pizza
Sundeep Kishan interview (Telugu) about Shamanthakamani
`శ‌మంత‌క‌మ‌ణి`లో కారు గురించి అడ‌గ వ‌ద్దు ప్లీజ్‌..! - సందీప్ కిష‌న్‌
You are at idlebrain.com > news today >
Follow Us

12 July 2017
Hyderabad

త‌ను న‌మ్మిన దారిలో ఒక్కో అడుగూ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సందీప్‌కిష‌న్‌. తాజాగా భ‌వ్య క్రియేష‌న్స్ తెర‌కెక్కించిన మ‌ల్టీస్టార‌ర్‌లో సందీప్‌కిష‌న్ కూడా ఓ పాత్ర చేశారు. వి.ఆనంద‌ప్ర‌సాద్ నిర్మించిన ఆ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. ఇందులో తాను చేసిన కోటిప‌ల్లి శివ అనే కేర‌క్ట‌ర్ గురించి చెప్పుకొచ్చారు సందీప్‌కిష‌న్‌. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే...

* మీ పాత్ర గురించి చెప్పండి?
- ఇందులో నాది కోటిప‌ల్లి శివ పాత్ర‌. థియేట‌ర్లో ప్రొజ‌క్ష‌న్ రూమ్‌లో బ‌ట‌న్ నొక్కే పాత్ర‌. నాకో ల‌వ్ ఫెయిల్యూర్ ఉంటుంది. సినిమాలో ఉన్న ఇద్ద‌రు అమ్మాయిల‌తోనూ నాకు ప‌రిచ‌యం ఉంటుంది. ఫ‌స్ట్ నుంచి లాస్ట్ వ‌ర‌కు అంతా సంద‌డిగా ఉంటుంది

* కారుతో మీకున్న సంబంధం ఏంటి?
- ఆ విష‌యం మాత్రం అడ‌క్కండి. ద‌ర్శ‌కుడు ఏడ్చేస్తాడు. సినిమాల్లో విష‌యాలు చెప్పొద్ద‌ని అంద‌రూ బ‌తిమాలుకుంటారు. మా శ్రీరామ్ మాత్రం ఏడ్చేస్తాడు.

* ఈ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకోవ‌డానికి కార‌ణాలున్నాయా?
- శ్రీరామ్ స్క్రిప్ట్ విష‌యంలో ప‌క్కాగా ఉన్నాడు. త‌న తొలి సినిమా నాకు న‌చ్చింది. త‌న‌తో ఉంటుంటే న‌న్ను నేను చూసుకున్న‌ట్టు అనిపించింది. ఏదీ ఆలోచించ‌కుండా, చాలా ఫ్రీగా ఉంటాడు.

* మిగిలిన హీరోల‌తో జ‌ర్నీ ఎలా సాగింది?
- ఫెంటాస్టిక్‌గా సాగింది. ఆది నాకు 12 ఏళ్లుగా మంచి ఫ్రెండ్‌. సుధీర్ అంత‌కు ముందే తెలుసు. ఈ సినిమాతో క్లోజ్ అయ్యారు. మ‌రోవైపు మంజుల గారి సినిమాలో సుధీర్‌గారి పిల్ల‌లతో క‌లిసి న‌టిస్తున్నా. ఈ సినిమాతో మాత్రం రోహిత్‌తో మంచి ఫ్రెండ్‌షిప్ కుదిరింది. అంత‌కు ముందు త‌న‌తో నాకు అంత ర్యాపో లేదు. ఈ సినిమాతో మంచి ర్యాపో వ‌చ్చింది.

* నిర్మాణసంస్థ గురించి చెప్పండి?
- ఒక షూటింగ్‌లో ఏడు క్యార‌వేన్‌లుండ‌టం ఎప్పుడైనా గ‌మ‌నించారా? ఈ సినిమా షూటింగ్‌లో ఉన్నాయి. ఎవ‌రికీ ఏ చిన్న ఇబ్బంది కూడా రాకూడ‌ద‌ని చాలా ఇష్టంగా చేశారు ఆనంద‌ప్ర‌సాద్‌గారు. ఆయ‌న పెట్టిన కృషి సినిమాలో తెర‌పై త‌ప్ప‌కుండా క‌నిపిస్తుంది.

* రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో ప‌నిచేయ‌డం ఎలా ఉంది?
- అంత సీనియ‌ర్ ఆర్టిస్ అయిన‌ప్ప‌టికీ చాలా ఫ్రెండ్లీగా క‌లిసిపోయేవారు. షాట్ రెడీ అన‌గానే ఆయ‌న సీనియారిటీని ప‌క్క‌న‌పెట్టి మాతో పాటు క‌లిసిపోయి చేసేవారంతే.

Sundeep Kishan interview gallery

* ఈ మ‌ధ్య లుంగీలో క‌నిపిస్తున్నారు ఎందుకు?
- సినిమాలో ఓ బిట్‌లో లుంగీ ఉంటుంది. నాక్కూడా లుంగీ క‌ట్టుకోవ‌డం ఇష్టం. ఇంత‌కు ముందు కూడా గుండెల్లో గోదారిలో క‌ట్టుకున్నా.

* వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు.. హెక్టిక్‌గా లేదా?
- లేదండీ. ఒన్ బై ఒన్ ప్లాన్ చేసుకుంటున్నా. లుక్ ప‌రంగా ఏదీ ఒకేలా అనిపించ‌దు. న‌ట‌న ప‌రంగా అంత‌క‌న్నా ఒకేలా అస‌లు అనిపించ‌దు.

* కృష్ణ‌వంశీగారితో ప‌నిచేసిన‌ప్ప‌టి నుంచి మారానని అంటున్నారు.. నిజ‌మేనా?
- వంద‌శాతం నిజ‌మండీ. అంత‌కుముందు నాలో చిన్న చిన్న కోప‌తాపాలుండేవి. కానీ ఆ సినిమా చేశాక అవ‌న్నీ మ‌టుమాయ‌మైపోయాయి.

* తెలుగు,తమిళ్‌లో జ‌ర్నీ ఎలా ఉంది?
- చాలా బావుందండీ. నిజానికి గ‌త రెండేళ్ల‌లో నా లో టైమ్స్ లో నాకు హిట్ ఇచ్చింది మా న‌గ‌రం. తెలుగులోనూ బాగా ఆడింది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved