pizza
SS Rajamouli interview (Telugu) about Baahubali 2
కథకుడిగా, దర్శకుడిగా నాకు అమిత సంతృప్తినిచ్చిన చిత్రం 'బాహుబలి' - ఎస్‌.ఎస్‌.రాజమౌళి
You are at idlebrain.com > news today >
Follow Us

26 April 2017
Hyderabad

ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ ప్రధాన తారాగణంగా కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విజువల్‌ వండర్‌ బాహుబలి రెండో భాగం 'బాహుబలి 2'. ఈ సినిమా ఏప్రిల్‌ 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఇంటర్వ్యూ...

ఇప్పుడే టెన్షన్‌...
- సినిమా వర్క్‌ ఉన్నంత వరకు ఎగ్జయిట్‌మెంట్‌గా ఉంటుంది. వర్క్‌ పూర్తి కాగానే టెన్షన్‌ మొదలవుతుంది. ఇప్పుడిప్పుడే వర్క్‌ పూర్తి అవుతుంది కాబట్టే టెన్షన్‌ మొదలవుతూ ఉంది.

అన్నీ బలమైన క్యారెక్టర్స్‌....
- బాహుబలి సినిమాలో గ్రాండియర్‌, రిచ్‌నెస్‌, ఫైట్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌ అన్నీ చాలా ఉన్నాయి. క్యారెక్టరైజేషన్స్‌ అన్నీ బలమైనవి. సినిమా చూస్తున్నంత సేపు సినిమాను ఎంజాయ్‌ చేయవచ్చు. సినిమా చూసేసిన తర్వాత ఇంటికెళ్ళినా సినిమాలో క్యారెక్టర్స్‌ మనకు గుర్తుకు వస్తే అది గొప్ప సినిమా అవుతుంది. నాన్నగారు అంత గొప్ప క్యారెక్టర్స్‌ను క్రియేట్‌ చేశారు. క్యారెక్టర్స్‌ క్రెడిట్‌లో సింహభాగం నాన్నగారికే దక్కుతుంది.

సీక్వెల్‌ కాదు....
- 'బాహుబలి -2' సీక్వెల్‌ కాదు. ఒకే కథను రెండు భాగాలుగా తీశాం. కథను ఎంత ఉద్వేగంగా, ఆసక్తికరంగా చెప్పగలం, ప్రేక్షకులను ఎంత బాగా కూర్చోపెట్టగలం అనేది స్క్రీన్‌ప్లే డిసైడ్‌ చేస్తుంది.

ముందు అనుకోలేదు...
- సినిమా స్టార్ట్‌ చేసేటప్పుడు ఐదేళ్ళ సమయం పడుతుందనుకోలేదు. అంత సమయం పడుతుందనుకుని ఉంటే అసలు స్టార్ట్‌ చేసేవాళ్ళం కాదు. ఇక దిగిన తర్వాత వెనక్కి వెళ్ళడం కంటే ముందుకు వెళ్ళాలనే వెళ్లాం. మంచి నిర్మాతలు, నటీనటులు, టెక్నిషియన్స్‌ అందరూ ఒక కుటుంబంలా కలిసిపోయి పనిచేశాం కాబట్టే పెద్ద బరువుగా కూడా అనిపించలేదు. చివరి సీన్‌ అయిపోగానే హమ్మయ్య అయిపోయిందనిపించింది కానీ..వర్క్‌ అంతా అయిపోతున్నప్పుడు బాధగా ఉంది. ఇంకాస్తా వర్క్‌ ఉంటే బావుండేదే..అందరం కలిసి చేసేవాళ్లం కదా అనిపిస్తుంది.

ఆ ప్రశ్నకు ఇంత రెస్పాన్స్‌ వస్తుందనుకోలేదు...
- బాహుబలి సినిమాయే కాదు..ఏ సినిమా అయినా ముందు క్యారెక్టరైజేషన్స్‌ను వివరించిన తర్వాతే కథలోకి వెళదాం..అంతే తప్ప కావాలనే కొన్నింటిని హైలైట్‌గా ఉంచుదామని అనుకోలేదు. మొదటిపార్ట్‌కు మంచి ఎండింగ్‌ కావాలని అనుకున్నాం. కాళకేయులతో యుద్ధం ముగిసింది. శివగామి బాహుబలిని రాజుగా ప్రకటిస్తుంది. ప్రజలందరూ బాహుబలికి జేజేలు కొడుతారు. అంతటితో ఫస్ట్‌ పార్ట్‌ ముగుస్తుంది. అయితే అక్కడొక ట్విస్ట్‌ ఉంటే బావుంటుందనిపించింది. అందుకే కట్టప్ప బాహుబలిని చంపే సీన్‌తో ఎండ్‌ చేశాం. ఆడియెన్స్‌కు అదొక జలక్‌ అవుతుందని అనుకున్నాం కానీ ఇన్నిరోజులు కంటిన్యూ అవుతుందని అనుకోలేదు.

- సినిమా మొదలు పెట్టక ముందు పార్ట్‌1కు, పార్ట్‌ 2కు మధ్య 20 నెలలు గ్యాప్‌ వస్తుందని అనుకోలేదు. సినిమాను రెండు భాగాలుగా పూర్తి చేసి నాలుగు నెలల గ్యాప్‌లో విడుదల చేద్దామని అనుకున్నాం. ఫస్ట్‌ పార్ట్‌ సినిమా పూర్తయ్యే సరికి డబ్బులంతా అయిపోయాయి. చివరకు రెండో పార్ట్‌ను పూర్తి చేశాం. అందుకే అంత గ్యాప్‌ వచ్చింది.

అదంతా ఆయన ప్లాన్‌లో భాగమే..
- సీజీ వర్క్‌కు ఎప్పుడైనా ఆలస్యం అవుతుంది..అయితే సెకండ్‌పార్ట్‌ వచ్చేసరికి శోభుగారు సీజీ వర్క్‌ ఉన్న పార్ట్‌ అంతా ముందుగానే పూర్తి చేయించేశారు. నవంబర్‌, డిసెంబర్‌ నుండి మొన్నటి వరకు సీజీ వర్క్‌లేని సీన్స్‌నే షూట్‌ చేశాం. సీజీ వర్క్‌ స్టూడియోస్‌ 5 నెలల సమయం ఇచ్చి ఓ యజ్ఞంలా వర్క్‌ను పూర్తి చేశాం. సీజీ వర్క్‌ ముందుగానే పూర్తి కావడం అనేది శోభుగారి ప్లాన్‌లో భాగమే.

చాలా శాటిస్పాక్షన్‌ కలిగింది..
- ఒక కథకుడుగా బాహుబలి చాలా సంతప్తి ఇచ్చిన సినిమా. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నింటిలో కొన్ని క్యారెక్టర్స్‌ ఉంటాయి. హీరో సైడ్‌ కథ రన్‌ అవుతుంటుంది. కానీ బాహుబలిలో ఆరేడు ముఖ్యమైన క్యారెక్టర్స్‌ అన్నీ బలమైనవే. నాకు నచ్చిన హీరోయిజమ్‌ను పీక్స్‌లో చూపించే అవకాశం కలిగింది. కథకుడుగా అమిత సంతృప్తినిచ్చింది. అయితే ఏ దర్శకుడైనా ఓ కథను మైండ్‌లోఅనుకున్న విధంగా హండ్రెడ్‌ పర్సెంట్‌ డెలివర్‌ చేయలేడు. మైండ్‌కు హద్దులేదు. కానీ ఫిజికల్‌గా సినిమా విషయానికి వస్తే ఓ ఫ్రేమ్‌ వర్క్‌లో చేయాలి. ఇంతకు ముందు చెప్పినట్లు ఓ కథకుడుగా, డైరెక్టర్‌గా నేను ఏదైతే అనుకున్నానో దాన్ని మాగ్జిమమ్‌ తెరపై చూపెట్టే అవకాశం బాహుబలితో కలిగింది. కథకుడిగా, దర్శకుడిగా నాకు అమిత సంతృప్తినిచ్చిన చిత్రం బాహుబ‌లి.

భారీ రెస్పాన్స్‌...
- సినిమా ప్రారంభానికి ముందు మేం హై రేంజ్‌లో ఉండాలనే ఉద్దేశంతోనే భారీ బడ్జెట్‌తో సినిమా చేశాం. అయితే ఎక్కడో భాష తెలియని చోట కూడా మాతో ఫోటోలు దిగాలనుకునే ప్రేక్షకులు ఉంటారు, సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఇంత పెద్ద గుర్తింపు వస్తుందని అనుకోలేదు.

interview gallery

ప్రశ్నలు నావి..సమాధానాలు ఇద్దరివీ..
- నాన్నగారికున్న ప్రధాన బలం క్యారెక్టర్స్‌ వాటి పేర్లు, అవి ఎలా బిహేవ్‌ చేస్తాయనే వివరాలను కంప్లీట్‌గా నాకు ఇచేస్తారు. నేను రెండు క్యారెక్టర్స్‌ మధ్య స్నేహం బంధం ఉంటే, తగాదా ఉంటే ఎలా ఉంటుందనే ఇన్‌పుట్స్‌ నేను ఇస్తాను. ఇస్తే అనే ప్రశ్నలు నావైతే, సమాధానాలు ఇద్దరం కలిసి రాబట్టుకుంటాం.

గర్వంగా అనిపించింది...
- బయట దేశాలకు వెళితే, తెలుగు, తమిళ ఇండస్ట్రీల గురించి పెద్దగా తెలియదు. ఒకవేళ తెలిసినా బాలీవుడ్‌ షారూఖ్‌ఖాన్‌ అని అంటారు..అలాంటి స్టేజ్‌ నుండి ఇండియన్‌ సినిమా అంటే బాహుబలి అనే స్టేజ్‌కు తీసుకురాగలిగాం. అది నాకెంతో గర్వంగా అనిపించింది.

వారే అండగా నిలబడ్డారు..
-ఈ సినిమాకు ముందు నైతిక బలానిచ్చింది నిర్మాతలే..నేను అనుకున్నది, చెప్పింది చేసే స్వభావి అని ముందు నా నిర్మాతలు నన్ను నమ్మారు. వాళ్లు రిస్క్‌ చేశారు. వారే ముందు నా బలం. తర్వాత నా ఫ్యామిలీ. 24 గంటలు ఈ సినిమా కోసం వర్క్‌ చేశారు. నేను ఒక కల కంటున్నాను. కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అంటూ నన్ను కాపాడుకుంటూ వచ్చారు. మూడో సపోర్ట్‌ ప్రభాస్‌..నీది ఈ లెవల్‌ కాదురా అని కాంటెస్ట్‌ ఫీడింగ్‌ ఇస్తే మనకు ఎంతో బలం కలుగుతుంది. ప్రభాస్‌ టాప్‌ పోజిషన్‌లో ఉండి అంత బలాన్నిచ్చాడు. ఇలా అందరూ నాకు నైతిక బలాన్నిస్తూ అండగా నిలబడ్డారు.

అంత నైపుణ్యం, శక్తి నాకు ఇప్పుడు లేదు..
- పెద్ద డైరెక్టర్‌ కావాలనుకునే లక్ష్యం ఎప్పుడో నేరవేరింది. మహాభారతం చేయాలనే మరో కోరిక మిగిలిపోయింది. అయితే మరో పదేళ్ళ వరకు మహాభారతాన్ని సినిమాగా చేసే నైపుణ్యం, శక్తి నాకు లేదని అనుకుంటున్నాను.

తదుపరి చిత్రం..
- ఏం చేయాలనేది ఇంకా ఆలోచించుకోలేదు. హాలీడే ట్రిప్‌ వెళ్లి వచ్చిన తర్వాత ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved