pizza
Sundeep Kishan interview (Telugu) about C/o Surya
ఆ భ‌యంతోనే అక్క‌డ ఒప్పుకోవ‌డం లేదు - సందీప్ కిష‌న్‌
You are at idlebrain.com > news today >
Follow Us

10 November 2017
Hyderabad

సినిమా వెనుక సినిమా, ఒక‌దాని త‌ర్వాత ఒక‌టీ అంటూ కెరీర్‌ని మెలిమెల్లిగా ప్లాన్ చేసుకున్న హీరో సందీప్‌కిష‌న్‌. ఇప్పుడు వ‌రుస చిత్రాలతో, మంచి మంచి కాంబినేష‌న్ల‌తో ముందుకు వెళ్తున్నారు. తెలుగుతో పాటు త‌మిళంలోనూ త‌న‌కంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఆయ‌న న‌టించిన `కేరాఫ్ సూర్య‌` శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా సందీప్‌కిష‌న్ ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు..

* కేరాఫ్ అంటే ఏంటి?
- అంటే మ‌నం పుట్టిన‌ప్ప‌టి నుంచి మ‌న కేరాఫ్‌గా మ‌న కుటుంబ స‌భ్యులు ఉంటారు. ఎదిగాక మ‌నం బిల్డ్ చేసుకునే రిలేష‌న్సే మ‌న కేరాఫ్ ఎడ్ర‌స్‌. చిన్న‌త‌నంలో ఎవ‌రైనా తిట్టినా, కొట్టినా నాన్న‌కు చెప్తాం. కానీ ఆ త‌ర్వాత ఫ్రెండ్‌కి చెప్తాం. ఒరేయ్‌.. వాడు న‌న్ను కొట్టాడురా అని అంటాం. సో ఎదిగాక ఏదైనా స‌రే మ‌న‌కు ఆల్ ఇన్ ఆల్ కేరాఫ్ అడ్ర‌స్ అనేది ప్రెండ్‌. దాన్ని బేస్ చేసుకున్న సినిమానే ఇది. నేను ఎవ‌రెవ‌రికి కేరాఫ్ అడ్రాస్ కావాల్సి వ‌చ్చింది? ఆ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింది? అనేది ఆస‌క్తిక‌రం.

* సినిమా ఎలా వ‌చ్చింది?
- చాలా బాగా వ‌చ్చింది. త‌మిళంలో నిన్న ప్రీమియ‌ర్ షోలు వేశాం. చాలా మంది బావుంద‌ని మెచ్చుకుంటున్నారు. వ‌రుస‌గా పెద్ద పెద్ద ద‌ర్శ‌కుల నుంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

* మీ కేర‌క్ట‌ర్ ఏంటి?
- మిడిల్‌క్లాస్ ప‌క్కింటి అబ్బాయి త‌ర‌హా పాత్ర‌. కేట‌రింగ్ చేసే కుర్రాడి క‌థ‌. `నా పేరు శివ‌`లో కార్తిగారి పాత్ర‌కు ఎక్స్ టెన్ష‌న్‌లాగా ఉంటుంది ఈ పాత్ర‌.

* ద‌ర్శ‌కుడి గురించి చెప్పండి?
- సుశీంద్ర‌న్‌గారు చేశారు. ఆయ‌న `నా పేరు శివ‌` త‌ర్వాత చేసిన సినిమా ఇది. బేసిగ్గా ఆయ‌న మ‌నిషిగా చాలా మంచి వాడు. మిడిల్‌క్లాస్ మ‌న‌స్త‌త్వాలు తెలిసిన వ్య‌క్తి. ఏదైనా నిజాయ‌తీగా చూపించాల‌ని అనుకుంటారు. అదే ఈ సినిమాలో పోట్రెయిట్ అయింది.

* రెండు భాష‌ల్లోనూ ఒకేసారి తీశారా?
- అవునండీ. రెండు భాష‌ల్లోనూ ఒకేసారి తెర‌కెక్కించాం. ఈ సినిమా త‌మిళ్‌లో ఫ‌స్ట హాఫ్ ఒక ర‌కంగా ఉంటుంది. తెలుగులో ఇంకో ర‌కంగా ఉంటుంది. ఎక్క‌డా తెలుగుకు, త‌మిళ్‌కు తొలిస‌గంలో పోలిక‌లు ఉండ‌వు. సెకండాఫ్ మాత్రం ఒకేలా ఉంటుంది.

interview gallery

* త‌మిళ ఛాయ‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్న‌ట్టున్నాయి?
- ఛాన్సే లేదండీ. త‌మిళ ద‌ర్శ‌కుడు తీశాడ‌నే త‌ప్ప ఎక్క‌డా త‌మిళ ఛాయ‌లు క‌నిపించే అవ‌కాశ‌మే లేదు. ఆ విష‌యాన్నే ఇంత‌కు ముందు కూడా చెప్పాను.

* త‌మిళం మీదే ఎక్కువ శ్ర‌ద్ధ పెడుతున్న‌ట్టున్నారు?
- ఇక్క‌డ 16 సినిమాలు చేస్తే, అక్క‌డ మూడు సినిమాలు చేశాను. అక్క‌డ చేసిన సినిమాలు బాగా హిట్ అయ్యాయి. నాకు మంచి మార్కెట్ వ‌చ్చింది. ఆ మార్కెట్ వ‌ల్ల నా రారా కృష్ణ‌య్య డ‌బ్బింగ్ రైట్స్ ఎక్కువ వ‌చ్చాయి. త్వ‌ర‌లో రాబోయే మంజుల - కిర‌ణ్‌గారి సినిమాకు మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. పొరుగువారు ఇక్క‌డికి వ‌చ్చి మార్కెట్ చేసుకుంటున్న‌ప్పుడు, మ‌నం అక్క‌డికెళ్లి మార్కెట్ చేసుకోవ‌డంలో త‌ప్పేం ఉంది. అయినా ఎంక‌రేజ్ చేయాలిగానీ, అలా అడుగుతారు ఎందుకు? నా దృష్టిలో నానికి, శ‌ర్వానంద్‌కి కూడా అక్క‌డ మంచి హిట్‌లు ప‌డ్డాయి. కానీ ఇలాంటి మాట‌ల వ‌ల్లే వాళ్లు అక్క‌డికి వెళ్ల‌డానికి భ‌య‌ప‌డుతున్నారేమో. నేనైతే అక్క‌డ సినిమాలు అంగీక‌రించ‌డానికి చాలా భ‌య‌ప‌డుతున్నాను. నేను అక్క‌డ ఎంత చేసినా వాళ్లు న‌న్ను తెలుగువాడిగానే చూస్తారు. క‌నీసం ఇక్క‌డివాళ్ల ప్రోత్స‌హం అయినా ఉండాలి.

* మెహ‌రీన్ గురించి చెప్పండి?
- చాలా మంచి అమ్మాయి. పాజిటివ్ గా ఉంటుంది. త‌న పాజిటివ్ ఎన‌ర్జీ నాకు చాలా న‌చ్చ‌తుంది. ఇందులో చాలా మంచి పాత్ర ప్లే చేసింది.

* నెక్స్ట్ ఏం సినిమాలు ఉన్నాయి?
- మంజుల‌గారి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా పూర్త‌యింది. కునాల్ కోహ్లీ సినిమా ఇంకో ఐదు రోజులు షూటింగ్ ఉంది. డీ16 డైర‌క్ట‌ర్‌తో `న‌ర‌గాసుర‌న్‌` చేస్తున్నాను. కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమా ఉంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved