pizza
Sunil interview (Telugu) about Eedu Gold Ehe
విలన్ అవుదామని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను - సునీల్

You are at idlebrain.com > news today >
Follow Us

4 October 2016
Hyderaba
d

సునీల్‌ హీరోగా బిందాస్‌రగడదూసుకెళ్తా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఏ టీవీ సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్‌ ఎహే'. ఈ సినిమా అక్టోబర్‌ 7న విజయదశమి కానుకగా గ్రాండ్ర్ రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా హీరో సునీల్ తోఇంటర్వ్యూ.....

సినిమా ఎలా ఉండ‌బోతోంది...
- ఈడు గోల్డ్ ఎహే సినిమా బాగా ఆక‌లిగా ఉన్న‌వారికి మంచి పెళ్ళి భోజ‌నం దొరికిన‌ట్టు ఉంటుంది. అది సినిమా న‌టించిన ఆర్టిస్టులైనా కావ‌చ్చు.రేపు సినిమా చూసే ఆడియెన్స్ అయినా కావ‌చ్చు.

ఎవ‌రు ఎక్స్‌ పెక్ట్ చేయ‌లేరు...
నా కెరీర్‌లో నేను హీరోగా చేసిన అందాల రాముడుపూల‌రంగ‌డుభీమ‌వ‌రం భుల్లోడుజ‌క్క‌న్న ఈ సినిమాల‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు. నాకు మంచి విజ‌యాన్ని సాధించి పెట్టాయి కూడా. అయితే  సినిమా చూసే ప్రేక్ష‌కుడు సినిమాలో వ‌చ్చే స‌న్నివేశాల‌ను ముందుగానే ఉహించేస్తాడు. అయితే ఈడు గోల్డ్ ఎహే గ‌తంలో నేను యాక్ట్ చేసిన మ‌ర్యాద‌రామ‌న్న సినిమా త‌ర‌హాలో ఓ ఎగ్జ‌యిట్‌మెంట్‌తో సాగే చిత్రం.

కార‌ణం డైరెక్ట‌రే....
- ఈ సినిమా నేను చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం డైరెక్ట‌ర్ వీరుపోట్ల‌గారే. సినిమా చూస్తున్నంత సేపు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. మ‌ర్యాద రామ‌న్న సినిమాలో చివ‌రి వ‌ర‌కు ఏమౌతుంద‌నే స‌స్పెన్స్ ఉంటుందో అలాంటి స‌స్పెన్స్ ఈ సినిమాలో కూడా చివ‌ర‌కు వ‌ర‌కు కొన‌సాగుతుంది.

Glam gallery from the event

వీరుపోట్ల‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌....
 నేనుత్రివిక్ర‌మ్ ఒక రూంలో ఉండే స‌మ‌యంలో వీరుపోట్లగోపీమోహ‌న్ అంద‌రూ మంచి ఫ్రెండ్స్‌. ఆ స‌మ‌యంలో వీరుపోట్ల‌వారికి రూం కూడా నేనే చూసి పెట్టాను. అప్ప‌టి నుండి మా మ‌ధ్య ప‌రిచ‌యం ఉంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు అయిన త‌ర్వాత నాకు బ్రేక్ ఇస్తే ఇప్పుడు వీరుపోట్ల నాకు ఈడు గోల్డ్ ఎహేతో మ‌రో మంచి బ్రేక్ ఇవ్వ‌బోతున్నాడు.వీరు చాలా టాలెంటెడ్ డైరెక్ట‌ర్. ప్ర‌తి ఫ్రేమ్‌లో కామెడి మిస్ కాకుండా చూసుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన రిస్క్ అంతా తనే తీసుకున్నాడు.

క్యారెక్ట‌ర్ గురించి....
- ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ పేరు బంగార్రాజు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్. ఇందులో డబుల్ షేడ్ ఉన్న రోల్ పోషించాను. నేను ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని యాంగిల్‌ను ఈ సినిమాలో చూడ‌బోతున్నారు. వీరుపోట్ల ఈ కథను నన్ను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాడు. అయితే స్క్రిప్ట్ చాలా బలంగా రాసుకున్నాడు. ఈ కథ నాకే కాదు.., ఎవరికైనా సూట్ అవుతుంది. మర్యాదరామన్న సినిమలో నా నటనకు రివ్యూస్ లో మంచి అప్రిసియేషన్ వచ్చింది. తర్వాత నాకు రివ్యూస్ పరంగా మరే సినిమాకు ఆ రేంజ్ అప్రిసియేషన్ రాలేదు. ఈ సినిమా మళ్లీ మర్యాదరామన్న లాంటి అప్రిసియేషన్ ను తీసుకొస్తుందనుకుంటున్నాను.

అందుకే మాస్క్‌...
- ఈ సినిమాలో మాస్క్ వేసుకుని క‌నిపించ‌డానికి కార‌ణం కొన్ని స‌మ‌స్య‌ల నుండి త‌ప్పించుకుని తిర‌గ‌డానికే త‌ప్ప రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో క‌న‌ప‌డ‌ను. సినిమాలో అన్నీ రకాల ఎలిమెంట్స ఉంటాయి. అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి. ముఖ్యంగా ఈ సినిమాను చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు.

అది అందరికీ సాధ్యం కాదు...
-కమర్షియల్ సినిమాలంటే ఓ ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ అందరికీ తెలుసుంటుంది. అలాంటి ఫార్మేట్స్ లో సినిమాలు చేయడం అందరికీ కుదరదు.

విలన్ కావాలనుకుని..
-తెలుగు ఇండస్ట్రీలోకి విలన్ కావాలనుకుని వచ్చాను. ముందు మోమన్ బాబుగారిలా కొన్ని క్యారెక్టర్స్ తో పేరు తెచ్చుకుని, తర్వాత కోటగారిలా చేయాలని అనుకున్నాను. అయితే కమెడియన్ అయిపోయాను. ఇప్పుడు హీరో అయ్యాను. అయితే నేను విలన్ గా నటిస్తాను కానీ ముందు వేరే భాషా చిత్రాల్లో విలన్ గా నటిస్తాను. అందుకు సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరిగాయి. వచ్చే ఏడాది వేరే భాషా చిత్రాల్లో విలన్ గా కనపడే అవకాశాలున్నాయి.

వారికి సేవ చేయాలనుంది....
-వచ్చే ఏడాది ఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మెంటల్లీ చాలెంజ్డ్ పిల్లలకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. నేను స్థాపించే ఆర్గనైజేషన్ లో వక్తులు అంటే మానసికంగా సమస్యలు దాటి వచ్చిన వారే ఉంటారు.  టీచర్స్ నుండి అందులో పనిచేసే వాచ్ మెన్ వరకు వారే ఉంటారు. అలా చేయడానికి కారణం వారిలోని నిష్కలలమైన మనస్సు. వారిని గమనిస్తే వారి నిష్కలమైన మనస్సును మనం గమనించవచ్చు. అలాంటి కొంత మంది పిల్లలను నేను దత్తత తీసుకుని, నా స్వసంపాదనతోనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాను.

ఆయనే ఇన్ స్పిరేషన్...
-చిరంజీవిగారే నాకు ఇన్ స్పిరేషన్. ఆయన 150వ సినిమాలో యాక్ట్ చేయమని అడిగారు. అయితే అప్పటికే ఈడు గోల్డ్ ఎహే సినిమాకు డేట్స్ ఇచ్చేసి ఉండటం వల్ల కుదరలేదు. అయితే చిరంజీవిగారి సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నాను. అయితే నాకు ఇంతకు వచ్చిన ఆపర్ వచ్చిన రోల్ లో కాకుండా వేరే రోల్ చేస్తున్నాను.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్....
-ప్రస్తుతం క్రాంతి మాధవ్ గారి సినిమా చేస్తున్నాను. రాజేంద్రప్రసాద్ గారి కామెడి స్టయిల్ లో సాగుతూ ఓ మెసేజ్ ఇచ్చే చిత్రమది. ఇప్పటి వరకు 30 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved