pizza
Tamanna Interview about Next Enti
అలాంటి పాత్ర‌లు చేయ‌డం నాకు ఇష్ట‌ముండ‌దు - త‌మ‌న్నా
You are at idlebrain.com > news today >
Follow Us

02 December 2018
Hyderaba
d

సందీప్ కిష‌న్‌, త‌మ‌న్నా జంట‌గా ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు కునాల్ కోహ్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `నెక్స్‌ట్ ఏంటి`. వైకింగ్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి., అక్ష‌య్ పూరి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకాల‌పై రైనా జోషి, అక్ష‌య్ పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గౌరి కృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులో డిసెంబ‌ర్ 7న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆదివారం త‌మ‌న్నా ఇంట‌ర్వ్యూ...


ఆ ఆలోచ‌న‌తో ఉన్న‌ప్పుడు...

- అర్బ‌న్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేశాను. అయితే నా ఏజ్‌కు త‌గిన‌ట్లు.. సిటీ కల్చ‌ర్‌ను ఎలివేట్ చేసేటువంటి పాత్ర‌లు చేయ‌లేద‌ని ఆలోచిస్తున్న స‌మ‌యంలో బాలీవుడ్ డైరెక్ట‌ర్ కునాల్ కొహ్లి ఈ క‌థ‌తో న‌న్ను క‌లిశారు. నాకు బాగా న‌చ్చిన క‌థ‌
క‌థా నేప‌థ్యం...

- ఇది లండ‌న్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇప్ప‌టి యూత్ ఆలోచ‌న‌ల‌ను ప్ర‌తిబింబించే చిత్రం. అలాగే నేటి త‌రం అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నార‌నేది కూడా ఈ చిత్రంలో చూపించారు ద‌ర్శ‌కుడు. వ‌స్త్రధార‌ణ, క‌నిపించే విధానాన్ని బ‌ట్టి అమ్మాయిల‌ను అంచ‌నా వేయ‌కూడ‌ద‌ని, వారి జీవితానికి సంబంధించిన నిర్ణ‌యాలు వారే తీసుకునే హ‌క్కు ఉంటుంద‌ని ఈ సినిమాలో చూపించాం. త‌న‌కు న‌చ్చిన అబ్బాయిని అమ్మాయి ఫేస్ చేసిన‌ప్పుడు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయ‌నేది ఈ సినిమాలో చూపించారు. అంత‌ర్లీనంగా మంచి ల‌వ్‌స్టోరీ ర‌న్ అవుతుంటుంది.
బోల్డ్ కంటెంట్‌...

- ప్రేమ‌, సెక్స్ అనేవి సాధార‌ణ విష‌యాలు. వాటి గురించి బోల్డ్‌గా మాట్లాడే యువ‌తిగా చేసిన పాత్ర కావ‌డంతో.. ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి మొద‌లైంది. చాలా నేచుర‌ల్‌గా, వినోద‌భ‌రితంగా సాగే చిత్రం. సీరియ‌స్‌గా ఏదో బ‌రువైన పాత్ర‌లు చేసి ప్రేక్ష‌కుల‌ను ఏడిపించడం నాకు ఇష్టం ఉండ‌దు. ఈ పాత్ర నాకొక చాలెంజింగ్‌గా అనిపించింది. అలాగే సంభాష‌ణ‌ల‌తో వ‌క్తిగ‌తంగా క‌నెక్ట్ అయ్యాను. ఆ పాత్ర‌లో నిజంగా న‌న్ను నేను ఊహించుకున్నాను.
నాకు ద‌గ్గ‌రగా ఉండే...

interview gallery




- హ్యాపీడేస్‌, 100 ప‌ర్సెంట్ ల‌వ్ చిత్రాల త‌ర్వాత నిజ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర‌లు చేయ‌డం త‌క్కువ‌గానే చేశాను. మ‌ళ్లీ అలాంటి పాత్ర‌ను ఈ సినిమాలో చేశాను. నిజ జీవితంలో ఎలా ఉంటానో అలాగే క‌న‌ప‌డ‌తాను. నా శైలి ఎమోష‌న్స్ ఇందులో క‌న‌ప‌డ‌తాయి. నాతో పాటు సందీప్ కిష‌న్‌, శ‌ర‌త్ బాబు పాత్ర‌ల చుట్టూ క‌థ తిరుగుతుంది. సాధార‌ణంగా తండ్రి, కొడుకు మ‌ధ్య అనుబంధాన్ని చూపే సినిమాలు ఎక్కువ‌గా ఉంటాయి. కానీ ఇందులో తండ్రీ, కూతురు మ‌ధ్య ఉండే రిలేష‌న్‌ను చూపిస్తున్నాం. హృద్యంగా ఉంటుంది.
గ‌ణ‌నీయ‌మైన మార్పులు..

- తెలుగు ఇండ‌స్ట్రీలో గ‌ణ‌నీయ‌మైన మార్పులు. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఇక్క‌డ సినిమాల‌ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇండ‌స్ట్రీస్ ప‌రంగా హ‌ద్దుల‌న్నీ చెరిగిపోయాయి. మంచి మంచి సినిమాలు రూపొందుతున్నాయి. ఆద‌ర‌ణ పొందుతున్నాయి. అలాంటి చిత్రాల్లో వ‌రుసలో నెక్స్‌ట్ ఏంటి నిలుస్తుంద‌ని నా న‌మ్మ‌కం.
యూనివ‌ర్స‌ల్ కాన్సెప్ట్‌తో...

- డైరెక్ట‌ర్ కునాల్ కొహ్లి యూనివ‌ర్స‌ల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. లండ‌న్ నేప‌థ్యంలో సాగే సినిమా కావ‌డంతో ఎక్కువ స్వేచ్ఛ తీసుకుఉని క‌థ‌ను రాసుకున్నారు. భాషా బేదాల‌తో సంబంధం లేకుండా అంద‌రికీ సినిమా న‌చ్చుతుంది.
త‌దుప‌రి చిత్రాలు...

- బాహుబ‌లి సినిమా చేయ‌డం వ‌ల్ల వైవిధ్య‌మైన సినిమాలు చేయ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం నాలో క‌లిగింది. అందుకే న‌టిగా ప్రాధాన్య‌త ఉండే పాత్ర‌ల‌ను ఎంచుకుంటున్నాను. `ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి` సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. `ఎఫ్‌2` చిత్రంలో న‌టిస్తున్నాను. త‌మిళంలో ఉద‌య‌నిధి స్టాలిన్‌తో సినిమా చేస్తున్నాను. అలాగే సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలో చిరంజీవిగారితో క‌లిసి న‌టించ‌బోతున్నాను. చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనాల్సి ఉంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved