గా చేశాన‌నిపించింది.

* ఇప్పుడు చేస్తున్న సినిమాలేంటి?
- జీవా స‌ర‌స‌న సంగిలిబుంగిలి క‌ద‌వు తెర అనే సినిమా చేస్తున్నాను. కార్తీతో కాశ్మోరాలో న‌టిస్తున్నాను. కాశ్మోరాకి మరిన్ని కాల్షీట్లు ఇవ్వాల్సి వ‌స్తోంది. అందుకే ప్ర‌స్తుతం మ‌రో సినిమాను ఒప్పుకోవ‌డం లేదు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved