pizza
Sukumar interview (Telugu) about Rangasthalam
భ‌విష్య‌త్తులోనూ త‌ప్ప‌కుండా ప‌ల్లెటూరి చిత్రాలు తీస్తాను - సుకుమార్‌
You are at idlebrain.com > news today >
Follow Us

31 March 2018
Hyderabad

సుకుమార్ పేరు చెప్ప‌గానే `ఆర్య‌` గుర్తుకొస్తుంది. లెక్క‌లు బాగా వేస్తాడ‌నే విష‌యం గుర్తుకొస్తుంది. లాజిక్కులు మిస్ కాకుండా, ఏవో కొత్త విష‌యాలు చెప్పాల‌ని ఆయ‌న ప‌డే త‌పన గుర్తుకొస్తుంది. ఇటీవ‌ల విడుద‌లైన `రంగ‌స్థ‌లం` చూశాక ఆయ‌న ప‌ల్లెటూరిని కూడా అందంగా చూపించ‌గ‌ల‌డ‌నే విష‌యం గుర్తుకొస్తుంది. మ‌రి సినిమా స‌క్సెస్ అయిన ఈ సంద‌ర్భంలో సుకుమార్‌కి ఏం గుర్తుకొస్తోంది? సుకుమార్ మ‌న‌సులోని భావాలు ఏంటి? ఒక‌సారి చ‌దివేయండి.. సుకుమార్ ఇంట‌ర్వ్యూ..

* స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారా?
- హా హా హా.. అలాంటిదేనండీ. సినిమా మేం అనుకున్నంత పెద్ద హిట్ కావ‌డం నిజంగా ఆనందంగా ఉంది.

* స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారా?
- హా హా హా.. అలాంటిదేనండీ. సినిమా మేం అనుకున్నంత పెద్ద హిట్ కావ‌డం నిజంగా ఆనందంగా ఉంది.

* చ‌ర‌ణ్ వ‌ల్లే `రంగ‌స్థ‌లం` ఇంత దూరం వ‌చ్చింద‌ని చెబుతున్నారు?
- నిజ‌మే కదండీ. ఈ సినిమాను క‌థా రూపంలో నేను చెప్ప‌వ‌చ్చు. కానీ న‌మ్మాల్సింది త‌నే. చ‌ర‌ణ్ చాలా బాగా న‌మ్మాడు. నా మ‌న‌సులో ఉన్న‌ట్టే రామ‌కృష్ణ‌, ఆయ‌న భార్య మౌనిక క‌లిసి సెట్ వేశారు. దేవిశ్రీ ప్ర‌సాద్ వండ‌ర్ఫుల్ ఆల్బ‌మ్ ఇచ్చారు. చంద్ర‌బోస్ అంత‌క‌న్నా గొప్ప‌గా ప‌దాలు రాశారు.

* ఇంత‌కీ చిట్టిబాబు క‌థ‌ను ఎప్పుడు ఎలా అనుకున్నారు?
- ముందు చెప్పాలంటే ఈ క‌థ‌లో క్లైమాక్స్ అనుకున్నా. ఆ త‌ర్వాతే కేర‌క్ట‌ర్లు, దానికి త‌గ్గ మిగిలిన స‌రంజామా మొత్తాన్ని ఆలోచించా.

* చిట్టిబాబు పాత్ర‌కోసం బాగా వ‌ర్కవుట్ చేయాల్సి వ‌చ్చిందా?
- అంతేకదండీ. వినికిడి లోపం ఉన్న వ్య‌క్తి ఎలా ప్ర‌వ‌ర్తిస్తాడు? అత‌ను ప‌ల్లెటూర్లో ఉంటే ఆ ప్ర‌వ‌ర్త‌న ఇంకెలా ఉంటుంది? అత‌నికి ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది? ప‌ల్లెటూరి ప‌రిస్థితులేంటి? అక్క‌డ వ్య‌వ‌హారాలు ఎలా ఉంటాయి.. ఇవ‌న్నీ నాకు తెలిసిన‌వే. కానీ ఆథంటిక్‌గా సినిమా ద్వారా చెప్పేట‌ప్పుడు ఇంకాస్త జాగ్ర‌త్త‌గా చేశానంతే.

* ఈ క‌థ‌ని 20 నిమిషాల్లో రాసేశార‌ట క‌దా?
- న‌వ్వుతూ .. నిజ‌మేనండీ. ఒక‌సారి విజయేంద్ర‌ప్ర‌సాద్‌గారు నాకు ఓ క‌థ చెప్పారు. ఆ క‌థ‌ని 20 నిమిషాల్లో చెప్పేశారంతే. చాలా ఇన్‌స్ప‌యిరింగ్‌గా అనిపించింది.వెంట‌నే ఇంకేమీ మాట్లాడ‌లేదు. బ‌హుశా ఆ స్ఫూర్తితోనే చేశాన‌నుకుంటా.

* రంగ‌స్థ‌లం అనే పేరు ఎందుకు పెట్టాల‌నిపించింది?
- మ‌న చుట్టూ ఉన్న జీవితం నిజంగా రంగ‌స్థ‌ల‌మేగా. మ‌నంద‌రం త‌లా ఒక పాత్ర పోషిస్తున్నాం. క‌థ‌కి స‌రిపోతుంద‌నిపించింది. దానికి తోడు ఆ ఊరు పేరు అదే అయింది. అందుకే అదే పెట్టాం. నిజంగానే రంగ‌స్థ‌లం అనే పేరుతో ఓ ఊరు ఉంది తెలుసా.

* ముందు ప‌ల్లెటూరిలో కొంత చేశారు... ఆ త‌ర్వాత సిటీలో సెట్ వేశారు?
- నిర్మాత‌ల స‌హ‌కారం అండీ. అక్క‌డ కీ సీన్స్ చేశాం. ఇక్క‌డ స‌రిపోయే విధంగా స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించాం. నిర్మాత‌లు ఖ‌ర్చుకు ఎక్క‌డా భ‌రించ‌లేదు. ముందు నేను రామ్‌చ‌ర‌ణ్ త‌ప్ప మిగిలిన పాత్ర‌ల‌కు పెద్ద న‌టీన‌టుల‌ను ఎవ‌రినీ అనుకోలేదు. కానీ మా నిర్మాత‌లు క‌థ‌ని న‌మ్మారు. గ్రాండ్‌గా చేద్దామ‌ని చేశారు. వాళ్ల న‌మ్మ‌కం ఫ‌లించింది.

* చిరంజీవిగారు ఏమ‌న్నారు?
- చాలా మెచ్చుకున్నారు. ఆయ‌న బావుంద‌ని అంటుంటే చాలా ఆనంద‌మేసింది. రామ్‌చ‌ర‌ణ్ అయితే కౌగ‌లించుకుని కొంత సేపు వ‌ద‌ల్లేదు. ఆ కౌగిలింత‌లో ఎంత అర్థం ఉందో నాకు బాగా తెలుసు. అలాగే ప‌రిశ్ర‌మ‌లోని మ‌రికొంద‌రు ప్ర‌శంసించారు. బ‌న్ని అంత బిజీగా ఉండికూడా అభినందించాడు.

* చిరంజీవితో సినిమా చేస్తారా?
- ఇప్ప‌టికింకా ఏమీ అనుకోలేదు. ఆయ‌న ముందు కూర్చుని క‌థ చెప్పి, అదిక‌నుక ఆయ‌న‌కు న‌చ్చితే నిజంగా ఏదో సాధించిన‌ట్టే.

* వ‌రుస‌గా సినిమాలంటే ఫ్యామిలీని మిస్ కావ‌డం లేదా?
- ఎందుకు కావ‌డం లేదండీ. ముందు మా పిల్ల‌ల‌తో కాసేపు ఆడుకోవాలి. త‌ర్వాతే మ‌రుస‌టి సినిమాల గురించి ఆలోచ‌న‌లు.

* వ‌రుస‌గా సినిమాలు చేయ‌డానికి క‌థ‌లున్నాయా?
-ఇంకో 2,3, ఉన్నాయి. అయితే అవి ఎవ‌రికి స‌రిపోతాయి.. ఏంటి? అనేది ఆలోచించాలి.

* నెక్స్ట్ బ‌న్నీతో అంటున్నారే?
- ఇంకా ఏమీ అనుకోలేదండీ.

* మీ ప్రొడ‌క్ష‌న్‌లో సినిమాలు..?
- చేస్తాం.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved