pizza
Sudheer Babu interview about Bhale Manchi Roju
ఈ సంస్థ‌లోనే వ‌రుస‌గా చేస్తుంటా - సుధీర్ బాబు
You are at idlebrain.com > news today >
Follow Us

24 December 2015
Hyderabad

సుధీర్‌బాబు హీరోగా 70ఎంఎం ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై తెర‌కెక్కిన సినిమా `భ‌లే మంచి రోజు`. శుక్ర‌వారం విడుద‌ల కానుందీ చిత్రం. శ్రీరామ్ ఆదిత్య అనే ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో ప‌రిచయం కానున్నారు. ఈ సినిమా గురించి సుధీర్‌బాబు హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- బాయ్ నెక్స్డ్ డోర్ కైండ్ మూవీ చేశాను. ఈ సినిమా చాలా బావుంటుంది. ఎవ‌రూ ఊహించని విధంగా ఉంటుంది. ఒక రోజు ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు ఇంటి నుంచి వెళ్లిన వ్య‌క్తి ఆ త‌ర్వాత ఎలాంటి విష‌యాల‌ను ఎదుర్కున్నాడు? వాటి ప‌ర్య‌వ‌సానం ఏంటి వంటి అంశాల‌తో థ్రిల్లింగ్‌గా, గ్రిప్పింగ్‌గా సాగుతుంది.

* సినిమాకు హైలైట్స్ ఏంటి?
- ప్ర‌తి సీనూ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ప్ర‌తి రెండు, మూడు నిమిషాల‌కు ఒక‌సారి చాలా ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు రివీల్ అవుతుంటాయి. లొకేష‌న్లు కూడా చాలా కొత్త‌గా ఉంటాయి. వ‌చ్చిన లొకేష‌న్ల‌న్నీ మ‌ర‌లా రిపీట్ అవుతాయి. చాలా బావుండే స‌బ్జెక్ట్ ఇది. ఈ సినిమాకు హీరో, హీరోయిన్‌, విల‌న్ అక్క‌ర్లేదు. క‌థే హీరో. అందుకే పాట‌లు కూడా సినిమాలో భాగంగానే సాగుతాయి త‌ప్ప, రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లాగా ఉండ‌దు.

* ఒక్క హిట్టు ప‌డితే సుధీర్ మంచి స్టార‌వుతాడ‌ని మ‌హేష్ ఆడియో వేడుక‌లో అన్నారు?
- అత‌నికి నా మీద ఉన్న న‌మ్మ‌కానికి రూపం ఆ మాట‌లు. ఒక్క హిట్టుతో ఎవ‌రూ స్టార్లు కారండీ. క‌నీసం మూడు, నాలుగు హిట్లు ప‌డాల్సిందే. అప్పుడే అది సాధ్య‌మ‌వుతుంది.

* ఈ సినిమాను మీ స్నేహితులే నిర్మించారు క‌దా? ఏమైనా ప్రెజ‌ర్ ఫీల‌య్యారా?
- చాలా ప్రెజ‌ర్ ఫీలైన మాట నిజం. ఎందుకంటే వాళ్లేమో న‌న్ను ఎస్టాబ్లిష్ చేయ‌డం కోసం ఖ‌ర్చుకు వెన‌కాడ‌టం లేదు. కానీ ఎంత వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే విష‌యం నాకు తెలుసు. అందుకే కాస్త ఆలోచించి పెట్ట‌మ‌ని స‌ల‌హాలు ఇచ్చేవాడిని. శ‌శి, విజ‌య్‌, నేనూ ఒకే రూమ్మేట్స్. హాస్ట‌ల్ మేట్స్. ఇప్పుడు శ‌శి విదేశాల్లో ఉంటున్నాడు. విజ‌య్ ఇక్క‌డ ఉండి ఈ వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటున్నాడు. ఇక‌పై ఈ బ్యాన‌ర్‌లో వ‌రుస‌గా సినిమాలు చేస్తూనే ఉంటా. నేను వేరే సినిమాలు చేస్తే వీళ్ళు ఒప్పుకోరు. వేరే వాళ్ళ‌తో వాళ్ళు చేస్తే నేను ఒప్పుకోను.

* కొత్త‌వాళ్ళ‌కు ద‌ర్శ‌క‌త్వ అవ‌కాశం ఇచ్చిన‌ప్పుడు ఎలా ఉంటుంది?
- ఒక ర‌కంగా చెప్పాలంటే రిస్కే. కానీ వాళ్లు నిజంగా త‌మ‌ని తాము ప్రూవ్ చేసుకుని రేపు ప‌రిశ్ర‌మ‌లో నిల‌బ‌డితే ఆ సంతృప్తి చాలా గొప్ప‌గా ఉంటుంది. శ్రీరామ్ ఆదిత్య పేరు త‌ప్ప‌కుండా భ‌విష్య‌త్తులోనూ వినిపిస్తుంది. త‌ను వండ‌ర్ కిడ్‌. నిండా పాతికేళ్ళు కూడా లేవు. అలాంటిది అత‌ను చెప్పిన స‌బ్జెక్ట్ లో ఉన్న స‌స్పెన్స్ ల‌ను ఎవ‌రూ క‌నుక్కోలేక‌పోయాం. త‌ను తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి వండ‌ర్ అయ్యా.

* మీ హిందీ సినిమా గురించి చెప్పండి?
- టైగ‌ర్ ష్రాఫ్ సినిమాలో విల‌న్‌గా చేస్తున్నా. ఆ సినిమా కోసం బ్యాంకాక్‌లో చాలా ట్ర‌యినింగ్ తీసుకున్నా. క‌ళ‌రిప‌ట్టు అనే మార్ష‌ల్ ఆర్టు కూడా నేర్చుకున్నా.

* అక్క‌డికీ, ఇక్క‌డికీ ప‌నితీరులో తేడా ఉంటుందా?
- ఉంటుందండీ. అక్క‌డ ఎక్కువ బ‌డ్జెట్ పెడ‌తారు. ఇక్క‌డ రోజుకు మ‌నం రెండు, మూడు ల‌క్ష‌లు పెట్టేది, అక్క‌డ వారు ప‌ది, 15ల‌క్ష‌ల దాకా పెడ‌తారు. సో ఆ తేడా ఉంటుంది. అందుకే వాళ్ళు ముంద‌స్తుగా ట్ర‌య‌నింగ్ ఇస్తారు.

* ప్ర‌భాస్‌, మ‌హేష్ సినిమాలు చూశారా?
- మ‌హేష్ ఇంకా చూడ‌లేదు. ప్ర‌భాస్ దాదాపుగా చూసిన‌ట్టే. త‌న‌కి మేమే చూపించాం.

* ప్ర‌భాస్ కి మీరే చూపించారా?
- సినిమాల్లోకి రాక‌ముందు నుంచే ప్ర‌భాస్‌తో ప‌రిచ‌యం ఉంది. యువీ క్రియేష‌న్స్ వంశీ, నేను, విజ‌య్ మేమందరం క‌లిసి సినిమాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్లం. మేమంతా ఎప్ప‌టి నుంచో మంచి ఫ్రెండ్స్ అండీ.

 



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved