pizza
Srinivasa Reddy interview (Telugu) about Jayammu Nischayammu Raa
`జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` సినిమా జంధ్యాల‌గారి త‌ర‌హా కామెడితో ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది - శ్రీనివాస‌రెడ్డి
You are at idlebrain.com > news today >
Follow Us

15 November 2016
Hyderaba
d

శ్రీనివాస‌రెడ్డి, పూర్ణ హీరో హీరోయిన్లుగా ఎ.వి.ఎస్‌.రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శివ‌రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై శివ‌రాజ్ క‌నుమూరి ద‌ర్శ‌క‌త్వంలో శివ‌రాజ్ క‌నుమూరి, స‌తీష్ క‌నుమూరి నిర్మాత‌లుగు రూపొందుతోన్న చిత్రం `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా`. ఈ సినిమా న‌వంబ‌ర్ 25న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా హీరో శ్రీనివాస‌రెడ్డితో ఇంట‌ర్వ్యూ విశేషాలు....

క‌థ నుండే కామెడి పుడుతుంది....
- `గీతాంజ‌లి`లో పూర్తిస్థాయి క‌థానాయ‌కుడ‌ని చెప్ప‌ను కానీ `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` సినిమాలో పూర్తి స్థాయి హీరోగా న‌టించాను. క‌రీంన‌గ‌ర్‌కు చెందిన స‌ర్వ‌మంగ‌ళం ఉద్యోగ‌రీత్యా ట్రాన్స్‌ఫ‌ర్ కోసం ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేశాడు. వాటి నుండి ఎలా అదిగ‌మించాడ‌నేదే క‌థ‌. స‌ర్వ‌మంగ‌ళం స‌ర్వేష్ కుమార్ ఎలా అయ్యాడ‌నేదే క‌థ‌. జంధ్యాల గారి స్ట‌యిల్లో ఉండే చ‌క్క‌టి కామెడితో అహ్లాదంగా న‌డిచే సినిమా ఇది. కోర్టు స‌న్నివేశం మిన‌హా మిగ‌తావ‌న్నీఓరిజిన‌ల్ లోకేషన్స్‌లోనే సినిమాను షూట్ చేశాం. సినిమా ఎక్కువ‌గా అవుట్‌డోర్‌లోనే చేశాం.

అందుకే ఆ క్యాప్ష‌న్...
- మ‌న ట్రెండ్‌కు సంబంధించినది మ‌న మూలాలు. ఈ సినిమాలో త‌త్కాల్ క్యారెక్ట‌ర్‌, గుంటూరు పంతులు పాత్ర‌, ఇలా అన్ని పాత్ర‌లు మ‌న చుట్టూ ఉన్న‌ట్టుగానే క‌న‌ప‌డ‌తాయి. ట్రాక్‌లో నుండి పుట్టిన కామెడి కాదు...కామెడి క‌థ‌లోనే నుండి పుట్టింది. మ‌న‌మేదైతే మిస్ అవుతున్నామో దాన్ని గుర్తుకు తేవ‌డానికే దేశ‌వాళి వినోదం అనే క్యాప్ష‌న్ పెట్టాం.

2013లో జ‌రిగే క‌థ‌....
- ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్ర‌జ‌లు క‌లిసి ఉన్న నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌. అది జ‌నాల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డానికి `అత్తారింటికి దారేది` అనే సినిమాను `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా`లో ఓ క్యారెక్ట‌ర్‌గా పెట్ట‌డం జ‌రిగింది. ఎందుకంటే 2013లో `అత్తారింటికి దారేది` బిగ్గెస్ట్ హిట్ మూవీ. నా ప్రేమ క‌థంతా అత్తారింటికి దారేది క్యారెక్ట‌ర్ స‌మ‌క్షంలోనే జ‌రుగుతుంది.

జె.డి గారు రెఫ‌రెన్స్‌తో వ‌చ్చిన సినిమా....
- `గీతాంజ‌లి` త‌ర్వాత నాకు హ‌ర్ర‌ర్ సినిమాల క‌థ‌లే చేయ‌మ‌ని వ‌చ్చాయి. దాదాపు ఎన‌బై క‌థ‌లు విన్న త‌ర్వాత ఓ సినిమాలో న‌టించ‌డానికి రెడీ అయ్యాను. ఆ సినిమా లుక్‌ను నా మిత్రుడొక‌రికి పంపితే హ‌ర్రర్ స్టార్ జిందాబాద్ అని మెసేజ్ పెట్టాడు. హ‌ర్ర‌ర్ సినిమాలే చేస్తే హ‌ర్ర‌ర్ స్టార్ అంటార‌ని దాని సారాంశం. అయితే నేను చేయాల‌నుకున్న రెండో సినిమా ముందుకెళ్ల‌లేదు. హీరోగానే కంటిన్యూ కావాల‌నే ఆలోచ‌న నాకు లేదు. నేను క్యారెక్టర్స్ వేసుకుంటూ ఉన్నాను. అప్పుడు జె.డి.చ‌క్ర‌వ‌ర్తిగారు ఈ పేరు సూచించారంటూ నా ఫ్రెండ్ ఫోన్ చేశారు. అప్ప‌టి వ‌ర‌కు నేను జె.డి.గారితో క‌లిసి సినిమా చేయ‌లేదు. మాట్లాడ‌లేదు. కానీ ఆయ‌న న‌న్ను ఊహించుకుని క‌థ నా వ‌ద్ద‌కు పంపారంటే ఏదో ఉంద‌ని క‌థ విన‌డానికి ద‌ర్శ‌కుడిని ర‌మ్మ‌న్నాను. క‌థ విన్నాక నేను నా సినిమాల్లో ఎలా అయితే ఉండాల‌నుకున్నానో ఆ ఎలిమెంట్స్ ఉండ‌టంతో ఈ ప్రాజెక్ట్‌లోఇన్‌వాల్వ్ అయ్యాను.

Srinivasa Reddy interview gallery

హీరోయిన్ పూర్ణ గురించి....
- ద‌ర్శ‌క నిర్మాత‌లు నేను, పూర్ణ‌గారు లాస్ట్ చాయిస్‌గా వ‌చ్చారు. అప్ప‌టికే బౌండెడ్ స్క్రిప్ట్ అంతా రెడీ అయ్యింది. క‌థ ప్ర‌కారం రాణి అనే పాత్ర‌కు తెలుగు నెటివిటీ ఉన్న హీరోయిన్‌లా అనిపించాల‌ని పూర్ణ‌గారు బావుంటార‌నిపించి ఆమెను క‌లవ‌డం, ఆమెకు క‌థ న‌చ్చ‌డంతో ఆమె న‌టించ‌డానికి ఓకే చెప్పారు.

క్యారెక్ట‌ర్సే నాకు మెయిన్‌....
- `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` సినిమా ముందు వ‌ర‌కు నేను ఇత‌ర సినిమాల్లో చాలా క్యారెక్ట‌ర్స్ చేశాను. నటుడుగా నాకంటూ గుర్తింపు వ‌చ్చింది క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానే, కాబ‌ట్టి వాటిని నేను వ‌ద‌ల్లేదు. వాటిని మిస్ కాకుండా కెరీర్ ప్లాన్ చేసుకోవాలి. క్యారెక్ట‌ర్సే నాకు మెయిన్‌.

ద‌ర్శ‌కుడు శివ‌రాజ్‌ క‌నుమూరి గురించి....
- ద‌ర్శ‌కుడు శివ‌రాజ్ క‌నుమూరి వ‌ర్మ‌గారు, జె.డి.గారు, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ వ‌ద్ద ప‌నిచేశారు. లండ‌న్‌లో ఓ కంపెనీ సి.ఇ.ఓ రేంజ్‌లో వ‌ర్క్ చేసి బాగా డ‌బ్బులు సంపాదించుకుని, ఫ్యామిలీని అంతా సెట్ చేసి త‌న డ‌బ్బుల‌తోనే సినిమా చేయాల‌ని వ‌చ్చారు. పెద్ద హీరోతో సినిమా చేయాల‌ని వ‌చ్చారు. అయితే పెద్ద హీరోతో సినిమా చేయాలంటే ముందు త‌నెంటో ప్రూవ్ చేసుకోవాల‌ని జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా క‌థ రాసుకున్నారు. అలా త‌న‌కు న‌చ్చిన విధంగా సినిమా చేయాల‌ని ఓ ప్లానింగ్‌లో సినిమాను పూర్తి చేశారు. ఆయ‌న ఏ ధైర్యంతో సినిమా చేశాడో, ఆ ధైర్యంతో బిజినెస్ కూడా పూర్త‌య్యింది.

తదుప‌రి చిత్రాలు...
- హీరోగా ఇంకా ఏ సినిమా అనుకోలేదు. క్యారెక్ట‌ర్స్ చేయాల‌నుకుంటున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved