pizza
Srinivasa Reddy interview (Telugu) about Jamba Lakidi Pamba
`జంబ‌ల‌కిడి పంబ‌` అనేది సినిమాలో మంత్రం - శ్రీనివాస‌రెడ్డి
You are at idlebrain.com > news today >
Follow Us

20 June 2018
Hyderabad

`గీతాంజ‌లి`, `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` త‌ర్వాత శ్రీనివాస‌రెడ్డి క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `జంబ‌ల‌కిడి పంబ‌`. ఈ సినిమాకు మ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 22న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో శ్రీనివాస‌రెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* `జంబ‌ల‌కిడి పంబ‌` గురించి చెప్పండి?
- క‌థే హీరో. చాలా బావుంటుంది. అమ్మాయి ఆత్మ అబ్బాయిలోకి వెళ్ల‌డం, అబ్బాయి ఆత్మ అమ్మాయిలోకి ప్ర‌వేశించ‌డం ఇందులో ప్ర‌త్యేక‌త‌.

* అమ్మాయిలాగా ప్ర‌వ‌ర్తించ‌డానికి ఏమైనా హోమ్ వ‌ర్క్ చేశారా?
- మ‌న న‌రేశ్‌గారు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు న‌టించిన సినిమాలు చూశాను. చంట‌బ్బాయిలో చిరంజీవిగారి పెర్ఫార్మెన్స్ చూశాను. ఇంట్లో కూడా మా ఆవిడ నైటీ వేసుకుని కాసేపు ఎలా ఉంటుందో చూశాను.

* ఇంట్లో వాళ్లు ఏమ‌న్నారు?
- నాకు ఇద్ద‌ర‌మ్మాయిలు. మా ఆవిడతో మా పెద్ద‌మ్మాయి.. `చూడమ్మా.. మ‌నింటికి చ‌మేలీ రాణి వ‌చ్చింది` అని ఆట‌పట్టించింది.

* ఈ పాత్ర చేయ‌డానికి ఏమైనా ఇబ్బందులు ప‌డ్డారా?
- అలాంటివేమీ లేవండీ. కాక‌పోతే నైటీలు, లిప్‌స్టిక్‌లు వేసుకుని కేర‌వ్యాన్ నుంచి దిగేట‌ప్పుడు కొంత సేపు ఇబ్బందిగా అనిపించింది అంతే.

* ద‌ర్శ‌కుడు తొలి సినిమా బాగా ఆడ‌లేదు క‌దా.. ఆయ‌న‌తో సినిమా అన‌గానే అలాంటి అంశాల‌ను ఏమైనా ఆలోచించారా?
- అబ్బే. అస‌లు లేదండీ. అస‌లు ఆయ‌న సినిమాను కూడా చూడ‌లేదు. ఈ క‌థ బాగా చెప్పారు. విన‌గానే బాగ‌నిపించింది. రెండు సార్లు క‌థ విన్నా. మొన్న సినిమా చూశాక చెప్పింది చెప్పిన‌ట్టు తీశార‌నిపించింది.

* `జంబ‌ల‌కిడి పంబ‌`కు ఈ సినిమాకూ ఎక్క‌డా పొంత‌న ఉండ‌ద‌ని అంటున్నారే?
- నిజ‌మేనండీ. అందులో ఊర్లో వాళ్లంద‌రూ అటూ ఇటూగా మారుతారు. మా సినిమాలో ఒకకుటుంబంలోని భార్యాభ‌ర్త‌లు మాత్ర‌మే అటూ ఇటూ మారుతారు. అంత‌కు మించి ఏమీ ఉండ‌దు.

* టైటిల్ విన‌గానే అంద‌రికీ ఆ సినిమా గుర్తుకొస్తుందేమో?
- అయ్యే ఉంటుంది. కానీ సినిమా మొద‌లైన ప‌ది నిమిషాల‌కు ఆ విష‌యాన్ని మ‌ర్చిపోతాం.

* పాట‌ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తున్నారుగా..?
- అవునండీ. మ‌నుకి గోపీసుంద‌ర్ ఎప్ప‌టి నుంచో ఫ్రెండ్‌. అయితే ఆయ‌న ఫ్రెండ్ కోసం అన్న‌ట్టు కాకుండా, క‌థ న‌చ్చి ఈ సినిమా చేశారు. పాట‌లు చూసి మా అమ్మా నాన్న కూడా మెచ్చుకున్నారు. చాలా బాగా వ‌చ్చాయి. ప్ర‌మోష‌నల్ సాంగ్ కోసం రెండు రోజులు ప్ర‌త్యేకంగా చిత్రీక‌రించారు. దాంతో పాటు యానిమేష‌న్ కూడా చేశారు. నిర్మాత‌లు ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌లేదు. ప్ర‌తిసారీ వాళ్లూ క్వాలిటీ కోసమే ఖ‌ర్చు పెట్టారు. అన్నిటినీ ది బెస్ట్ ఇవ్వ‌డానికే ట్రై చేశారు.

* ఈ పాత్ర చేశాక అమ్మాయిల ప‌ట్ల గౌర‌వం పెరిగిందంటారా?
- అంటే సిటీ బ‌స్సుల్లో తిరిగిన వాడిని క‌దా అండీ... మ‌హిళ‌ల‌ను గౌరవించాలి. వారికి కేటాయించిన సీట్ల‌లో వారినే కూర్చోనివ్వాలి వంటి విష‌యాల‌ను అప్ప‌టి నుంచే నేర్చుకున్నా. కాబ‌ట్టి దీని ద్వారా స్పెష‌ల్‌గా తెలుసుకున్న‌ది ఏమీ లేదు.

interview gallery* సెన్సార్ వాళ్లు ఏమ‌న్నారు?
- సెన్సార్ చేసిన మ‌హిళ‌లు వ‌చ్చి `సున్నిత‌మైన అంశాల‌ను కూడా చాలా చ‌క్క‌గా డీల్ చేశారు. ఎక్క‌డా అతిగా చేయ‌లేదు` అని అన్నారు. ఆ మాట న‌చ్చింది. ఈ చిత్రంలో ఓ చోట లేడీస్ పీరియ‌డ్స్ గురించి చెప్పాం. దాన్ని కూడా చాలా సెన్సిటివ్‌గా చెప్పాం. మా ఇంట్లో మా అమ్మా, నా భార్య‌, ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లున్నారు. కాబ‌ట్టి అమ్మాయిల ఇబ్బందుల‌న్నీ నాకు ముందే తెలుసు.

* ఓ వైపు క‌మెడియ‌న్‌గా చేస్తూ, మ‌రోవైపు హీరోగా చేస్తుండ‌టం ఎలా ఉంది?
- ఇందులో కూడా హీరో అని అనుకోనండీ. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేస్తున్నాన‌నే అనుకుంటా.దాని వ‌ల్ల నా మీద ప్రెజ‌ర్ ఉండ‌దు. త్రివిక్ర‌మ్‌గారు కూడాఅలాంటి ప్రెజ‌ర్‌ని మోయ‌వ‌ద్ద‌నే చెబుతారు. కొంద‌ర‌యితే నేను సెట్లోకి వెళ్ల‌గానే` మ‌న‌ది మ‌ల్టీస్టార‌ర్ సినిమా. ఈ చిత్రంలో శ్రీనివాస్‌రెడ్డి కూడా ఉన్నాడు` అని ఆట ప‌ట్టిస్తుంటారు.

* మీ ఫ్రెండ్స్ అంద‌రూ క‌లిసి నిర్మాణ సంస్థ‌ను పెడుతున్నార‌ట క‌దా?
- అవునండీ. ఫ్లైయింగ్ క‌ల‌ర్స్ అని మేం 13 మంది ఒక గ్రూప్‌లో ఉంటాం. అందులో ఉన్న వారంద‌రూ క‌లిసి ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్ పెడ‌తాం. చాలా మంది టాలెంటెడ్ ఉంటారు క‌దా. వాళ్ల‌తో సినిమాలు చేస్తాం. వాట‌న్నిటికీ `భాగ్య‌న‌గ‌ర వీథుల్లో` అనేది కామ‌న్ పాయింట్‌. దాని త‌ర్వాత `గ‌మ్మ‌త్తు` అనేదాన్ని క‌లుపుతున్నాం. సినిమా, సినిమాకీ ఈ ప‌దాలు మారుతాయి.

* `జంబ‌ల‌కిడి పంబ‌`లో మీ చిన్న పాప యాక్ట్ చేసిందిగా?
- అవునండీ. క్లైమాక్స్ లో క‌నిపిస్తుంది. ఆశ్రితి అని పేరు పెట్టాం. మా పెద్ద‌మ్మాయి పేరు ఆకృతి. త‌న పేరులోని ఆ, నా పేరులోని శ్రి, నా భార్య స్వాతి పేరులోని తి క‌లిపి ఆశ్రితి అని పెట్టాం.

* మీ త‌దుప‌రి సినిమాలేంటి?
- త్రివిక్ర‌మ్ చిత్రం, ర‌వితేజ సినిమా, పంతం, వీర‌భోగ‌వ‌సంత‌రాయలు సినిమాల్లో చేస్తున్నా. హీరోగానూ ఓ సినిమా ఉంది. ఆ వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం.

* `గీతాంజ‌లి 2`లో మీరు న‌టిస్తున్నారా?
- ఇంకా న‌న్ను ఎవ‌రూ సంప్ర‌దించ‌లేదండీ.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved