pizza

Sriwass interview about Dictator success
బాల‌య్య ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని చేశా - శ్రీవాస్

You are at idlebrain.com > news today >
Follow Us

21 January 2016
Hyderaba
d

ల‌క్ష్యం, పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌, లౌక్యం, తాజాగా డిక్టేట‌ర్ చిత్రాల ద‌ర్శ‌కుడు శ్రీవాస్‌. ఆయ‌న తెర‌కెక్కించిన డిక్టేట‌ర్ ఇటీవ‌ల సంక్రాంతికి విడుద‌లైంది. ఈ సినిమాలో బాల‌కృష్ణ ప‌క్క‌న అంజ‌లి, సోనాల్, అక్ష న‌టించారు. ఈరోస్‌తో క‌లిసి వేదాశ్వ క్రియేష‌న్స్ నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా గురించి శ్రీవాస్ గురువారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* సినిమాకు స్పంద‌న ఎలా ఉంది?
- రెస్పాన్స్ చాలా బావుంది. ఎక్స్ ట్రార్డిన‌రీగా ఉంది. మేం చాలా హ్యాపీగా ఉన్నాం. సంక్రాంతికి ప‌ర్ఫెక్ట్ సినిమా వ‌చ్చింద‌ని అంతా హ్యాపీగా ఉన్నారు.

* సినిమా క‌లెక్ష‌న్ల‌లో హెచ్చుత‌గ్గులున్నాయ‌ని..
- అదేంలేదండీ. ఈ సినిమా సోలో రిలీజ్‌కాదు. చాలా సినిమాల మ‌ధ్య విడుద‌లైంది. అందువ‌ల్ల మిగిలిన సినిమాల‌తో రెవెన్యూ షేర్ చేసుకోవాల్సి వ‌చ్చింది. అయినా మొద‌టివారానికే మేం పెట్టిందంతా వ‌చ్చేసింది. ఇప్పుడు ఓవ‌ర్‌ఫ్లోలు మొద‌ల‌య్యాయి.

* నైజామ్‌ల‌లో క‌లెక్ష‌న్లు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని..
- నైజామ్‌లోనూ, మ‌ల్టీప్లెక్స్ ల‌లోనూ బాల‌య్య‌బాబుగారికి ఇత‌ర చోట్ల‌తో పోలిస్తే కాస్త త‌క్కువ‌గానే ఉంటుంది.

* ఈ క‌థ‌ను ఎవ‌రి కోసం చేశారు?
- లౌక్యం త‌ర్వాత నేను బాల‌య్య‌బాబుగారిని క‌లిశాను. అప్ప‌టికి మేం క‌థ కూడా ఏమీ అనుకోలేదు. కేవ‌లం న‌న్ను న‌మ్మి సినిమా చేద్దామ‌ని అన్నారు ఆయ‌న‌. అందుకే ఆయ‌న్ని దృష్టిలో పెట్టుకునే సినిమా చేశాను.

* ఈ క‌థ‌ను చూస్తే బాల‌య్య ఇంత‌కుముందు చేసిన‌ట్టే అనిపిస్తుంది క‌దా?
- 98 సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడిని 99వ సినిమాలో కొత్త‌గా చూపించాలంటే ఎలా ఉంటుంది? అందుకే నేను ప్ర‌యోగాలు చేయ‌ద‌ల‌చుకోలేదు. ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చిన విష‌యాల‌ని ఇంకాస్త కొత్త‌గా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాం. బాల‌య్య‌బాబు ఫ్యాన్స్ ఎక్క‌డా డిజ‌ప్పాయింట్ కాకూడ‌దు. అలాంటి కొత్త‌పాయింట్‌కోసం చూశా. ఈ సినిమాలో అది కుదిరింది. మా సినిమాను కొన్న బ‌య్య‌ర్లు హ్యాపీగా ఉన్నారు.

* ఈరోస్‌తో ఎలా ట‌య్య‌ప్ అయ్యారు?
- ఈ సినిమా నిర్మాణం గురించి నిర్మాత కోసం అనుకుంటున్న‌ప్పుడు నా స్నేహితుడు న‌ర‌సింహారావుగారు ఈరోస్‌వారితో ఈ క‌థ‌ను చెప్పారు. వాళ్ల‌కు క‌థ న‌చ్చారు. కాక‌పోతే ఇక్క‌డ వాళ్ల‌కు చూసుకునేవారు ఒక‌రు కావాల‌ని అనుకున్నారు. అప్పుడే నేను వేదాశ్వ క్రియేష‌న్స్ గురించి ఆలోచించా. వాళ్లు నా మీద న‌మ్మ‌కంతో నా అకౌంట్స్ కే డ‌బ్బును ట్రాన్స్ ఫ‌ర్ చేశారు. ఇప్పుడు వాళ్లు సో హ్యాపీ.

* అటు నిర్మాణం, ఇటు ద‌ర్శ‌క‌త్వం క‌ష్టం కాలేదా?
- ప్ర‌తిదీ ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ఉన్న‌ప్పుడు ఇక క‌ష్టం ఎందుకు అనిపిస్తుందండీ. దానికి తోడు నేను ప్ర‌తి విష‌యాన్ని బాల‌య్య‌తో ముందే స్ప‌ష్టంగా చెప్పేసేవాడిని. అలాంట‌ప్పుడు ఇక క‌ష్టం ఎందుకు?

* బాల‌య్య‌తో చేయ‌డం క‌ష్ట‌మ‌నిపించిందా?
- లేదండీ. ఆయ‌న ద‌గ్గ‌ర నీతిగా, నిజాయ‌తీగా ఎవ‌రైనా ఉంటే చాలా ఆనందంగా ఉంటారు. ఎవ‌రైనా డ‌బుల్ గేమ్ ఆడితే ఆయ‌న‌కు న‌చ్చ‌దు. ఆయ‌న‌తో దాదాపు 95 రోజులు ప‌నిచేశాను. కానీ ఎక్క‌డా ఒక్క రోజు కూడా ఆయ‌న మ‌మ్మ‌ల్ని అర‌వ‌లేదు. కోపగించుకోలేదు. పైపెచ్చు మా యూనిట్ మెంబ‌ర్స్ కి డ‌బ్బులు కూడా పంచారు. సంతోషంగా ఫోటోలు తీయించుకున్నారు. అంత స‌ర‌దాగా ఉన్నారాయ‌న‌.

* మీకు ఏం ఇచ్చారు?
- ఆయ‌న‌తో అంత సేపు క‌లిసి ఉండ‌ట‌మే నాకు గిఫ్ట్. సంక్రాంతి రోజు సాయంత్రం నాకు చంద్ర‌బాబునాయుడుగారు ఫోన్ చేసి మా ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉండేలా మంచి హిట్ ఇచ్చావు. థాంక్స్. త్వ‌ర‌లో క‌లుద్దాం అని అన్నారు. బాల‌య్య‌గారు ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి ప‌రిచ‌యం చేసేట‌ప్పుడు మ‌న శ్రీవాస్ అని ప‌రిచ‌యం చేశారు. అదంతా గిఫ్టే.

* బాల‌య్య‌గారితో 100వ సినిమా చేస్తారా?
- అది అంత తేలిక కాదండీ. 100వ సినిమా అంటే చాలా ఎక్స్ పెక్టేష‌న్స్ ఉంటాయి. వాటిని త‌ట్టుకోవ‌డం తేలిక కాదు. మ‌రో 10-15 రోజుల్లో బాల‌య్య‌గారు 100వ సినిమా గురించి ప్ర‌క‌టిస్తార‌నుకుంటా.

* మోక్ష‌జ్ఞ‌ను మీరు ఇంట్ర‌డ్యూస్ చేస్తారా?
- మంచి క‌థ కుదిరితే, అప్ప‌టికి ఎవ‌రుబాగా చెబితే వారు చేస్తారండీ. కానీ బాల‌య్య‌తో గానీ, మోక్షుతో గానీ చేయాల‌ని మాకూ ఉంటుంది.

* లౌక్యంలో పృథ్విని చూపించిన మీరు ఈ సినిమాలో అంత కామెడీని పండించ‌లేక‌పోయారా?
- ఈ సినిమాలో ప్ర‌తిదీ చాలా జాగ్ర‌త్త‌గా డిజైన్ చేశాం. బాల‌కృష్ణ‌లాంటి ఆర్టిస్టు చేత కామెడీ చేయిస్తే ఫ్యాన్స్ ఒప్పుకోరు. అదే గోపీచంద్‌లాంటి హీరోను కామెడీలోకి లాగేయ‌వ‌చ్చు. కానీ బాల‌కృష్ణ‌ను లాగ‌లేం. అదే పెద్ద తేడా.

* ఇందులో బాల‌య్య కాస్టూమ్స్ విష‌యంలో స్పెష‌ల్ జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ట‌?
- అవునండీ. ఫ‌స్టాఫ్ మొత్తం డీసెంట్ లుక్‌ని మెయింటెయిన్ చేశాం. సెకండాఫ్‌లో ఇంగ్లిష్ క‌ల‌ర్స్ వాడాం. రెగ్యుల‌ర్ క‌ల‌ర్లు వాడ‌లేదు

* వేదాశ్వ‌లో ఇత‌ర ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తారా?
- చేస్తానండీ. మంచి క‌థ‌లు దొరికితే ఈరోస్‌తో క‌లిసి సినిమాలు చేస్తాం.

* డిక్టేటర్‌ను హిందీలో చేస్తార‌ని..
- అజ‌య్ దేవ్‌గ‌ణ్ ఈరోస్‌తో క‌లిసి ఓ సినిమాను చేయాలి. డిక్టేట‌ర్ అజ‌య్ ఇమేజ్‌కి స‌రిపోతుంద‌ని వారి ఫీలింగ్‌. డిక్టేట‌ర్‌ను హిందీలో చేయ‌మంటే చేయ‌డానికి నేను సిద్ధ‌మే.

* డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు 15 శాతం ఎందుకు రాయితీ ఇచ్చిన‌ట్టు?
- ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు మంచి రేట్లు ఇచ్చి తీసుకున్నారు. అయితే రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డేకొద్దీ ఎక్కువ సినిమాలు రావ‌డంతో థియేట‌ర్లు దొర‌క్క‌, దొరికినా అడ్వాన్సులు ఇవ్వ‌క కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. దాంతో ఆ విష‌యాన్ని నేను ఈరోస్‌వాళ్ళ‌తో చెప్పి 15 శాతం డిస్కౌంట్‌ను ఇప్పించా. ఇప్పుడు ఓవ‌ర్‌ఫ్లోలు మొద‌ల‌య్యాయి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved