pizza
Sumanth interview (Telugu) about Malli Raava
`మ‌ళ్ళీ రావా` స‌హ‌జ‌మైన ప్రేమ‌క‌థ - సుమంత్‌
You are at idlebrain.com > news today >
Follow Us

7 December 2017
Hyderabad

శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ నాయిక‌గా, గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్లీ రావా` . ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 8న విడుదలకు సిద్ధమైంది. ఈ సంద‌ర్భంగా హీరో సుమంత్ మీడియాతో మాట్లాడారు...

క‌థ గురించి...
- ఇదొక రొమాంటిక్ ల‌వ్ స్టోరీ. కార్తీక్, అంజ‌లి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌. 20 ఏళ్ల పాటు ఇద్ద‌రు ప్రేమికులు మ‌ధ్య ఎలాంటి ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎలాంటి మ‌లుపులతో వారి ప్రేమ క‌థ ఎలాంటి ద‌రి చేరింద‌నేదే సినిమా.

అదే డిఫ‌రెంట్‌...
- ఈ సినిమాను క‌థ రూపంలో చెప్పాలంటే చాలా సింపుల్‌. కానీ స్క్రీన్‌ప్లే చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. సినిమా మూడు స్టేజ‌స్‌లో సాగే ప్రేమ‌క‌థ‌. ఒక‌టి చిన్న‌ప్పుడు, మ‌రొక‌టి వ‌ర్కింగ్ ప్లేస్‌లో.మ‌రొక‌టి కాస్త మెచ్యూర్డ్ ఏజ్‌లో సాగుతుంది. ఈ మూడు స్టేజ్‌ల‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను స‌మాంతంర‌గా ఉండేలా ద‌ర్శ‌కుడు గౌత‌మ్ ప్రెజెంట్ చేశాడు. గ‌తంలో ప్రేమ‌మ్‌, నా ఆటోగ్రాఫ్ వంటి సినిమాలు వ‌చ్చినా క‌థ‌నం కొత్త‌గా ఉంటుంది.

దానికి ద‌గ్గ‌రగా...
- నేను గ‌తంలో గోదావ‌రి, మ‌ధుమాసం వంటి ప్రేమ‌క‌థా చిత్రాల్లో న‌టించినా, వాటికి భిన్నంగా సాగే చిత్రం. అయితే ఈ సినిమా గోదావ‌రికి కాస్త ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. పాట‌ల‌న్నీ క‌థ‌లో భాగంగా సాగుతుంటాయి. ఇదొక స‌హ‌జ‌మైన ప్రేమ‌క‌థ‌.

interview gallery

ద‌ర్శ‌క నిర్మాత‌ల గురించి...
-ద‌ర్శ‌కుడు గౌత‌మ్ ఈ సినిమా క‌థ‌తో నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు విన్నాను. రెండు గంట‌లు క‌థ విన‌గానే నా క‌ళ్ల‌లో నీళ్లు వ‌చ్చాయి. త‌ను ఓ ప్లానింగ్‌తో సినిమా ఎలా చేయాల‌నే ఆలోచ‌న‌తోనే న‌న్ను క‌లిశాడు. త‌ను చేయాల‌నుకున్న స‌న్నివేశాల‌ను వేరే న‌టీన‌టుల‌తో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో చేసి నాకు చూపించాడు. నాకు త‌న ప్లానింగ్ న‌చ్చ‌డంతోనే సినిమా చేస్తాన‌ని అన్నాను.అలాగే గౌత‌మ్‌కు త‌గ్గ నిర్మాతగా రాహుల్ కుదిరాడు. త‌ను మేకింగ్‌లో పాటించిన ప్లానింగ్ చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. ఓ న‌టుడిగానే నేను ఇందులో ఇన్‌వాల్వ్ అయ్యాను. ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌ణాళిక‌తో సాగ‌డం వ‌ల్ల సినిమాను 35 రోజుల్లోనే పూర్తి చేశాం. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌కు ప‌ది నెల‌ల స‌మ‌యం తీసుకున్నాం.

దాని కోస‌మే సినిమాలు చేయ‌ను..
- నేను సినిమా కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు ప‌దేహేడేళ్ల‌వుతుంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు 22 సినిమాలే చేశాను. నేను గ‌తంలో ఏదో వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయాను. కానీ ఇప్పుడు నాకు ఆ తొంద‌ర‌లేదు. చాలా స‌హ‌జ‌మైన క‌థ‌ల‌తో సినిమాలు చేయాల‌నుకుంటున్నాను.

త‌దుప‌రి చిత్రాలు..
- ఈ సినిమా త‌ర్వాత రెండు సినిమాలు చేయ‌బోతున్నాను. అందులో ఒక‌టి డార్క్ థ్రిల్ల‌ర్‌. మ‌రో సినిమా వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved