pizza
Suriya interview (Telugu) about Singam 3
సింగం 4 గురించి ఆలోచ‌నే లేదు - హీరో సూర్య
You are at idlebrain.com > news today >
Follow Us

6 February 2017
Hyderabad

తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం ఎస్-3 (`సింగం-3`). సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో సూర్య‌తో ఇంట‌ర్వ్యూ...

సినిమా వాయిదా ప‌డుతూ వ‌చ్చి విడుద‌ల‌వుతుంది క‌దా..మీకెలా అనిపిస్తుంది?
- సింగం సీక్వెల్స్‌లో ఈ మూడో సీక్వెల్ వాయిదా ప‌డ్డ‌ట్టు మ‌రే చిత్రం వాయిదా ప‌డ‌లేదు. ఒక‌సారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన త‌ర్వాత ప్రేక్ష‌కులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తార‌న‌డంలో సందేహం లేదు. అయితే త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగారు చ‌నిపోవ‌డం స‌హా కొన్ని కార‌ణాల‌తో సింగం-3ను వాయిదా వేసుకుంటూ వ‌చ్చాం. 100రోజుల వాయిదా త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ఫిబ్ర‌వ‌రి 9న సినిమా విడుద‌ల‌వుతుంది. కొద్దిగా ఆల‌స్య‌మే అయినా అభిమానులు, ప్రేక్ష‌కులు మా సినిమాను ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కంతో ఉన్నాం.

రిలీజ్ వాయిదా ప‌డ‌టం వ‌ల్ల సినిమాపై ఏదేని ఎఫెక్ట్ ఉంద‌ని అనుకుంటున్నారా?
- సినిమాను ముందు దీపావ‌ళికి రిలీజ్ చేద్దామ‌ని అనుకున్నాం. అప్పుడు కార్తీ సినిమా రావ‌డం ఇతర‌త్రా కార‌ణాలతో సినిమా విడుద‌ల వెన‌క్కి వెళ్లిన మాట వాస్త‌వమే అయితే వాయిదా వ‌ల్ల సినిమాపై ఎటువంటి ఎఫెక్ట్ ఉండ‌బోద‌ని అనుకుంటున్నాను. సినిమా కంటెంట్‌పై న‌మ్మ‌కంగా ఉన్నాం.

సింగం ఫ్రాంచైజీలో మిమ్మ‌ల్ని ఎగ్జ‌యిట్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి?
- ఈరోజు ఐపీయ‌స్ ఆఫీస‌ర్ సి.వి.ఆనంద్‌గారిని క‌లిసిన‌ప్పుడు ఆయ‌న త‌న ఎక్స్‌పీరియెన్స్‌లో త‌ను ఫేస్ చేసిన ఇలాంటి ఓ ఘ‌ట‌న‌ను చెప్పారు. ఇక్క‌డి గ‌వ‌ర్న‌మెంట్ స‌హ‌కారంతో, బ్యాంకాక్ చేరుకుని, అక్క‌డి పోలీసులు స‌హాకారంతో కృషి బ్యాంక్ నిందితుల‌ను అరెస్ట్ చేశారని చెప్పారు. అంటే ఈ సినిమాలో చూపించిన వాటిలో ఎన‌బైశాతం పాజిబిలిటీ ఉంటుంద‌ని మాకు తెలిసింది. అలాంటి ఆఫీస‌ర్స్ చెబుతున్న విష‌యాల‌ను వింటుంటే ఎగ్జ‌యిటింగ్‌గానే అనిపిస్తుంది. నేను పోలీస్ పాత్ర‌ల్లో న‌టించిన కాక్క కాక్క, సింగం సీక్వెల్స్ సినిమాల‌ను కొత్త‌గా స‌ర్వీసులోకి రాబోయే పోలీస్ ఆఫీస‌ర్స్ చూపిస్తార‌ని తెలిసింది. ఇలాంటి సినిమాల ప‌ట్ల ఉన్న ఇలాంటి రెస్పెక్ట్ చూసి కూడా ఎగ్జ‌యిట్‌మెంట్‌కు గురి చేస్తుంది. సింగం3 సినిమాను నిజ‌మైన పోలీస్ ఆఫీసర్ జీవితాల‌ను ఆధారంగా చేసుకుని రాసుకున్న క‌థ‌. సినిమాలో చూపిన‌ట్టు యాక్ష‌న్ సీక్వెన్స్ రియ‌ల్ లైఫ్‌లో ఉండ‌క‌పోవ‌చ్చు కానీ, క‌థ మాత్రం మ‌న సోసైటీలో పోలీసుల‌ను చూసి రాసుకున్న‌దే. పోలీస్ ఆఫీస‌ర్స్ కొన్ని కేసుల‌ను ఎలా హ్యాండిల్ చేస్తార‌నే దానిపై వారిని క‌లిసి వారితో మాట్లాడాం కూడా.

Suriya interview gallery

లుక్ గురించి...?
- త‌మిళ‌నాడులో తిరున‌ల్వేలి, తూతుకూడి ప్రాంతాల్లో వ్య‌క్తుల‌ను చూస్తే.సింగంలో హీరోకు ఉన్న మీసాల్లాగానే ఉంటాయి. అలాగే ఈ సినిమాలో కూడా హీరో ఆ నేప‌థ్య గ్రామం నుండి రావ‌డంతో లుక్ అలాగే ఉండేలా ప్లాన్ చేశాం.

మూడో పార్ట్‌కు హ‌రీష్ జైరాజ్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తీసుకోవ‌డానికి కార‌ణ‌మేంటి?
- కొత్త‌గా ఉండాల‌నుకుని చేసిన ప్ర‌య‌త్న‌మే. ఉదాహ‌ర‌ణ‌కు మ‌ణిర‌త్నంగారిని చూస్తే ఆయ‌న కొత్త కొత్త సినిమాటోగ్రాఫ‌ర్స్‌తో వ‌ర్క్ చేస్తుంటారు. అలాగే ఈ సినిమా కోసం హారీష జైరాజ్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తీసుకోవాల‌నుకున్నాం.

శృతిహాస‌న్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌...?
- శృతిహాస‌న్‌తో సెవెన్త్ సెన్స్ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. ఇప్పుడు త‌ను ద‌క్షిణాది సినిమాల‌నే కాకుండా ఉత్త‌రాది సినిమాల్లో కూడా న‌టిస్తుంది. ఈ సినిమాలో శృతిహాస‌న్ క్యారెక్ట‌ర్ కానీ, పెర్‌ఫార్మెన్స్ చూస్తే ఆమెకు ఇంకా ఫ్యాన్స్ పెరుగుతారు.

సింగం 4 చేస్తున్నారా?
- ఏదీ ప్లాన్ చేసుకోలేదండి ఆలోచనే లేదు..సింగం చేస్తున్న‌ప్పుడు ఈ ఫ్రాంచైజీ వ‌స్తుంద‌ని కూడా అనుకోలేదు. అస‌లు సింగం 3 చేయాల‌నే ఆలోచ‌న లేదు. నేను, హ‌రిగారు మిల‌టరీ క‌థ‌తో సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు , క‌థ కోసం మూడు సిట్టింగ్స్ కూడా జ‌రిగాయి. అయితే నేను, హ‌రిగారు ఎక్క‌డికి వెళ్లినా అంద‌రూ మీరు సింగం మూడో పార్ట్ చేస్తున్నారు క‌దా..అని అడ‌గ‌డం స్టార్ట్ చేశారు. మా కాంబినేష‌న్‌లో వచ్చిన సింగంకు ఇంత ఆద‌ర‌ణ వ‌చ్చిన‌ప్పుడు సింగం ఫ్రాంచైజీ ఎందుకు చేయ‌కూడ‌దు అనిపించి సింగం 3 చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. హరిగారికి వ‌చ్చిన ఐడియాతో మంచి స్క్రిప్ట్ రాశారు. ఈ సినిమాలో వాతావ‌ర‌ణం గురించి చ‌ర్చించాం. ఎన్విరాన్‌మెంట్ ఆధారంగా నిజ ఘ‌ట‌న‌ల బేస్‌తో చేసిన సినిమా.

మూడో పార్ట్ చేయ‌డం ప‌ట్ల బోరింగ్‌గా అనిపించిందా?
- అదేం లేదు..సింగం, సింగం2 ఎవ‌రికైనా బోర్ కొట్టాయి. సింగం 3 కూడా అలాగే ఉంటుంది. ఆడియెన్స్‌ను కూడా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. అలా ఎంట‌ర్‌టైన్ చేయ‌డం మా రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నాం.

జ్యోతిక న‌టించిన సినిమా గురించి...?
- జ్యోతిక ఇప్పుడు `మ‌గ‌లిర్ మ‌ట్రుమ్` అనే సినిమాలో యాక్ట్ చేసింది. `కుట్రం క‌డిత‌ల్` అనే నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ బ్ర‌హ్మ ఈ సినిమాను డైరెక్ట‌ర్ చేశారు. ఇది ఆడ‌వాళ్ల‌కే సంబంధించిన సినిమా కాదు, మ‌గ‌వాళ్ల‌కి కూడా సంబంధించిన సినిమా న‌లుగురు మ‌హిళ‌ల ప్ర‌యాణ‌మే ఈ చిత్రం. అల్రెడి జ్యోతిక న‌టించిన 36 వ‌య‌దినిలే చిత్రం కూడా తెలుగులో డ‌బ్ అయ్యింది. మంచి రిలీజ్ డేట్స్ చూసుకుని ఈ సినిమాల‌ను తెలుగులో రిలీజ్ చేస్తాం. ఈ సినిమా కోసం జ్యోతిక‌కు బుల్లెట్ నేర్పించాను.

డైరెక్ట‌ర్ హ‌రి గురించి...?
- డైరెక్ట‌ర్ హ‌రి డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌న్‌. పెద్ద డైరెక్ట‌ర్ స్థాయికి ఎదిగినా ఇంకా ఆయ‌న ప‌డే క‌ష్టం చూసి ఆశ్చ‌ర్య‌పోతాం. మూడు సినిమాల క‌ష్టాన్నిసింగం 3 సినిమా కోసం ప‌డ్డారు. 120 రోజుల్లో పూర్తి చేశారు. ఈ సినిమా కోసం 200 లోకేష‌న్స్‌ను సెర్చ్ చేశారు.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌?
- విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాను. త‌న టేకింగ్ బావుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved