pizza
Surender Reddy interview (Telugu) about Dhruva
ఇకపై రీమేక్ సినిమాలు చేయను - సురేందర్ రెడ్డి
You are at idlebrain.com > news today >
Follow Us

6 December 2016
Hyderaba
d

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న స్ట‌యిలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ధృవ‌`. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి పుట్టినరోజు కూడా డిసెంబర్ 7 కావడం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డితో ఇంటర్వ్యూ....

ఎలాంటి ఒత్తిడి లేదు...
- నాకు ప్ర‌తి సినిమా కీల‌క‌మే. అలాగే ధృవ చిత్రాన్ని కూడా కీల‌కంగానే భావిస్తున్నాను. నాకు, చ‌ర‌ణ్‌కు `ధృవ` పెద్ద హిట్టై మంచి పేరు తెస్తుంద‌ని భావిస్తున్నాను. ఇది రీమేక్ సినిమా అనే ప్రెష‌ర్ త‌ప్ప‌..ద‌ర్శ‌కుడిగా మ‌రే విధ‌మైన ఒత్తిడి లేదు.

`ధృవ` ఎలా ప్రారంభ‌మైందంటే...
- `ధృవ` సినిమా కంటే ముందు నుండే నేను చ‌ర‌ణ్‌తో ట్రావెల్ అవుతున్నాను.త‌నేదైనా కొత్త‌గా చేయాల‌నుకుంటున్నాడు. మా మ‌ధ్య స్టోరీకి సంబంధించిన డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఆ సమయంలోచరణ్ `త‌ని ఒరువ‌న్` సినిమా చూశాడు. తనకు ఆ సినిమా బాగా న‌చ్చింది. త‌ను ఓ రోజు న‌న్ను పిలిచి సినిమా చూడ‌మ‌న్నాడు. నేను చూసిన త‌ర్వాత సినిమా ఎలా ఉంద‌ని అడిగితే సినిమా కంటెంట్‌ చాలా బావుందండి..అని నేను చ‌ర‌ణ్‌కు చెప్పాను. `నేను చేయ‌వచ్చా` అని అడిగారు. కొత్త‌గా చేయాల‌ని మీరేదైతే అనుకుంటున్నారో అలా ఉంది. మీరు చేయ్య‌వ‌చ్చున‌ని నేను చెప్పాను. ముందు నువ్వు డైరెక్ట్ చేయ్.. అని చెప్ప‌కుండా సినిమా ఎలా చేస్తే, ఏమీ చేస్తే బావుంటుందోన‌ని అడిగారు చ‌ర‌ణ్‌. నేను బావుంటుంద‌న‌గానే నువ్వు డైరెక్ట్ చెయ్యొచ్చు క‌దా అన్నారు. నేను రెండు రోజులు టైం కావాలి సార్ అని అడిగాను. రెండు రోజుల త‌ర్వాత..చ‌ర‌ణ్‌ను క‌లిసి కంటెంట్ బావుంది. కాబ‌ట్టి నేను చేస్తానని చెప్పాను.

ఎలాంటి మార్పులు చేశారు....
- స్క్రిప్ట్‌లో ఏదైతే అవ‌స‌ర‌మ‌నిపించిందో దాని వ‌ర‌కు మాత్ర‌మే మార్పులు చేశాం. సినిమా మెయిన్ కంటెంట్‌ను పాడు చేయ‌కుండా సినిమా చేశాం.

అదే ఆలోచించాను...
- నేను `ధృవ` డైరెక్ట్ చేయ‌డానికి రెండు రోజులు టైం అడిగిన తర్వాత ఆ రెండు రోజులు సినిమాను చాలా సార్లు చూశాను. ఈ సినిమాలో నేను ఏం చేయగ‌లుగుతాను. నాకు రీమేక్ చేయ‌డం రాదు..మ‌రి నేను చేయ‌డం క‌రెక్టా, కాదా అని ఆలోచించాను. అలా త‌మిళ సినిమా క‌థ‌ను డైజెస్ట్ చేసుకోవ‌డానికి రెండు రోజుల స‌మ‌యం ప‌ట్టింది.

Surender Reddy interview gallery

రాంచ‌ర‌ణ్‌, అర‌వింద‌స్వామి క్యారెక్టర్స్...
- తమిళంతో పోల్చితే తెలుగులో చరణ్ ఎప్పుడైతే సినిమాలోకి ఎంట‌ర్ అయ్యారో చిన్న గీత వెనుక పెద్ద గీత పెడితే ఎలా ఉంటుందో అని సినిమా స్పాన్ పెరిగింది. అందుకు త‌గ్గ‌ట్టు హీరో క్యారెక్ట‌ర్‌లో చిన్న మార్పులు చేశాం. అలాగే అర‌వింద‌స్వామిగారి క్యారెక్ట‌ర్‌ను ఉన్న‌ప‌రిధి కంటే పెంచి చూపించామే త‌ప్ప ఎక్క‌డా త‌గ్గించ‌లేదు. టేకింగ్ పరంగా లోకేష‌న్స్ అన్నీ డిఫ‌రెంట్‌గా ఉంటాయి. అర‌వింద‌స్వామిగారిని క‌లిసి సినిమాలో నటించమన్న‌ప్పుడు ఆయ‌న `ధృవ‌`లో న‌టించ‌డానికి ఒప్పుకున్నారు అయితే ఏం మార్ప‌లు చేయ‌బోతున్నారో చెప్ప‌మ‌ని అన్నారు. నేను ఓ వారం త‌ర్వాత ఆయ‌న్ను క‌లిసి ఎలాంటి మార్పులు చేయ‌బోతున్నానో చెప్పాను. ఆయ‌న‌కు చేంజ‌స్ న‌చ్చాయి.

చ‌ర‌ణ్ హార్డ్ వ‌ర్క‌ర్‌...
- చరణ్ చాలా హార్డ్ వర్కర్. తను సినిమా రీమేక్ చేయాల‌నుకోగానే బాడీ ఫిట్‌గా ఉండాల‌నే నిర్ణయం తీసుకున్నారు. అంత కంటే ముందు నేను, చ‌ర‌ణ్‌గారు క‌లిసి మాట్లాడుకున్నాం. క్యారెక్ట‌ర్ కోసం ఏమైనా చేయ‌డానికి ఆయ‌న రెడీ అయిపోయారు. అందుకోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో నాకు తెలుసు. ఆరు నెల‌లు పాటు జిమ్ బాడీని మెయిన్‌టెయిన్ చేయ‌డం అంత సుల‌భం కాదు. చాలా ప్యాష‌న్‌తో సినిమా ప‌ట్ల కేర్ తీసుకున్నాడు. డైరెక్ట‌ర్ ఏం చెబితే అది చేశాడు.

మోహ‌న్‌రాజాతో మాట్లాడాను...
- స్క్రిప్ట్ నా మైండ్‌లోకి వెళితే త‌ప్ప‌, రీమేక్ సినిమా చేయ‌లేం. అందుకే తని ఒరువన్ కథ‌ను అడాప్ట్ చేసుకుని తెలుగులో డైరెక్ట్ చేయాల‌నుకున్నాను. సినిమా చేయ‌డానికి ముందు ఒక‌రోజు త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజాతో మాట్లాడాను. స‌న్నివేశాల‌ను అలానే ఎందుకు డైరెక్ట్ చేశార‌ని ఆయ‌న్ను అడిగి తెలుసుకున్నాను. తర్వాతనే షూటింగ్ లోకి వెళ్లాం.

చ‌ర‌ణ్ చాలా డిఫ‌రెంట్‌...
- నేను చ‌ర‌ణ్‌ను క‌ల‌వ‌క ముందు ఆయన గురించి చాలా విన్నాను, కానీ ఆయ‌న్ను క‌లిసిన త‌ర్వాత ఆయ‌నెలా ఉంటారో తెలుసుకున్నాను. బ‌య‌ట విన్న‌దానికి ఆయ‌న పూర్తి విరుద్ధంగా ఉంటారు. ఇన్ని రోజుల ట్రావెల్‌లో ఇలాంటి మంచి హృద‌య‌మున్న హీరోను నేను చూడ‌లేదు. ఒక‌సారి ఓ మాట అన్నాడంటే త‌ను మ‌ర‌చిపోడు. అంత క‌మిట్‌మెంట్‌, హానెస్ట్ నేనెక్క‌డా చూడ‌లేదు. డైరెక్ట‌ర్‌కు ఎంత ఫ్రీడ‌మ్ ఇవ్వాలో అంత ఫ్రీడ‌మ్ ఇచ్చారు. నేను అడిగిన టెక్నిషియ‌న్స్‌ను ఇచ్చారు. ఆయ‌నంత స‌పోర్ట్ చేశారు కాబ‌ట్టి సినిమా అవుట్ పుట్ బాగా వ‌చ్చింది.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ గురించి...
- . హిప్ హాప్ త‌మిళ అంటే ఆది, జీవా అనే ఇద్ద‌రు వ్య‌క్తులు. త‌మిళంలో త‌ని ఒరువ‌న్‌కు సంగీతం అందించిన హిప్ హాప్ త‌మిళ‌నే తెలుగుకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తీసుకోవాల‌నేది కూడా నా నిర్ణ‌య‌మే. చ‌ర‌ణ్ వంటి స్టార్ హీరో సినిమాకు కొత్త మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎందుక‌ని కొంత మంది న‌న్ను అడిగారు కూడా. కానీ కొత్త‌గా చేయాల‌నే ఉద్దేశంతో హిప్ హాప్ త‌మిళ‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తీసుకున్నాం. నేను చెప్పగానే చరణ్ గారు వెంటనే ఎస్ చెప్పారు. ఈ సినిమాకు రీ రికార్డింగ్ వ‌న్ ఆఫ్ ది హైలెట్ అవుతుంది.

రీమేక్ సినిమా చేయడం సులభం కాదు....
- రీమేక్ సినిమా చేయ‌డం అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రూవ్ అయిన సినిమాల రీమేక్ సినిమా విష‌యంలో ప‌రిధులు ఎర్పడుతాయి. రీమేక్‌ల విష‌యంలో ధృవ సినిమానే నేను చేసే చివ‌రి రీమేక్‌. ఇక‌పై రీమేక్‌లు చేయ‌ను. ఈ విష‌యాన్ని చ‌ర‌ణ్‌కు కూడా చెప్పాను. అయితే మెయిన్ కంటెంట్‌ను తీసుకుని దాన్ని మ‌న ఐడియాల‌జీతో ఫ్రెష్ మూవీలా చేస్తే రీమేక్ సినిమాలు చేయ‌వ‌చ్చు. అది కొన్ని స్క్రిప్ట్‌ల‌కే సాధ్య‌మ‌వుతుంది. అన్నీ స్క్రిప్ట్స్‌ను ఫ్రెష్‌గా చేయ‌లేం. ధృవ అలాంటి డిఫ‌రెంట్ స్క్రిప్ట్ ఉన్న సినిమా. అన్నీ ఇంట‌ర్ రిలేటెడ్ సీన్స్ ఉన్న సినిమా.

ఆఫ‌ర్స్ ఉన్నాయి...
- బాలీవుడ్ నుండి ఆఫ‌ర్స్ ఉన్నాయి. కానీ ప్రాక్టిక‌ల్‌గా ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతాయని ఆలోచించాలి. బాలీవుడ్‌కు వెళితే రెండు, రెండున్న‌రేళ్లు అక్క‌డే ఉండాలి.

చిరంజీవితో సినిమా గురించి...
- చిరంజీవిగారితో క‌చ్చితంగా సినిమా ఉంటుంది. వ‌చ్చే ఏడాది ఉండొచ్చున‌ని అనుకుంటున్నాను. క‌థ రెడీగా ఉంది. ప్రస్తుతానికి డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి. నిర్ణ‌యం వాళ్లే తీసుకోవాలి. చిరంజీవిగారితో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయాల‌ని ఉంది. `కిక్` లాంటి డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తాను.

ఆలోచ‌న ఉంది...
- రెగ్యుల‌ర్ గా ఒకే సినిమా చేయ‌డం ఇష్టం ఉండ‌దు. ఓ హిట్ వ‌స్తే ఓ ప్ర‌యోగం చేసే అల‌వాటు ఉంది. ప్రొడ్యూస‌ర్‌గా మారి చిన్న సినిమా చేసే ఆలోచ‌న కూడా ఉంది. కుమార‌స్వామిగారి అబ్బాయితో సినిమా ఆఫ‌ర్ ఉంది కానీ నేను ఆ సినిమా చేయ‌డం లేదు.

ఈ పుట్టిన‌రోజున‌ కొత్త‌గా ఏం చేస్తున్నారు...
- ఏం చేయ‌డం లేదండి..యూనిట్‌తో క‌లిసి యు.ఎస్‌. వెళుతున్నాను


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved