pizza
Sriram Venu interview (Telugu) about MCA
చాలా బాధ్య‌త‌గా తీసిన చిత్రం `ఎంసీఏ` - శ్రీరామ్‌వేణు
You are at idlebrain.com > news today >
Follow Us

27 December 2017
Hyderabad

నాని, సాయిప‌ల్ల‌వి, భూమిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `ఎంసీఏ`. ఈ సినిమాతో దిల్‌రాజు సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ 2017లో అర‌డ‌జ‌ను హిట్ల‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా గురించి ఆ చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు.

* మీరు మిడిల్ క్లాసా?
- అవునండీ. నేను మిడిల్‌క్లాసే నండీ. అయితే ఏం ప‌నీపాటా లేకుండా ఏమీ లేను. అంద‌రి లైఫ్లో ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర ప‌నిలేని ఒక ఫేస్ కూడా ఉంటుంది క‌దా. అలా నా జీవితంలోనూ ఉంది అంతే.

* చాలా మంచి ఇప్ప‌టికే మిడిల్ క్లాస్ సినిమాలు చేశారు. కానీ ఎవ‌రు ఆ విష‌యాన్ని ఫోక‌స్ చేసి ఎప్పుడూ చెప్పుకోలేదు. మీకెందుకు చెప్పాల‌నిపించింది?
- అంటే కొన్ని విష‌యాలను ఎన్ని సార్లు చెప్పినా బాగానే ఉంటుందండీ. మిడిల్‌క్లాస్ అనేది కూడా ఆ త‌ర‌హా విష‌య‌మే. అందుకే చేయ‌డానికి ముందుకొచ్చాను.

* ఇది మీ రెండో సినిమానా?
- అవునండీ. ఇది రెండో సినిమా. తొలి సినిమాకు, ఈ చిత్రానికి కాస్త గ్యాప్ వ‌చ్చింది. మ‌ధ్య‌లో రెండు సినిమాలు మెటీరియ‌లైజ్ అవుతాయ‌నుకున్న త‌రుణంలో చెయిజారి పోయాయి. అలా గ్యాప్ వ‌చ్చింది. వాటికి ప్ర‌తి ప్రాజెక్ట్ కి ఒక‌టిన్న‌రేళ్ల దాకా స‌మ‌యాన్ని ఖ‌ర్చుపెట్టాను. అందువ‌ల్ల మూడేళ్లు వృథా అయ్యాయి.

* ఈ సినిమాకు డైలాగులు కూడా మీరేనా?
- లేదండీ. డైలాగ్ రైట‌ర్స్ ఉన్నారు.

* లాజిక్కులు మిస్ అయ్యార‌ని ఎవ‌రైనా అన్నారా?
- అలాంటిదేమీ లేదండీ. రిలీజ్ అయ్యాక కూడా చాలా మంది మెచ్చ‌కున్నారు. సుకుమార్‌గారు మొద‌ట ఫోన్ చేశారు. కొర‌టాల శివ‌గారు మెసేజ్ చేశారు. ఆ త‌ర్వాత నిర్మాత‌లు కొంద‌రు ఫోన్లు చేశారు.

* క‌థ అనుకున్న‌ప్పుడే నానిపి అనుకున్నారా?
- అవునండీ. ఆయ‌నే అనుకున్నాం. కాక‌పోతే అప్ప‌టికే నానికి రెండు మూడు ప్రాజెక్టులు సిద్ధ‌మై ఉన్నాయి. దాంతో నేను ఇంకా వెయిట్ చేయాలేమో అని అనుకున్నా. ఆ ఆలోచ‌న‌ల‌తోనే కొంత‌కాలం హెసిటేట్ చేశా. కానీ ఈ టైటిల్‌కి ఆయ‌నే ప‌ర్ఫెక్ట్ అనిపించి, వెంట‌నే క్యాస్ట్ చేశా.

* ఒక సినిమా మీద కొంత‌కాలం టైమ్ పెట్టిన త‌ర్వాత ప్రాజెక్ట్ ఓకే కాన‌ప్పుడు మీకు ఎలాంటి ఆలోచ‌న‌లు వ‌చ్చాయి?
- రెండు, మూడు రోజులు పూర్తిగా డిప్ర‌ష‌న్‌లోకి వెళ్లాను. అయినా మ‌న‌కు మ‌న‌మే దాన్నుంచి బ‌య‌ట‌ప‌డాలి. అలా బ‌య‌ట‌ప‌డ్డాను. దానికి తోడు మంచి సినిమా చూసిన ప్ర‌తిసారీ నేను స్ఫూర్తి పొందేవాడిని. ఎందుకంటే మాది మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ. క‌రెంట్ బిల్లు క‌ట్టాలి. పాల బిల్లులు క‌ట్టాలి... ఇలాంటివి చాలా ఉంటాయి. అవ‌న్నీ కూడా న‌న్ను న‌డిపించాయి. అన్నిటికి మించి నా ఫ్యామిలీ నాకు బాగా స‌పోర్ట్ చేసింది.

* దిల్‌రాజుగారి ద‌గ్గ‌ర ఎన్నో స్క్రిప్ట్ లు ప‌నిచేశారు. మీ క‌ళ్ల ముందే మిగిలిన వాళ్ల‌కి స‌క్సెస్‌లు వ‌స్తుంటే మీకు ఎలా అనిపించేది?
- అలాంటిదేమీ లేదు. నాకేమీ అనిపించ‌లేదు. ఎందుకంటే అవ‌త‌లివాళ్ల ప్రాజెక్ట్ లు చూసి నేనెప్పుడూ ఈర్ష్య ప‌డ‌లేదు.

interview gallery* వేణు శ్రీరామ్‌గా ఉన్న మీరు.. శ్రీరామ్ వేణుగా ఎందుక‌య్యారు?
- ఒక‌రోజు నేను దిల్‌రాజుగారి ఆఫీసులో రూమ్లో ఉన్నాను. ఆ స‌మ‌యంలో ఒక‌త‌ను నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి న‌న్ను పిలిచి మీ ఇంటిపేరు ఏంటి? అని అడిగారు. `శ్రీరామ్` అన్నాను. మ‌రి ఆ పేరును వెనుక ఎందుకు పెట్టావు అని అడిగారు. అంత పెద్ద వ్య‌క్తికి నా పేరు గురించి అడ‌గాల్సిన అవ‌స‌రం లేదు. అందుకే నేను శ్రీరామ్ అనే ఇంటిపేరు ముందుపెట్టుకుని వేణుని త‌ర్వాత పెట్టాను. అంత‌కుమించి న్యూమ‌రాల‌జీవంటివి ఏమీ లేవు.

* ఈ సినిమా మీ రియ‌ల్ లైఫ్ స్ఫూర్తి అన్నారే?
- అవునండీ. నేనూ, మా బ్ర‌ద‌ర్ క్లోజ్‌గా ఉండేవాళ్లం. నాకు పెళ్ల‌యిన త‌ర్వాత మా బ్ర‌ద‌ర్ కొంచెం ఫీల‌య్యాడు. అది నాకు క్యూట్‌గా అనిపించింది. ఆ స్ఫూర్తితోనే ఈ క‌థ రాసుకున్నాను.

* ముర‌ళ‌మోహ‌న్‌గారిది ఓ సినిమా ఇదే కాన్సెప్ట్ తో వ‌చ్చిన‌ట్టుంది?
- నాకు తెలియ‌దండీ. నేను చూడ‌లేదు.

* ఈ మ‌ధ్య కాలంలో మ‌రిన్ని క‌థ‌లు రాసుకున్నారా?
- చాలా రాశానండీ. ఉన్నాయి. ఇంకా ఏమీ ఫైన‌ల్‌గా అనుకోలేదు.

* ర‌వితేజ‌గారితో మ‌ర‌లా సినిమా ఉంటుందా?
- త‌ప్ప‌కుండా ఉంటుందండీ. పాత స్క్రిప్ట్ కాదు.. కొత్త స్క్రిప్ట్ చెప్తాను. ఆయ‌న‌కు న‌చ్చితే చేస్తాను.

*వ‌రంగ‌ల్ ని బ్యాక్‌డ్రాప్‌గా ఎందుకు తీసుకున్నారు?
- టౌన్ బేస్డ్ సినిమా. వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో `వ‌ర్షం` వ‌చ్చింది కానీ, వంద శాతం అక్క‌డే తీయ‌లేదు. కాక‌పోతే మా సినిమాలో అక్క‌డ గ‌ల్లీల‌తో స‌హా చూపించాం. మాది క‌రీంన‌గ‌ర్ అండీ.

*భూమిక ఒప్పుకుంటార‌ని అనుకున్నారా?
- లేదండీ. అప్ప‌టిదాకా ఆమె వ‌దిన పాత్ర‌లు చేయ‌లేదుగా. అందుకే అనుమానం మాక్కూడా ఉండేది. కానీ ఆమె క‌థ విని ఒక రోజు స‌మ‌యం తీసుకుని అంగీక‌రించారు.

* దిల్‌రాజుకి ఆరో హిట్ రావాల‌నే మెంట‌ల్ టెన్ష‌న్ మీకు ఎలా ఉండేది?
- చాలా ఉండేదండీ. ఎందుకంటే నేను ఒక్క‌డిని హిట్ కొట్ట‌క‌పోతే రాజుగారి ట్రాక్ పాడ‌యిపోతుంద‌నే బాధ ఉండేది. అందుకే మ‌రింత జాగ్ర‌త్త‌గా ప‌నిచేశా.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved