pizza
Srinivas Avasarala interview (Telugu) about Jyo Achyutananda
`జ్యో అచ్యుతానంద‌` ముక్కోణ‌పు ప్రేమ‌క‌థాచిత్రం కాదు - శ్రీనివాస్ అవ‌స‌రాల‌
You are at idlebrain.com > news today >
Follow Us

06 September 2016
Hyderaba
d

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం `జ్యో అచ్యుతానంద`. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ అవ‌స‌రాల‌తో ఇంట‌ర్వ్యూ విశేషాలు...

సినిమా ఎలా ఉంటుంది....
- ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో జ్యో అచ్యుతానంద సినిమా ముక్కోణ‌పు ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని రాశారు. కానీ నిజానికి ఇది ముక్కోణ‌పు ప్రేమ‌క‌థా చిత్రం కాదు. ఇద్ద‌రు అన్న‌దమ్ముల మ‌ధ్య అనుబంధాలు, అపాయ్య‌త‌లు ఎలా ఉంటాయి, ఇలాంటి ఎమోష‌న్స్‌ను తెలియ‌చెప్పే అన్న‌ద‌మ్ముల మ‌ధ్య న‌డిచే క‌థాంశం. కామెడి, రొమాంటిక్ ల‌వ్ స్టోరీ కాదు.

పాత్ర‌ల తీరు తెన్నులు...
- నారా రోహిత్ అచ్యుత్ పాత్ర‌లో, నాగ‌శౌర్య ఆనంద్‌గా, రెజీనా జో పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. ఇద్ద‌రు హీరోలకు అల్రెడి పెళ్లై పోయుంటుంది. వారి జీవితంలోకి రెజీనా ఎంట‌ర్ అయిన త‌ర్వాత ఎలాంటి మ‌లుపులు తీసుకుంటుంద‌నేదే సినిమా. పూర్తి ప్రేమ క‌థా చిత్రమైతే కాదు. ప్రేమ వ‌ల్ల అన్న‌దమ్ములు క‌లుస్తారు, విడిపోతారు, చివ‌ర‌కు క‌లిసిపోతారు. ఈ టైంలో వారి మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న్స్‌తో సినిమా ప్రధానంగా సాగుతుంది. ఫ‌స్టాఫ్ అంతా 2010-11 మ‌ధ్య న‌డిస్తే సెకండాఫ్ 2016 నేప‌థ్యంలో న‌డుస్తుంది.

క‌థ న‌చ్చి చేస్తామ‌న్నారు...
- మ‌ల్టీస్టార‌ర్ కాన్సెప్ట్ కావ‌డంతో కొంత మంది హీరోల‌ను క‌లిసి చెప్పాను. కానీ వారికి సినిమా చేయ‌డానికి కుద‌ర‌లేదు. నారా రోహిత్‌గారికి క‌థ చెప్ప‌గానే న‌చ్చింది. వెంట‌నే చేస్తాన‌న్నారు. అప్ క‌మింగ్ హీరోస్ కావ‌డంతో రోహిత్‌, శౌర్యతో చేస్తేనే బావుంటుంద‌ని ముందుకెళ్లాం.

Srinivas Avasarala interview gallery

ఇలాంటి సినిమాలే చేస్తాడ‌నిపించుకోకూడ‌దు...
- ఊహాలు గుస‌గులాడే సినిమా ఒక అబ్బాయి, అమ్మాయి మ‌ధ్య న‌డిచే ప్రేమ‌క‌థా చిత్రం. మ‌ళ్ళీ అలాంటి సినిమా చేస్తే ఈ డైరెక్ట‌ర్ ఇలాంటి సినిమాలే చేయ‌గ‌ల‌డ‌ని అనుకుంటారు కదా అని ఆలోచించేట‌ప్పుడు నాకు ఈ ఆలోచ‌న వ‌చ్చింది. అన్నద‌మ్ముల క‌థ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు చాలానే వ‌చ్చాయి. ఇంత‌లో కొత్త‌ద‌నం ఏంటనేది ఇప్పుడే చెప్ప‌లేను. సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు త‌ర్వాత వ‌స్తున్న అన్న‌ద‌మ్ముల నేప‌థ్యంలో వ‌స్తున్న సినిమా. రైటింగ్ ప‌రంగా, టేకింగ్ ప‌రంగా గ‌త సినిమాల కంటే కొత్త‌గా ఉండి అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను.

మ‌రో సినిమా చేయాల‌నుకుంటున్నాను...
- వారాహి చల‌న‌చిత్రంలో ప‌నిచేసిన ఏ దర్శ‌కుడికైనా సాయికొర్ర‌పాటిగారెంత మంచి నిర్మాతో తెలుసు. ఆయ‌న‌తో మ‌రో సినిమా చేయాల‌నే అనుకుంటారు. నేను కూడా అంతే..ఆయ‌న ప్రొడ‌క్ష‌న్‌లో మ‌రో సినిమా చేయాల‌నుకుంటున్నాను. అది నెక్ట్స్ మూవీయా, ఇంకేదైనా అని ఇప్పుడే చెప్ప‌లేను.

తదుప‌రి చిత్రాలు...
- వారాహి చ‌ల‌న‌చిత్రంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే జెంటిల్‌మ‌న్ త‌ర్వాత నానిలో ఓ కొత్త యాక్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చాడు. కాబ‌ట్టి ఆ సినిమా కంటే బావుండేలా నేను నానితో సినిమా చేయాల‌నుకుంటున్నాను. అల్రెడి లైన్ చెప్పాను. చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. న‌టుడిగా బాలీవుడ్ మూవీ హంట‌ర్‌కు రీమేక్ సినిమాలో హీరోగా న‌టిస్తున్నాను. హంట‌ర్‌లాంటి రీమేక్‌లో ఎందుకు చేస్తున్నావ‌ని అన్నారు, కానీ ఆ సినిమా నేను కూడా చూశాను. ఆ సినిమాలో మంచి ఎమోష‌న‌ల్ కంటెంట్ ఉంది. తెలుగులో సినిమా ఆ కోణంలో సాగుతుంది.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved