pizza
Sri Harsha Konuganti interview about Hushaaru
'హుషారు'తో టార్గెట్‌ ఆడియెన్స్‌ను రీచ్‌ అయ్యాం - శ్రీహర్ష కొనుగంటి
You are at idlebrain.com > news today >
Follow Us

29 January 2019
Hyderabad

బెక్కెం వేణుగోపాల్‌, రియాజ్‌ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'హుషారు'. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్‌, దక్ష నగార్కర్‌, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌ 14న విడుదలై ఈ శుక్రవారంతో 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి పాత్రికేయులతో మాట్లాడుతూ సక్సెస్‌ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా...

- నేటి రోజుల్లో సినిమాలు 50 రోజులను రీచ్‌ కావడం కష్టంగా మారింది. ఇలాంటి రోజుల్లో మా 'హుషారు' సినిమా ఈ శుక్రవారంతో 50 రోజులను పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. ఆ రోజున ఓ ఈవెంట్‌ నిర్వహించి సినిమా ప్రదర్శిస్తున్న 30 థియేటర్స్‌కు వెళ్లి ప్రేక్షకులను కలవబోతున్నాం.

- ఈ సినిమా చేసేటప్పుడే మా టార్గెట్‌ ఆడియెన్స్‌ యూత్‌. ఆ టార్గెట్‌ను రీచ్‌ అయ్యామనే అనుకుంటున్నాం. మా సినిమాకు కనెక్ట్‌ అయ్యి ఎక్కువ సార్లు చూసినవాళ్లు చాలా మంది ఉన్నారు. సోషల్‌ మీడియాలో సినిమా గురించి పాజిటివ్‌గా కూడా యూత్‌ రెస్పాన్స్‌ అయ్యారు.

- సినిమా చూసిన ప్రేక్షకుల్లో .. సినిమాలో నాలుగు క్యారెక్టర్స్‌లో ఏదో ఒక క్యారెక్టర్‌కు కనెక్ట్‌ అవుతున్నారు. నేను కనపడినప్పుడు నన్ను గుర్తుపట్టి మాట్లాడుతున్నారు. వారు సినిమాకు ఎలా కనెక్ట్‌ అయ్యామనే విషయాన్ని చెబుతున్నారు. ప్రేక్షకులే సినిమాను నెక్స్‌ట్‌ లెవల్‌కు తీసుకెళ్లారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది.

- తదుపరి రెండు సినిమా కథలను రాస్తున్నాను. పెద్ద బ్యానర్స్‌తో పనిచేయబోతున్నాను.

- ఇండస్ట్రీ నుండి చాలా మంది సినిమా చూసి అప్రిషియేట్‌ చేశారు. మా సినిమా పెద్ద సినిమాలను తట్టుకుని ముందుకు రావడంతో సినిమాలో కంటెంట్‌ ఉందని అందరూ మెచ్చుకున్నారు.

- 'ఉండిపోరాదే..' సాంగ్‌కు ముందు వేరే ఆలోచన ఉండేది. అయితే కథానుగుణంగా హీరో.. హీరోయిన్‌కు సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకుంటాడు. అందులో భాగంగా యు.ఎస్‌ వెళ్లాలనుకున్న హీరోయిన్‌తో హీరో మనం ఇక్కడే ఉండిపోదాం. నేను చాలా బాగా చూసుకుంటాను. అనే చెప్పడమే ఉద్దేశానికి రధన్‌గారు అద్భుతమైన ట్యూన్‌ ఇచ్చారు. సిద్‌శ్రీరాం ఆ ట్యూన్‌కు అద్భుతమైన గాత్రాన్ని ఇచ్చారు. ఈ పాట చాలా బావుందని అల్లు అర్జున్‌గారు కూడా ట్వీట్‌ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సాంగ్‌కు శాడ్‌ వెర్షన్‌ కూడా చాలా పెద్ద హిట్టయ్యింది.

- ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. నన్ను డైరెక్ట్‌ చేయమని అన్నారు. కానీ కుదరలేదు.

- ఈ సినిమాకు బేసిక్‌ ఐడియా ఏంటంటే.. పాతికేళ్లు వయసులో ఉద్యోగం లేకపోతే యూత్‌ ఎలా బ్రతుకుతారు? అనేదే. ఈ జనరేషన్‌ అలాంటిది కుదురుతుందా? లేదా? అనేది ఈ సినిమాలో చూపించాం.

- మేం అనుకున్న బడ్జెట్‌ తక్కువే. అయితే ఆ బడ్జెట్‌ కూడా అనుకున్న దాని కంటే ఎక్కువే. ఆ బడ్జెట్‌ను నిర్మాతగారు నెమ్మదిగా తెచ్చారు. నెలకు ఐదు రోజులే షూట్‌ చేశాం.

- ఇప్పుడు ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించడం కష్టమవుతుంది. వాళ్లకి కొత్త పాయింట్‌ అనిపిస్తేనే థియేటర్‌కు వస్తున్నారు. జనాలకు నచ్చే కాన్సెప్ట్‌తోనే సినిమా చేయాలి.

- నేను చేయబోయే రెండు సినిమాల్లో ఒక సబ్జెక్ట్‌ ఫుల్‌ పాజిటివ్‌ మూవీ. క్లీన్‌ యు సర్టిఫికేట్‌ మూవీ అవుతుంది. ఇన్‌స్పిరేషనల్‌ మూవీ.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved