మంచి కథలను ఎంపిక చేసుకుంటూ, తనకంటూ ప్రత్యేకంగా ఓ దారిని ఏర్పాటు చేసుకుంటున్నారు సుధీర్‌బాబు. తాజాగా ఆయన నటించిన చిత్రం `సమ్మోహనం`. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రమిది. ఈ సినిమా గురించి సుధీర్‌బాబు మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు..
*`సమ్మోహనం` ఎలా మొదలైంది?
- ఇంద్రగంటిగారు ఒకరోజు ఫోన్ చేసి ఒక స్క్రిప్ట్ ఉంది. వినండి అన్నారు. విన్నాను. నా తొలి సినిమా `ఎస్ ఎం ఎస్` విడుదలకు ఓ వారం ముందు ఇంద్రగంటిగారితో ఓ సినిమా చేద్దామనుకున్నా. ఓ ప్రొడక్షన్ హౌస్‌తో సైన్ కూడా అయింది. కానీ టేకాఫ్ కాలేదు. ఆ సినిమాకు అవసరాల శ్రీనివాస్ సబ్జెక్ట్ ఇచ్చేట్టు, ఇంద్రగంటిగారు డైరక్ట్ చేసేట్టు అనుకున్నారు. ఆ సినిమానే తర్వాత `ఊహలు గుసగుసలాడే` పేరుతో తీశారు. కాకపోతే నాకు చెప్పినప్పుడు కాస్త వేరుగా ఉండేది.
* ఈ సినిమా ఎలా ఉంటుంది?
- నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. చాలెంజింగ్‌గా అనిపించింది. లవ్ స్టోరీస్ నేను కొన్ని చేసినా సరే .. ఇది రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుంది. సినిమాటిక్‌గా ఉండదు. సినిమా చుట్టూ తిరుగుతూ సినిమాటిక్‌గా ఉండదు. రెగ్యులర్ జీవితానికి దగ్గరగా ఉంటుంది.
* మీ పాత్ర ఎలా ఉంటుంది?
- నేను చిల్డ్రన్ బుక్స్ ఇల్లస్ట్రేటర్‌గా కనిపిస్తాను. ఇందులో నా పేరు విజయ్. ఐడలిస్టిక్ పర్సన్‌ని. సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా స్టార్స్ మీద కొన్ని అభిప్రాయాలుంటాయి. అదితీరావు ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా నటించింది. మేకప్‌తో, మేకప్ లేకుండా స్టార్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుంటాను నేను. మేమిద్దరం ఎలా కనెక్ట్ అయ్యామనేదే ఈ సినిమా.
* కామన్ ఆడియన్స్ డౌట్స్ ని క్లియర్ చేసేటట్టు ఉంటాయా?
- క్లియర్ చేయడం కాదు. ఓ కామన్ ఆడియన్‌కి ఉన్నడౌట్స్ ని ఆన్‌స్క్రీన్ మీద డిస్కస్ చేస్తున్నట్టు ఉంటుంది.
* ఎవరెవరు గెస్ట్ రోల్స్ చేశారు?
- హరీశ్ శంకర్, అవసరాల శ్రీనివాస్, తరుణ్‌భాస్కర్‌గారు గెస్ట్ రోల్స్ చేశారు. హీరోలు ఎవరూ ఇందులో గెస్ట్ రోల్స్ చేయలేదు.
* ఇంద్రగంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంది?
- ఆయన ఇప్పటిదాకా ఇలాంటి ఇంటెన్స్ లవ్ స్టోరీ చేయలేదు. `అంతకు ముందు ఆ తర్వాత` ఉన్నా.. అది వేరు. ఇది ఆయన తెరకెక్కించిన ప్రాపర్ లవ్ స్టోరీ. ఈ టైప్ ఆఫ్‌గా డీల్ చేసిన సినిమాలు ఇంతకు ముందు రాలేదు. `ఏమాయ చేసావె` కూడా వేరు. ఈ సినిమాలో ఫన్ ఉంటుంది. మంచి రొమాన్స్ కూడా ఉంటుంది.
* యాక్షన్ ఇమేజ్ ఏంటి?
- యాక్షన్ ఇమేజ్ ఆల్రెడీ ఉంది. కేవలం బాడీ పెట్టుకుని సినిమా చేసినా కుదరదు. ఇందులో ఇల్లుస్ట్రేటర్ గన్నులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. పెన్నులు పట్టుకుంటే చాలు.
* మీ కెరీర్‌లో ఈ మధ్య రియాల్టీకి దగ్గరగా వెళ్తున్నట్టున్నారు?
- అలాగని కాన్షియస్‌గా ఏమీ అనుకోలేదండీ. నాకు వచ్చిన స్క్రిప్ట్ లలో ఇవి నచ్చినవి అందుకని వీటిని చేశానంతే.
* నటుడిగా మిమ్మల్ని మీరు ప్రూప్ చేసుకున్నట్టు భావిస్తున్నారా?
- మెజర్‌మెంట్స్ లాంటివి ఏవీ లేవు కదా. జస్ట్ చేసేశాం. ప్రూవ్ చేసేసుకున్నాం అని అనుకోవడానికి. ప్రేక్షకులు చెప్పాలంతే. ప్రతిసినిమాతోనూ మనస్ఫూర్తిగా ప్రయాణం చేస్తున్నా. నేను నటించిన తర్వాత ఆ సన్నివేశాలను చూసుకుంటే ఇంతకన్నా బెస్ట్ గా చేయగలమా అని అనిపిస్తుంది.
* ఇందులో చాలెంజింగ్గా అనిపించిన సీన్‌లు ఏమున్నాయి?
- టెర్రస్ మీద ఒక సీన్ ఉంటుంది. కన్నీళ్లు రాకుండా ఏడుస్తున్నట్టు తెలియాలంటే ఎలా చెప్తాం? అలాంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి.
* మీ రియల్ లైఫ్‌కీ, ఈ కథకీ ఏమైనా పోలికలున్నాయా?
- అలాంటిదేమీ లేదండీ. నేను యాక్టర్‌ని కాకముందు ఏమైనా పోలికలున్నాయేమో. నేను చేసే ప్రతి రోల్‌లోనూ నా ఎక్స్ పీరియన్స్ ను గుర్తు చేసుకుని చేయాలనుకుంటా. అలా ఏమైనా ఒకటీ, రెండు కలిసి ఉండవచ్చు.
* ఈ సినిమా సెట్స్ కి మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేవారట?
- అవునండీ. చాలా ప్లెజెంట్ సిట్చువేషన్ ఉండేది సీన్‌లో. ఎందుకంటే ఇంద్రగంటిగారి సినిమాల్లో యాక్టరే కింగ్. యాక్టర్ కూర్చోవచ్చు. నిలుచోవచ్చు. ఏదైనా చేయొచ్చు. యాక్టర్ మంచి మూడ్‌లో ఉంటే దాన్ని గమనించి ఇంద్రగంటిగారు సినిమా చేస్తారు. అంతేగానీ కెమెరాను సెట్ చేసుకుని `యాక్టర్‌ని పిలవండయ్యా` అని అనే మనిషి కాదు ఆయన. భాష గురించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
* మీ గొంతు ఇప్పుడు మరింత మెచ్యూర్ గా అయినట్టుంది?
- వాయిస్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నానండీ. ఒకవేళ ఇప్పుడు మానేసినా మళ్లీ పీలగా కనిపిస్తుంది.
* ఈ మధ్య ప్రొడక్షన్ హౌస్‌ని మొదలుపెట్టారు?
- అవునండీ. మన చుట్టూ చాలా మంది ప్రతిభావంతులున్నారు. కొరియోగ్రాఫర్లు, పాటలు రాసేవాళ్లు, నటీనటులు... ఎంతో టాలెంట్ ఉండి కూడా ఇక్కడ తిరగలేక వెళ్లిపోయిన వాళ్లున్నారు. నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే బావుంటుందనిపించి చేశా. చాలా మంది వచ్చి కలుస్తూనే ఉన్నారు.
interview gallery
* పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఎంత వరకు వచ్చింది?
- సెప్టెంబర్ నుంచి ఉంటుంది. చాలా చాలెంజింగ్ స్క్రిప్ట్. ప్రవీణ్ సత్తార్‌గారి దర్శకత్వంలో చేస్తున్నా. బయోపిక్ అనగానే బాడీ లాంగ్వేజ్ పట్టేసి చేసేస్తారు. అలా కాకుండా ఆ వ్యక్తి మనసును కూడా పట్టుకోగలగాలి. నేను కూడా గోపీచంద్ బాడీ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటున్నా. కొన్నాళ్లు అతనితో ఉండి ఆయన ఎలాంటి వ్యక్తి అనేది తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ సినిమా కోసం ప్రాక్టీస్ కూడా చేస్తున్నా.
* అదితీరావుతో నటించడం ఎలా అనిపించింది?
- చాలా కన్వీనియంట్‌గా చేశాం. తను కూడా ఇంతకు ముందు సినిమాలు చేసుంది. నేను చేసి ఉన్నాను. మేమిద్దరం సన్నివేశాలను గురించి మాట్లాడుకునేవాళ్లం. మేమిద్దరం సెట్స్ కి రావడానికి ముందే ప్రిపేర్ అయి వచ్చేవాళ్లం. బాలీవుడ్ నుంచి ఎవరైనా వస్తే షూట్‌లో ప్రొనౌన్స్ కూడా సరిగా చేయలేరు. కానీ అదితీ చాలా స్పష్టంగా నేర్చుకుని వచ్చేసేది. తను తొలి సినిమాకే డబ్బింగ్ కూడా చెప్పింది. స్కిల్స్ వైజ్ తను బెస్ట్ కో స్టార్.
* ప్రొడ్యూసర్ గురించి చెప్పండి?
- శివలెంక కృష్ణప్రసాద్‌గారు చూడ్డానికి తెల్లగా ఉంటారు. అంతే స్వచ్ఛంగానూ ఉంటారు. భవిష్యత్తులోనూ ఆయనతో సినిమా చేయాలని ఉంది. ఇంద్రగంటిగారు స్క్రిప్ట్ చెప్పగానే నాకు 70ఎంఎం వాళ్లు గుర్తొచ్చారు. ఆ మాటే ఇంద్రగంటిగారితో చెప్తే, శివలెంకగారి గురించి చాలా బాగా చెప్పారు. ఆయన చెప్పినట్టే ప్రొడక్షన్ వైజ్, ప్రమోషన్ వైజ్ చాలా బాగా చేస్తున్నారు శివలెంకగారు.
* మీ నెక్స్ట్ మూవీస్ ఏంటి?
- నా సంస్థలోనే ఓ సినిమా ఉంది. అది లవ్‌స్టోరీ. 70 పర్సెంట్ సిద్ధమైంది. ఆర్.ఎస్.నాయుడు అని కొత్తతను దర్శకత్వం చేస్తాడు.
* మీ ప్రొడక్షన్‌లో మహేశ్‌తో సినిమా చేసే అవకాశం ఉందా?
- ఉందండీ. తప్పకుండా చేస్తాం. మంచి కథ ఉంటే ఇంద్రగంటిగారి దర్శకత్వంలో మహేశ్ హీరోగా మా బ్యానర్‌లో సినిమా చేస్తే చాలా బావుంటుంది.