pizza
Sriram Aditya interview (Telugu) about DevaDas
నాతో ఉన్న చ‌నువు కొద్దీ అలా అన్నారు - శ్రీరామ్ ఆదిత్య‌
You are at idlebrain.com > news today >
Follow Us

29 September 2018
Hyderabad

మామూలు సినిమాల‌ను తెర‌కెక్కించ‌డానికీ, మ‌ల్టీస్టార‌ర్ల‌ను తెర‌కెక్కించ‌డానికీ త‌ప్ప‌కుండా ఎంతో కొంత తేడా ఉంటుంది. అయితే గ‌త రెండు చిత్రాల‌తో త‌ను స్టార్ల‌ను డీల్ చేయ‌గ‌ల‌డ‌నే న‌మ్మ‌కాన్ని తెచ్చుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య‌. ఆయ‌న తెర‌కెక్కించిన `దేవ‌దాస్‌` మొన్న గురువారం విడుద‌లైంది. ఈ సినిమా గురించి హైద‌రాబాద్‌లో శ‌నివారం శ్రీరామ్ ఆదిత్య విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* ఈ సినిమా ఎలా సెట్ అయింది?
- నేను `శ‌మంత‌క‌మ‌ణి` సినిమా విడుద‌ల హ‌డావిడిలో ఉన్నా. అప్పుడు ఓ రోజు అశ్వ‌నీద‌త్‌గారి నుంచి ఫోన్ వ‌చ్చింది. `దేవ‌దాస్‌` పాయింట్ చెప్పి, డెవ‌ల‌ప్ చేయ‌మ‌న్నారు. నాగార్జున‌, నాని హీరోల‌ని చెప్పారు.

* మ‌ళ్లీ మ‌ల్టీస్టార‌ర్ అన‌గానే మీకేమ‌నిపించింది?
- నాకు సోలో స్టారా? మ‌ల్టీస్టార‌రా? అనే అనుమానాలు, భ‌యాలు ఎప్పుడూ లేవు. నాకు ఇష్ట‌మైన జోన‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. నాకిచ్చిన స్క్రిప్ట్ ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్ వేలో ఉంది. అందుకే వెంట‌నే అంగీక‌రించా.

* నాగార్జున లుక్ గురించి చెప్పండి?
- అప్ప‌ట్లో `మ‌న్మ‌థుడు`, `హ‌లో గురూ` వంటి సినిమాల్లో ఆయ‌న లుక్ చాలా బావుంటుంది. అలాంటి లుక్ కోస‌మే ప్ర‌య‌త్నించాం. ఆయ‌న్నిఇంకా స్టైలిష్‌గా చూపించాల‌నుకున్నా. అందుకే లుక్ పరంగా వ‌ర్కవుట్ చేశా.

* నాని కేర‌క్ట‌ర్ గురించి చెప్పండి?
- నాని లుక్ కోసం రెండు, మూడు గెట‌ప్పులు అనుకున్నాం. ఈ లుక్ ఆయ‌న‌కు బావుండ‌టంతో ఓకే చేశాం.

* ఇద్ద‌రు హీరోలు సెట్లో ఉంటే టెన్ష‌న్ ఉండేదా?
- లేదండీ. కాక‌పోతే నాగార్జున‌గారితో చ‌నువు ఉండేది కాదు. ఆయ‌న ప‌ట్ల గౌరవం ఉండేది. ఉట్టికొట్టే సీన్లో ఆయ‌న డూప్‌లేకుండా చేశారు. ఆయ‌న అలా న‌టిస్తుంటే గౌర‌వం రెట్టింప‌యింది.

interview gallery



* సినిమాకు ఎలాంటి స్పంద‌న వ‌స్తోంది?
- సినిమా చూసిన వారంద‌రూ బావుంద‌ని మెచ్చుకుంటున్నారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి సినిమా బాగా న‌చ్చింది. థియేట‌ర్ల‌లో విజిల్స్ వేసుకుంటూ చూస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. అంద‌రికీన‌చ్చింద‌ని అంటుంటే చాలా ఆనందంగా ఉంది.

* నాగార్జున‌గారు లేజీ ఫెలో అని అన్నారు..
- ఆయ‌న‌కు నామీద ఉన్న చ‌నువుతో అన్న మాటండీ. అంతే కానీ, ఇంకోలా కాదు.

* సినిమాను ముందే చూపించాల్సింది అని కూడా అన్నారుగా..
- అన్నారు కానీ, సినిమా చూశాక బాగా చేశాన‌ని మెచ్చుకున్న మొద‌టి వ్య‌క్తి కూడా ఆయ‌నే. కాక‌పోతే నేను షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కి కూడా ఎక్కువ స‌మ‌యాన్ని తీసుకుంటా. అందుక‌ని అలా అన్నారేమో.

* వైజ‌యంతీ మూవీస్‌లో ప‌నిచేయ‌డం ఎలా ఉంది?

- ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సంస్థ అది. నా వెనుక అశ్వినీద‌త్‌గారు ఉన్నార‌న్న ఆలోచ‌న చాలా గొప్ప‌గా అనిపించింది. ఆ ధైర్యాన్ని మాట‌ల్లో చెప్ప‌లేం.

* ఈ సినిమాకు సీక్వెల్ చేద్దామ‌ని నాగార్జున అన్నారు క‌దా..

- సీక్వెల్‌కి క‌థ సిద్ధం చేసి, ఇదే టీమ్‌తో చేస్తే చాలా బావుంటుంది. కానీ ఇంకా అలాంటి ఆలోచ‌న రాలేదు. అస‌లు నా నెక్స్ ప్రాజెక్ట్ గురించి కూడా ఇంకా నేనేం ఆలోచించ‌లేదు. ప్ర‌స్తుతానికి `దేవ‌దాస్` స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నా.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved