pizza
Sukumar interview (Telugu) about Darshakudu
`ద‌ర్శ‌కుడు` నా క‌థ కాదు - సుకుమార్‌
You are at idlebrain.com > news today >
Follow Us

1 August 2017
Hyderabad

సుకుమార్‌ రైటింగ్స్‌, బి.టి.ఆర్‌.ఎన్‌. క్రియేషన్స్‌, ప్లేబ్యాక్‌ పిక్చర్స్‌ పతాకాలపై ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ సమర్పణలో అశోక్‌, ఈషా జంటగా జక్కా హరిప్రసాద్‌ దర్శకత్వంలో బి.ఎన్‌.సి.ఎస్‌.పి. విజయకుమార్‌, థామస్‌రెడ్డి అదూరి, రవిచంద్ర సట్టి నిర్మిస్తున్న డిఫరెంట్‌ లవ్‌స్టోరీ 'దర్శకుడు'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర సమర్పకుడు సుకుమార్‌తో జరిపిన ఇంటర్వ్యూ..

'దర్శకుడు' ఫైనల్‌ ఔట్‌పుట్‌ చూశారా? x
- చూశాను. చాలా బాగుంది. ఇది నేను ఓ ప్రొడ్యూసర్‌గా చెప్పడం లేదు. ప్రేక్షకుడిగా చెప్తున్నాను. కొన్నిసార్లు సినిమా చూస్తున్నప్పుడే తెలిసిపోతుంది.

ఇది సుకుమార్‌ స్టైల్‌లో వుంటుందా? అశోక్‌ కూడా మీలాగే చేశాడంటున్నారు?
- ఇది నా తరహా కథ కాదు. అందుకే నాకు బాగా నచ్చిందేమో. అశోక్‌కి బాగా తెలిసిన డైరెక్టర్‌ని నేనే కాబట్టి నా బాడీ లాంగ్వేజ్‌ అలా వచ్చేసిందేమో. ఇందులో అతను చేసింది డైరెక్టర్‌ క్యారెక్టర్‌. చాలా కాలంగా నా పక్కనే వున్నాడు కాబట్టి నా బిహేవియర్‌ కాస్త వచ్చి వుంటుంది.

ఈ సినిమాలో మొదట అశోక్‌ని మీరు వద్దని చెప్పారట?
- నేనంటే చిన్నప్పటి నుంచి డైరెక్టర్‌ అవ్వాలని ప్యాషన్‌తో వచ్చినవాడిని. అశోక్‌ నన్ను చూసిన ఇన్‌స్పైర్‌ అయి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేస్తానని వచ్చాడు. నేను వద్దని చెప్పాను. అయితే చిన్నప్పటి నుంచి కథలు, కవితలు రాసేవాడు. డైరెక్షన్‌ జాబ్‌ అంత ఈజీ కాదని వద్దన్నాను. దానికి వాడికి కోపం వచ్చింది. 100 పర్సెంట్‌లవ్‌ చిత్రంలో అతన్ని తీసుకునే ఛాన్స్‌ వుంది. కానీ, నేను తీసుకోలేదు. 1 నేనొక్కడినేకి మళ్ళీ వచ్చి అడిగాడు. ఈ సినిమాకి నేను ఒక కథ అనుకుంటున్నాను. దానికి నీ వెర్షన్‌ రాసివ్వమని చెప్పాను. చాలా బాగా రాశాడు. బాగా రాయగలుగుతున్నాడని డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకున్నాను.

హీరోగా అతన్నే అనుకోవడానికి కారణం?
- కథ చాలా బాగుంది. ఎవరైనా మార్కెట్‌ వున్న హీరోతో చేస్తే బాగుంటుంది అని కాదు, కొత్తవాళ్ళయితే వర్కవుట్‌ అవుతుంది. అశోక్‌ని పెట్టి తీస్తానన్నాడు. అతనితో ఎలా చేయించుకోవాలో నాకు తెలుసు అన్నాడు. వర్క్‌షాప్స్‌ పెట్టి అతనితో చేయించాడు. బాగా పెర్‌ఫార్మ్‌ చేశాడు. అప్పుడు నమ్మకం కలిగి తీసుకున్నాం.

అశోక్‌ నటనలో మీకు నచ్చింది ఏమిటి?
- సీరియస్‌ ఎమోషన్స్‌ బాగా చేశాడు. చాలా ఎక్స్‌పీరియన్స్‌ వున్న ఆర్టిస్టులా పెర్‌ఫార్మ్‌ చేశాడు. రియల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ అతని ఫేస్‌లో కనిపించాయి. కోపం అంటే నిజమైన కోపం, బాధ అంటే నిజమైన బాధ.. ఇలా అన్నీ రియల్‌గా అనిపించాయి.

interview gallery

సినిమా చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకున్న ఫీలింగ్‌ కలిగిందా?
- అలాంటిదేమీ లేదు. ఎందుకంటే ఇది నా కథ కాదు. ఒక దర్శకుడికి, ఒక కాస్ట్యూమ్‌ డిజైనర్‌కి మధ్య నడిచే ప్రేమకథ. ఒక డైరెక్టర్‌గా చెప్పాలంటే వాడికి ఎక్కువ తెలిసిన డైరెక్టర్‌ని నేనే. సెట్‌లో ఒక్కోసారి నా బిహేవియర్‌ చూసి కొన్ని సీన్స్‌లో అలా చేసి వుండొచ్చు.

అశోక్‌ హీరోగా చేశాడు. డైరెక్షన్‌ చేస్తానంటే మీరు అవకాశం ఇస్తారా?
- చేతిలో నైపుణ్యం వుంటే దానితో ఎలాగైనా బ్రతికేయొచ్చు. ఈ సినిమా హిట్‌ అవ్వడాన్ని బట్టి అశోక్‌ ఫ్యూచర్‌ వుంటుంది. ఈ సినిమా సూపర్‌హిట్‌ అయితే తనకి రెండు, మూడు ఛాన్సులు వస్తాయి. హీరోగా కంటిన్యూ అయిపోవచ్చు. అలా కాని పక్షంలో చేతిలో విద్య వుంది. డైరెక్టర్‌ అవుతాడు. అది అతని చాయిస్‌.

రంగస్థలం ఎంతవరకు వచ్చింది? 1985 అని ప్రత్యేకించి టైటిల్‌లో చెప్పడానికి కారణం ఏదైనా వుందా?
- 50 శాతం పూర్తయింది. సంక్రాంతికి రిలీజ్‌ అవుతుంది. ఇక 1985 అని స్పెసిఫిక్‌గా చెప్పడానికి రీజన్‌ ఏమిటంటే కథపరంగా ఆ సంవత్సరానికి వెళ్ళాల్సి వచ్చింది. అలా చేస్తే ఆ కథ వర్కవుట్‌ అవుతుంది. అప్పట్లో మొబైల్‌ ఫోన్స్‌ లేవు అనే లాజిక్‌ వుంది కదా.

సడన్‌గా 1985లోకి వెళ్ళి ఒక విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చెయ్యడానికి రీజన్‌?
- నేను పాతిక సంవత్సరాలకుపైగా పల్లెటూళ్ళోనే వున్నాను. అక్కడే స్కూల్‌లో చదువుకున్నాను. పల్లెటూరు నేపథ్యంలో సినిమా ఎప్పుడు తీద్దామా అని ఎదురుచూస్తున్నాను. ఇప్పటికి కుదిరింది. అయితే ఈ ఆలోచన ఎప్పటి నుంచో వుంది కాబట్టే ఆర్యలాంటి సినిమాలో సిటీ నుంచి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లోకి వెళ్ళి కొన్ని సీన్స్‌ కూడా పెట్టడం జరిగింది. అలాగే 100 పర్సెంట్‌ లవ్‌లో కూడా విలేజ్‌ సీన్స్‌ వుంటాయి.

సినిమా, సినిమాకి ఎక్కువ గ్యాప్‌ తీసుకుంటారెందుకు?
- ఎందుకంటే నా దగ్గర కథ రెడీగా వుండదు. ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో కథ రెడీ చెయ్యాలి. దానివల్ల లేట్‌ అవుతుంది. కథ రెడీగా వుంటే ఇప్పుడు ఎవరైనా హీరోకి చెప్పేసి సినిమా ఎనౌన్స్‌ చేసుకోవచ్చు. కథలన్నీ సింగిల్‌ లైన్‌లో వుంటాయి. దాని మీద కూర్చొని రాయాలి.

సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు మీ నుంచి ఎక్స్‌పెక్ట్‌ చెయ్యొచ్చా?
- చెయ్యాలంటే ఇక్కడి మార్కెట్‌ సరిపోదు. హిందీలో చెయ్యాలి. అప్పుడప్పుడు అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. చిన్న చిన్న లైన్స్‌ అనుకుంటాం. అవి వర్కవుట్‌ అవ్వాలంటే అన్నీ కుదరాలి. మనం ఒక మార్కెట్‌ చట్రంలో ఇరుక్కుపోయి వుంటాం. ఆ లిబర్టీ రావాలంటే కంటిన్యూగా సక్సెస్‌లు రావాలి.Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved