pizza
S S Thaman interview about Sarrainodu
ఐటెంసాంగ్స్‌కు మ్యూజిక్ చేయ‌డ‌మే క‌ష్టం - ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌
You are at idlebrain.com > news today >
Follow Us

16 April 2016
Hyderaba
d

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా అల్లు రామలింగయ్య సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన `స‌రైనోడు`. రకుల్ ప్రీత్ సింగ్, క్యాథిరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించాడు. ఏప్రిల్ 22న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌తో ఇంట‌ర్వ్యూ....

బ‌న్ని ఆ విష‌యంలో ....
సాంగ్ ప‌ట్ల బ‌న్ని చాల కేర్ తీసుకుంటారు. సాంగ్‌కు సంబంధించిన డ్యాన్సుల విష‌యంలో, లిరిక్స్ విష‌యంలో చాలా కేర్ తీసుకుని మంచి సాంగ్స్ వ‌చ్చేలా చూసుకుంటారు. బ‌న్ని సాంగ్ అన‌గానే మంచి మ్యూజిక్ ఉండేలా చూసుకోవాలి. సాధార‌ణంగా మ్యూజిక్ కంపోజ‌ర్ హీరోకు పెద్ద ఫ్యాన్ కావాలి. అప్పుడే మంచి ట్యూన్స్ ఇవ్వ‌గ‌లం. ఈ విష‌యం రేసుగుర్రం సినిమాకు ప్రూవ్ అయ్యింది. అలాగే ఈ సినిమాకు కూడా మంచి ట్యూన్స్ కుదిరాయి. బ‌న్నిని అంద‌రూ స్టైలిష్ స్టార్ అంటారు కాబ‌ట్టి క్లాస్‌తో పాటు మాస్ ఉండేలా ట్యూన్స్ విష‌యంలో కేర్ తీసుకున్నాం. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ కోసం లుథియానాలోని పంజాబీ సాంగ్ కు సంబంధించిన డోలును ఉప‌యోగించాం. డ్యాన్స్ స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రూర‌ల్ డ్ర‌మ్స్‌ను ఉప‌యోగించాం.

ఐటెంసాంగ్సే క‌ష్టం....
ల‌వ్ సాంగ్స్‌ను కొత్త‌గా చేయ‌వ‌చ్చు. హ‌ద్దులు లేవు. కానీ ఐటెమ్‌సాంగ్స్ విష‌యంలో చాలా క‌ష్ట‌ప‌డాలి. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు మ్యూజిక్ చేయ‌డం క‌ష్టం. ఇంట్లో సాంగ్స్‌, పార్టీలో సాంగ్స్ అయినా ఐటెం సాంగ్స్‌, మాస్ సాంగ్స్‌ను ప్లే చేస్తారు. ఒక ట్యూన్‌ను నేను డైరెక్ట‌ర్‌, లిరిక్ రైట‌ర్‌కు పంప‌గానే వారికి న‌చ్చితే లిరిక్స్ రాస్తారు. త‌ర్వాత ఆ సాంగ్ సిచ్చువేష‌న్‌కు, హీరో క్యారెక్ట‌ర్‌కు దగ్గ‌ర‌గా ఉందా అని చూసుకుంటాం. మిస్ క‌మ్యూనికేష‌న్ ఉండ‌దు. ఐటెంసాంగ్‌కు మెయిన్‌గా ఓ పదం కావాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ చెప్పాలంటే టాప్ లేచిపోద్ది, రింగ రింగా, బ్లాక్ బ‌స్ట‌ర్ ...ఇలాంటి ప‌దాల‌న్న‌మాట‌. అందుకే లిరిక్ రైట‌ర్ ప‌క్క‌నుంటే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు ఐటెం సాంగ్ చేయ‌డం సుల‌భం.

మోనాట‌నీకి కార‌ణ‌మ‌దే....
ఒకే టైంలో ఎక్కువ సినిమాలు విడుద‌ల కావ‌డం ఉదాహ‌ర‌ణ‌కు అగ‌డు, ప‌వ‌ర్, ర‌భ‌స‌ ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ‌డంతో ట్యూన్స్ రిపీట్ అయిన‌ట్టు ఉంటుంది. మోనాట‌నీగా అనిపిస్తుంది. నాకే కాదు ఏ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు అయినా ఇదే ప‌రిస్థితి. ఒక్కొక్క సిగ్నేచ‌ర్ ఉంటుంది. అలాంట‌ప్పుడు ఇలాంటి సిచ్చువేష‌న్ క‌న‌ప‌డుతుంది.

S S Thaman interview gallery

అంద‌రూ ఒప్పుకోవాలి.....
నేను బ‌న్ని, మ‌హేష్, ర‌వితేజ‌గారికి చాలా పాట‌లు పాడాను. అయితే మ్యూజిక్ డైరెక్ట‌ర్ టోన్ స‌రిపోవాలి, హీరో, డైరెక్ట‌ర్ ఒప్పుకుంటేనే పాడుతారు త‌ప్ప మ్యూజిక్ డైరెక్ట‌రే పాడాల‌ని అనుకోరు.

బాయ్స్‌2 ప్లానింగ్‌లో ఉంది....
యాక్ట్ చేయ‌మ‌ని చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ చేయ‌డం లేదు. అయితే అన్నీ కుదిరితే బాయ్స్ 2 సినిమాలో యాక్ట్ చేయ‌బోతున్నాను. అట్లీ అసోసియేట్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఉంటుంది. రెండు నెల‌ల్లో సినిమా స్టార్ట్ కావ‌చ్చు. స్క్రిప్ట్ బావుంది.

ముందు భ‌య‌ప‌డ్డాను...త‌ర్వాత ఎంజాయ్ చేశాను...
భ‌ద్ర స‌మ‌యంలో నేను కీబోర్డ్ ప్రోగ్రామ‌ర్‌గా వ‌ర్క్ చేశాను. అప్పుడు బోయ‌పాటిగారితో ప‌రిచ‌యం ఉంది. మంచి మాస్ డైరెక్ట‌ర్‌. ఆయ‌నతో బ‌న్ని హీరోగా స‌రైనోడు అన‌గానే స్టార్టింగ్‌లో బోయపాటిగారికి స‌రిపోయేలా ట్యూన్స్ ఇవ్వ‌గ‌ల‌మా అని ఆలోచించాను. అయితే సినిమా స్టార్ట్ అయిన వారం రోజుల్లో మంచి మిత్రులైపోయాం. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం ఎంజాయ్ చేశాను. అన్నీ సాంగ్స్‌కు ట్యూన్స్ కంపోజ్ చేసిన త‌ర్వాతే లిరిక్స్ రాయించాం.

క్రికెట్ ఆల్ రౌండ‌ర్‌....
నేను క్రికెట్ బాగా ఆడుతాను. ఎంత బిజీగా ఉన్నా ఆడ‌టాకి వెళ‌తాను. అంద‌రూ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ క‌లిసి ఓ టీంగా ఏర్ప‌డి క్రికెట్ ఆడుతున్నాం. ఉన్నిక‌ష్ణ‌గారు మా టీం కెప్టెన్‌. విజ‌య్ ఏసుదాసు, ఎస్‌.పి.బి.చ‌ర‌ణ్‌, విజ‌య్ ఏసుదాసు ఇలా అంద‌రం ఉన్నాం. జూన్‌లో దోహ‌లో కేర‌ళ మ్యూజిషీయ‌న్ టీంతో మ్యాచ్ ఆడ‌బోతున్నాం. నేను ఆల్ రౌండ‌ర్‌.

ల‌వ్ స‌బ్జెక్ట్‌కు ట్యూన్స్ చేయాలి....
నా లైఫ్‌లో బొమ్మ‌రిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి టైటిల్స్ లేవు. అలాంటి సినిమాలు ఉంటే పంపండి అని బ‌న్నిని కూడా అడిగాను. కానీ నా కెరీర్‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కే ఎక్కువ మ్యూజిక్ అందించాను. అయితే వీలున్నచోట్ల మెలోడి సాంగ్ చేస్తుంటాను.

ఆల్బ‌మ్‌ ప్లానింగ్‌...
ఒక ఆల్బ‌మ్‌ను రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాను. ఈ ఆగ‌స్ట్ 15కు ఓ సింగిల్‌ను రిలీజ్ చేస్తాను. మూడేసి నెల‌ల‌కు ఓసాంగ్ చొప్పున రిలీజ్ చేస్తూ నెక్ట్స్ ఏప్రిల్‌కు పూర్తి ఆల్బ‌మ్‌ను రిలీజ్ చేస్తాం.

నెక్ట్స్ ప్రాజెక్ట్‌..
సాయిధ‌ర‌మ్ తేజ్‌, గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రానున్న సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved