pizza
Sudha Kongara interview (Telugu) about Guru
వెంక‌టేష్‌గారు ఒప్పుకోకుంటే `గురు` సినిమా తెలుగులో రీమేక్ అయ్యేది కాదు - సుధ కొంగ‌ర‌
You are at idlebrain.com > news today >
Follow Us

30 March 2017
Hyderabad

వెంక‌టేష్, రితిక సింగ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా వై నాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుధా కొంగ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.శ‌శికాంత్ నిర్మించిన చిత్రం `గురు`. ఈ సినిమా మార్చి 31న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కురాలు సుధ కొంగ‌ర‌తో ఇంట‌ర్వ్యూ...

నేప‌థ్యం...
- మేం తెలుగువాళ్ళ‌మే..కానీ చెన్నైలో సెటిల్ అయ్యాం. కొంత‌కాలం వైజాగ్‌లో కూడా చ‌దువుకున్నాను. ఇప్పుడు చెన్నైలోనే ఉంటున్నాను. నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ కావాల‌నుకున్న‌ప్పుడు ముగ్గురు ద‌ర్శ‌కుల్లో ఎవ‌రి ద‌గ్గ‌రైనా చేరాల‌నుకున్నాను. అందులో మ‌ణిర‌త్నంగారు ముందు వ‌రుస‌లో ఉన్నారు. అదృష్ట‌వ‌శాతు ఆయ‌న ద‌గ్గ‌రే ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చింది.

క‌థ‌కు ఇన్‌స్పిరేష‌న్‌...
- నేను హిందూ పేప‌ర్‌లో ఓ ఆర్టిక‌ల్ చ‌దివాను. చెన్నైలోని రాయ‌పురం అనే ఏరియాలో త‌ల్లిదండ్రులు పేద‌వారైనా అమ్మాయిల‌ను బాక్సింగ్‌కు పంపుతున్నార‌ని అందులో రాశారు. ఆ వార్త చ‌దివి ఎగ్జ‌యిట్ అయ్యాం. 250 రూపాయ‌లుంటే బాక్సింగ్ చెయ్యుచ్చు. బాక్సింగ్ నేర్చుకుంటే స్పోర్ట్స కోటాలో ఉద్యోగాలు వ‌స్తాయి. మా జీవితాలు బాగుప‌డ‌తాయ‌ని ఆ ఆర్టిక‌ల్‌లో త‌ల్లిదండ్ర‌లు చెప్పి ఉన్నారు. నేను క‌థ గురించి రీసెర్చ్

చేస్తున్న‌ప్పుడు 250 మంది బాక్స‌ర్స్‌ను, కోచ్‌ల‌ను క‌లిశాను. వారితో మాట్లాడుతుంటే నాకు ఎక్స్‌ట్రార్డిన‌రీ సీన్స్ వ‌స్తున్నాయి. అలాంటి నిజ‌మైన స‌న్నివేశాల‌నే నా `గురు` సినిమాలో చూపించాను.

ఎగ్జ‌యిట్ అయ్యాను...
- ఆడ బాక్స‌ర్స్ అంటే సుమో రెస్ట‌ర్స్ అనే ఫీలింగ్ చాలా మందికి ఉండేది. ముందు నాకు కూడా అలాంటి ఫీలింగ్ ఉండేది. నేను లేడీ బాక్స‌ర్స్ పై సినిమా చేయాల‌నుకుంటున్నాన‌ని చెప్ప‌గానే వాళ్ళ‌పైన సినిమానా అని చాలా మంది నాతో అన్నారు. నేను క‌థ గురించి అన్వేష‌ణ చేస్తున్న‌ప్పుడు నాకు ఎంత క‌థ దొరికిదంటే..నేను గురు2, గురు3 చేసేంత క‌థ దొరికింది. వారి గురించి తెలుసుకుంటుంటే చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను.

వెంక‌టేష్ ఒప్పుకోకుంటే..
- క‌థ రెడీ కాగానే ముందు వెంక‌టేష్‌గారితోనే ఈ సినిమా చేయాల‌నుకున్నాను. అయితే ఆయ‌న కొన్ని కార‌ణాలతో ఈ సినిమా చేయ‌లేక‌పోయారు. త‌ర్వాతే నేను ఈ సినిమాను హిందీ, త‌మిళంలో తెర‌కెక్కించాను. సినిమా విడుద‌ల‌కు ఒక‌టిన్న‌ర నెల‌ల ముందు ఈ సినిమాను వెంక‌టేష్‌గారికి చూపించాల‌నుకున్నాం. రానా ద్వారా వెంక‌టేష్‌గారితో మాట్లాడాం. ఆయ‌న సినిమా చూడాలన్నారు. మేం సినిమా చూపించాం. ఆయ‌న‌కు సినిమా చూడ‌గానే న‌చ్చింది. ఆయ‌న రీమేక్ చేయ‌డానికి ఒప్పుకున్నారు. వెంక‌టేష్‌గారు సినిమా రీమేక్‌కు ఒప్పుకోకుంటే సినిమా అనువాదమై ఉండేది.

అదే ఛాలెంజింగ్‌గా అనిపించింది...
- మాధ‌వ‌న్‌కు త‌మిళంలో ల‌వ‌ర్‌బోయ్‌, చాక్లెట్ బోయ్ అనే ఇమేజ్ ఉంది. దాన్ని బ్రేక్ చేసి ఒక కోచ్‌లాగా చూపించడం ఒక ఛాలెంజింగ్‌గా అనిపించింది. అలాగే తెలుగులో వెంక‌టేష్‌గారు సాఫ్ట్ స‌బ్జెక్ట్స్ చేస్తున్నారు. ఆయ‌న్ను ఓ ర‌ఫ్‌ కోచ్‌గా చూపించాల‌నుకోవ‌డం కూడా ఛాలెంజింగ్‌గానే అనిపించింది.

టైటిల్ గురించి...
- హిందీలో సాలా ఖ‌ద్దూస్ అనే టైటిల్ పెట్టాం. త‌మిళంవిష‌యానికి ఇరుదు సుట్రు అనే టైటిల్ పెట్టాం. అంటే ఫైన‌ల్ రౌండ్ అని అర్థం. కానీ అది త‌మిళ టైటిల్ నెగ‌టివ్‌గా ఉంద‌ని వద్ద‌న్ని అన్నారు. కానీ హీరో, నిర్మాత నాకెంతో స‌పోర్ట్ చేయ‌డంతో అదే టైటిల్‌తోనే సినిమాను త‌మిళంలో విడుద‌ల చేశాం. తెలుగులో గురు అనే టైటిల్ యాప్ట్‌గా అనిపించింది.

సీక్వెల్ చేయ‌డానికి ఆస‌క్తిగానే ఉన్నా...
-నేను స్పోర్ట్స్ సినిమాల‌కు పెద్ద అభిమానిని. అండ‌ర్ డాగ్‌గా ఉండి ఓ విన్న‌ర్‌గా ఎద‌గ‌డం అనే పాయింట్ నాకు బాగా న‌చ్చింది. నాకే కాదు, అంద‌రికీ న‌చ్చే పాయింట్ అది. భవిష్య‌త్‌లో ప‌ది స్పోర్ట్స్ సినిమాల‌ను చేస్తాను. అందులో గురు2 కూడా ఉండ‌వ‌చ్చు.

త‌దుప‌రి చిత్రం...
- ఇంకా ఏదీ అనుకోలేదు. మ‌రో వారంలో ఫైన‌ల్ అవుతుంద‌నుకుంటున్నాను. తెలుగు, త‌మిళంలో మంచి పేరున్న స్టార్ హీరోతో సినిమా చేస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved