ఏ మాయ చేసావే చిత్రంలో చిన్న క్యారెక్టర్ లో కనపడిన సుధీర్ బాబు తర్వాత ఎస్.ఎం.ఎస్, ప్రేమకథా చిత్రమ్, దొంగాట, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, భలే మంచి రోజు చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఇప్పుడు బాలీవుడ్ లోకి బాగి చిత్రంతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. సుధీర్ బాబు నటనకు మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం పాత్రికేయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సుధీర్ బాబు మాట్లాడారు...
విలన్ గానే ఎంట్రీ ఇచ్చాను... నేను తెలుగు సినిమాలోకి ఏ మాయ చేసావే చిత్రంలో నెగటివ్ రోల్ తోనే ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బాగి చిత్రంతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాను. సినిమా బావుందని అంటున్నారు. మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. నా బాలీవుడ్ ఎంట్రీపై నెగటివ్ కామెంట్స్ వినిపించాయి కానీ సినిమా ట్రైలర్ తర్వాత బావుందని అంటున్నారు. బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఫోన్ చేసి సినిమా బావుందని మెచ్చుకోవడం ఆనందంగా ఉంది.
నో చెప్పాలనుకున్నాను.... ఎస్.ఎం.ఎస్ చిత్రంలో చేసిన కొన్ని స్టంట్స్ ను యూ ట్యూబ్ లో పోస్ట్ చేశాను. అవి నచ్చడంతో బాగి కోసం నన్ను ఆడిషన్ కు రమ్మన్నారు. ముందు ఏదో చిన్న పాత్ర అయివుంటుందనుకుని నో చెప్పాలనుకున్నాను. అయితే కథ వినగానే బాగా నచ్చింది.
Sudheer Babu interview gallery
తుది నిర్ణయం నాదే... నేను చుట్టూ ఉన్న వారి సలహాలు తీసుకుంటాను కానీ తుది నిర్ణయం నాదే.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్... తెలుగులో శ్రీరాంరెడ్డి(భలే మంచిరోజు కో డైరెక్టర్) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. ఈ సినిమా మే నెలాఖరున సినిమా షూటింగ్ స్టార్టవుతుంది. పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను తెలుగు, హిందీ ల్లో చేయాలనుకుంటున్నాం. నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడంతో ఆ పాత్ర కోసం పెద్ద కష్టపడనక్కర్లేదు. ఈ సినిమాను పెద్ద పెద్ద బ్యానర్స్ నిర్మించడానికి ముందుకు వస్తున్నాయి.