pizza
Srinivas Ravindra interview about Dwaraka
`ద్వార‌క‌` వ్యంగ్యంతో కూడుకున్న కామెడి సినిమా - శ్రీనివాస్ ర‌వీంద్ర‌
You are at idlebrain.com > news today >
Follow Us

20 February 2017
Hyderabad

`పెళ్లిచూపులు`తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొన్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "ద్వారక". విజయ్ దేవరకొండ సరసన పూజా ఝావేరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు. "లెజెండ్ సినిమా" బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు నిర్మాతలు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పిస్తున్న ఈ చిత్రం మార్చి 3న విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ ర‌వీంద్ర‌తో ఇంట‌ర్వ్యూ....

నేప‌థ్యం....
-నేను పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా. ఎంఏ సైకాలజీ చ‌దివాను. చ‌దువు పూర్త‌యిన త‌ర్వాత రెండేళ్లు బిజినెస్ చేశాను. కానీ అందులో ఉండలేక నాకు తెలిసిన ఓ స్నేహితుడి ద్వారా 2002లో అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. చాలా సినిమాల‌కు ముందు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, రైట‌ర్‌గా వ‌ర్క్ చేశాను. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తమ్మారెడ్డి భరద్వాజ్‌గారి వ‌ద్ద‌, పవన్ కళ్యాణ్ వంటి వారి దగ్గర వర్క్ చేశాను.

క‌థేంటంటే...
- `ద్వార‌క` సినిమా ఓ అపార్ట్‌మెంట్ బేస్‌తో న‌డిచే క‌థ. క‌థానుగుణంగా సినిమాలోని పాత్రలన్నీ అపార్ట్‌మెంట్‌లో ఉంటాయి. కృష్ణుడిలోని అనేక అంశాలను టచ్ చేస్తూ ఈ సినిమా చేశాను. సినిమా బేస్ పాయింట్ ప్రేమ అయినా ప్రేమ‌క‌థ కాదు. చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా అంద‌రికీ న‌చ్చేలా అన్నీ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి సినిమా చేశాను.

హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌....
- విజ‌య్ దేవ‌ర కొండ ముందు చిత్రం పెళ్ళి చూపులులో బద్ధ‌క‌స్థుడైన యువ‌కుడుగా క‌న‌ప‌డ‌తాడు. కానీ ఈ సినిమాలో త‌న‌ని డిఫ‌రెంట్ యాంగిల్స్‌లో ప్రెజెంట్ చేశాను. ఇందులోవిజ‌య్ దేవ‌ర కొండ పాత్ర పేరు ఎర్ర‌శీను. దొంగ‌త‌నాలు చేస్తుంటాడు. ఓ దొంగ జీవితం అనుకోకుండా ఎలాంటి మ‌లుపు తిరిగింది. త‌ను ప్రేమ వ‌ల్ల ఎలా మారాడ‌నేదే క‌థ‌.హీరో క్యార‌క్ట‌రైజేష‌న్ దొంగగా, ప్రేమికుడిగా, దేవుడిగా కనిపిస్తుంది. విజయ్ నాకు ముందునుండే తెలుసు. అతని మొదటి సినిమాలోనే అతనిలో ఏదో స్పార్క్ ఉందని గమనించా. నిర్మాతలకు అతని పేరు సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా వెంటనే ఒప్పుకున్నారు.

మెసేజ్ ఏం లేదు...
- ఈ సినిమా ద్వారా దేవుడున్నాడా, లేడా అనేలా ఎటువంటి మెసేజ్‌లు ఇవ్వ‌డం లేదు. ఎందుకంటే సినిమా పూర్తిగా దేవుడి మీద కథ నడవదు. అదొక యాంగిల్ మాత్రమే. మెసేజ్ లాంటివి ఏవీ ఇవ్వను. ఇదొక వ్యంగ్య మైన కూడుకుని, కామెడితో నడిచే కథ.

అందుకే ఆల‌స్యం...
- `ద్వారక‌` సినిమా పెళ్ళిచూపులు సినిమా కంటే పూర్త‌యినా డీ మానిటైజేష‌న్, కొన్ని సాంకేతిక కార‌ణాల‌తో ఆల‌స్య‌మైంది.

నా స్ట‌యిల్ అదే....
- సినిమా ఇండ‌స్ట్రీలో ఒక్కొక్క‌రిదీ ఒక్కొక్క స్ట‌యిల్‌. కొందరు విజువల్స్ తో ఎంటర్టైన్ చేస్తే, మ‌రి కొందరు యాక్షన్ తో చేస్తారు. నేను మాత్రం స్క్రిప్ట్ వర్క్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాను. ఈ సినిమాకి కథే ప్రధాన బలం. .


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved