pizza
Sundeep Kishnan interview about Okka Ammayi Thappa
ఆ మెసేజ్ చూసి ఆయన నవ్వుకున్నారు – సందీప్ కిషన్
You are at idlebrain.com > news today >
Follow Us

9 June 2016
Hyderaba
d

సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సినిమా జూన్ 10న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ తో ఇంటర్వ్యూ..

క్యారెక్టర్...
ఇందులో నేను డ్రాపవుట్ స్టూడెంట్ అయినప్పటికీ మెంటలిస్ట్ పాత్రలో కనపడతాను. మెంటలిస్ట్ అంటే.,ఎదుటివారు బాడీ లాంగ్వేజ్ ను బట్టి ఎదుటివారు మనస్తత్వాన్ని అంచనా వేసే పాత్ర అన్నమాట. చాలా ఎనర్జిటిక్ గా కొనసాగుతుంది.

స్క్రీన్ ప్లే బేస్ డ్...
నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో ఒక్క అమ్మాయి తప్ప వంటి చిత్రాన్ని చేశానని గర్వంగా చెప్పుకునేలా ఉండే చిత్రం. హైటెక్ ఫ్లై ఓవర్ పై కలిసిన ఇద్దరు ప్రేమికులు..వారికొక సమస్య ఎదురైతే ఎలా అధిగమించారనేదే కథ. సినిమా అంతా స్క్రీన్ ప్లే బేస్ డ్ గానే సాగుతుంది. అరవై శాతం సినిమా హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై జరుగుతుంది.

విజన్ సినిమా కావడానికి మూడేళ్ళు...
రాజసింహ ఈ కథను నాకు 2012లోనే చెప్పాడు. ఇది వినగానే సూపర్బ్ గా అనిపిస్తుంది. కానీ మేకింగ్ విషయానికి వస్తే బడ్జెట్ పరంగా నిర్మాతలు చాలా మంది ఆలోచించి వద్దనుకున్నారు. ఎందుకంటే హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ జామ్ లో సినిమా చిత్రీకరణ చేయాలంటే సులభమైన విషయం కాదు. సెట్ వేసినా ప్రేక్షకుడిని నమ్మించేలా విజన్ తో చేయాల్సిన చిత్రం. ఈ విజన్ ను సినిమా రూపంలో తీసుకురావడానికి మూడేళ్ల సమయం పట్టింది.

హైట్ విషయంలో సమస్య రాలేదు...
నాది, నిత్యామీనన్ పెయిర్ బాగా కుదిరింది. హైట్ విషయంలో ఒకరినొకరు కామెంట్ చేసుకునేవాళ్ళం కానీ చిత్రీకరణ సమయంలో ఏ సమస్య రాలేదు. నిత్యామీనన్ కు కథ బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకుంది. సినిమాలో ఎక్కడా చేంజస్ చేయడానికి ఒప్పుకోలేదు. కమర్షియల్ సినిమా. డ్రైవింగ్ ఎలిమెంట్ కొత్తగా ఉంటుంది. అన్నపూర్ణ ఫ్లై ఓవర్ సెట్ లో సెట్ వేసి షూట్ చేశాం. సి.జి. వర్క్ తో ఓరిజినల్ ను క్రియేట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఆయన అది చూసి నవ్వుకున్నారు..
కృష్ణవంశీవంటి డైరెక్టర్ ను కలుసుకోవాలని, ఆయనతో ఫోటో దిగాలని అనుకుని ఆరేళ్ల ముందు ఆయనకు ఓ సారి మెసేజ్ పెట్టాను. కానీ ఇప్పుడు ఆయనతో సినిమా చేస్తున్నాను. ఈ సందర్భంలో అనుకోకుండా ఆరేళ్ల తర్వాత ఆ మెసేజ్ కనపడింది. అది ఆయనకు కూడా చూపించాను. ఆయన బాగా నవ్వుకున్నారు.

తదుపరి చిత్రాలు ..
కృష్ణవంశీగారి డైరెక్షన్ లో నక్షత్రం, తమిళంలో నేను, లావణ్య కలిసి మయవన్ సినిమాతో, పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాను. సి.వి.కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved