pizza
Sumanth Ashwin interview (Telugu) about Happy Wedding
`హ్యాపీ వెడ్డింగ్‌` నా కెరీర్‌కి చాలా కీల‌కం - సుమంత్ అశ్విన్‌
You are at idlebrain.com > news today >
Follow Us

27 July 2018
Hyderabad

ఎం.ఎస్‌.రాజు త‌న‌యుడిగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎంట్రీ ఇచ్చిన హీరో సుమంత్ అశ్విన్‌. ఇప్ప‌టిదాకా ప‌లు సినిమాలు చేసిన ఆయ‌న శ‌నివారం `హ్యాపీ వెడ్డింగ్‌` అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నారు. ఈ సినిమా గురించి ఆయ‌న చెప్పిన విశేషాలు...

* హ్యాపీ వెడ్డింగ్ గురించి చెప్పండి?
- పెళ్లికి సంబంధించిన క‌థ‌. విజ‌య‌వాడ అబ్బాయి, హైద‌రాబాద్ అమ్మాయికి పెళ్లి కుదిరితే.. అమ్మాయి వ‌ల్ల ఏర్ప‌డే చిన్న చిన్న ఇబ్బందులేంట‌నేది సినిమా. మామూలుగా పెళ్లి అన‌గానే అమ్మాయి వైపు నుంచి చూపిస్తుంటారు. ఇందులో పెళ్లికొడుకు ఫ్యామిలీ ప‌డే టెన్ష‌న్‌ని కూడా చూపించారు. ఈ సినిమా నా కెరీర్లో చాలా కీల‌క‌మైన సినిమా. చాలా బాగా వ‌చ్చింది.

* మీ పాత్ర ఎలా ఉంటుంది?
- ఇందులో నా పాత్ర పేరు ఆనంద్‌. జింగిల్స్ రాస్తుంటాను. చ‌లాకీ కుర్రాడిగా క‌నిపిస్తాను.

* నీహారిక గురించి చెప్పండి?
- త‌ను మాత్ర‌మే చేయ‌గ‌ల సినిమా ఇది. ఆ అమ్మాయి ఈ పాత్ర‌కు వంద శాతం సూట‌యింది.

* యువీ క్రియేషన్స్ గురించి?
- నిర్మాణ విలువ‌ల‌ను తెర‌పై చూసి ఆశ్చ‌ర్య‌పోతారు. ఎక్క‌డా రాజీప‌డ‌ని ప్రొడ‌క్ష‌న్ హౌస్‌.

* ఈ చిత్రంలో మీకు మ‌రింత‌గా న‌చ్చిన అంశాలేంటి?
- క్లైమాక్స్ లో వ‌చ్చే స‌న్నివేశాలు చాలా న‌చ్చాయి. అందుకే ఈ క‌థ ఒప్ప‌కున్నాను. మామూలుగా సినిమా చేసిన త‌ర్వాత ప‌దే ప‌దే చూస్తుంటే జ‌డ్జిమెంట్ బెడిసికొడుతుంది. కానీ ఆశ్చ‌ర్యం ఈ చిత్రాన్ని ఎన్ని సార్లు చూసినా, కొత్త‌గా న‌చ్చుతోంది.

* మీతో పాటు ఇంకెవ‌రైనా సినిమా చూశారా?
- మేమే కాదు. కొత్త‌వాళ్లు కూడా సినిమా చూశారు. వాళ్ల‌కు కూడా చాలా బాగా న‌చ్చింది. చాలా పాజిటివ్‌గా స్పందించారు. క‌చ్చితంగా నాకు ఈ సినిమా బ్రేక్ ఇస్తుంద‌ని న‌మ్ముతున్నా.

interview gallery



* బేసిగ్గా ఎలాంటి సినిమాలు చేయాల‌ని అనుకుంటారు?
- నేను ల‌వ‌ర్‌బాయ్‌గా న‌టించ‌డంతో అంద‌రూ నాకు అలాంటి క‌థలే చెప్ప‌డానికి ముందుకొస్తున్నారు. అయితే నాకు భిన్న‌మైన క‌థ‌ల‌తో సినిమాలు చేయాల‌ని ఉంది. ఇంకా చెప్పాలంటే మంచి పాత్ర‌లు వ‌స్తే విల‌న్‌గానూ న‌టిస్తాను.

* మీ సినిమాల క‌థ‌లు ఎవ‌రు వింటారు? మీరా? మీ నాన్న‌గారా?
- నేను, నాన్న క‌లిసే వింటాం. నాన్న 90 శాతం మంచి జ‌డ్జిమెంట్ చెబుతారు. ఈ మ‌ధ్య నేను చేసిన ప‌లు సినిమాల‌కు ఆయ‌న మార్పులు చెప్పారు. అయితే ఆ క‌రెక్ష‌న్స్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల అవి ఆడ‌లేదు.

* ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నారు?
- హ‌రి అనే ద‌ర్శ‌కుడితో `ప్రేమ క‌థా చిత్రం2`లో న‌టిస్తున్నా. ఒక షెడ్యూల్ పూర్త‌యింది. హార‌ర్ రొమాంటిక్ చిత్ర‌మ‌ది.

* ఇంత‌కీ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?
- అంద‌రికీ పెళ్లి చాలా అవ‌స‌రం. అయితే పెళ్లి చేసుకోవాల‌న్నంత‌గా నాకు ఎవ‌రూ తార‌స‌ప‌డ‌లేదు. ల‌వ్ మేరేజ్ చేసుకున్నా మా ఇంట్లో ఏమీ అన‌రు. అయినా నాకు ఇంకా ఎవ‌రినీ చేసుకోవాల‌ని అనిపించ‌లేదు. బేసిగ్గా జ‌ర్నీని ఇష్ట‌ప‌డ‌తాను.

 

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved