pizza
Sushanth interview about Aatadukundam Raa
`ఆటాడుకుందాం..రా`లో కొత్త సుశాంత్‌ను చూస్తారు - సుశాంత్‌
You are at idlebrain.com > news today >
Follow Us

16 August 2015
Hyderabad

యంగ్‌ హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీజి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్‌ చిల్‌). ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సుశాంత్ తో ఇంటర్వ్యూ....

హీరో సుశాంత్ మాట్లాడుతూ ``శ్రీధ‌ర్ సీపాన క‌థ చెప్ప‌గానే విప‌రీతంగా న‌వ్వాను. ఎంత‌లా అంటే క‌ళ్ళ‌లో నీళ్ళు తిరిగాయి. ఫ‌స్ట్ సిట్టింగ్ లోనే క‌థను ఓకే చేశాను. రెండు గంట‌లు పాటు ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే చిత్ర‌మిది. మూవీ చాలా వేగంగా ఉంటుంది. గ్యారంటీగా అంద‌రూ ఎంజాయ్ చేసే చిత్రంగా నిలుస్తుంది. బ్ర‌హ్మానందం, పృథ్వి, పోసాని వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌తో ఎంట‌ర్ టైనింగ్ మూవీ చేయ‌డం ఆనందంగా ఉంది. అనూప్, అడ్డా కంటే మంచి మ్యూజిక్ ఇస్తాన‌ని చెప్పడ‌మే కాకుండా అలాంటి ఎక్స‌లెంట్ మ్యూజిక్‌నందించాడు. సినిమాలోఎంట‌ర్‌టైనింగ్‌తో పాటు మంచి ట‌చింగ్ స‌న్నివేశాలుంటాయి. అమ్మ‌, శ్రీనివాస‌రావుగారు ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. స్కిప్ట్ రాసుకునేట‌ప్పుడే చైత‌న్య రోల్ అనుకున్నాం. అయితే సినిమా బాగా వ‌స్తేనే ఈ రోల్ చేయ‌మ‌ని త‌న‌ను అడ‌గాల‌ని అనుకున్నాను. సినిమా బాగా వ‌స్తుంద‌నిపించ‌డంతో చైత‌న్య‌ను రోల్ చేయ‌మ‌న్నాను. నేను చేస్తే నీకు బావుంటుందంటే చేస్తాన‌ని చెప్పి చైతు రోల్ చేయ‌డానికి అంగీక‌రించాడు. అఖిల్‌నైతే నేను అడ‌గ‌లేదు. మా సిస్ట‌ర్‌తో త‌ను ఈ సినిమాలో చేయ‌డానికి రెడీయే అని తెలిసి త‌న‌కు కాల్ చేసి నీ రెండో సినిమా కోసం అంద‌రూ చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి సంద‌ర్భంలో ఈ చిత్రంలోగెస్ట్ రోల్ చేస్తావా అని అడిగాను. త‌ప్ప‌కుండా చేస్తాన‌ని చెప్ప‌డంతో నేను హ్యాపీగా ఫీల‌య్యాను. అఖిల్‌తో చేసేట‌ప్పుడు చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను. మ‌నం సినిమాలో చేయ‌లేక‌పోయాను. కానీ ఈ చిత్రంలో చైతు, అఖిల్‌తో చేసే అవ‌కాశం క‌లిగింది. వ్య‌క్తిగ‌తంగా చాలా సంతృప్తినిచ్చింది. ఎన్నారై కుర్రాడి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. సినిమాలో ఎమోష‌న‌ల్ సీన్స్ ఉన్నా ఎక్క‌డా భారీ డైలాగ్స్ ఉండ‌వు. ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. అందులో ఒక‌టి టైం మిష‌న్ సెట్ ఒక‌టి. రేపు సినిమాలో ఆడియెన్స్‌కు థ్రిల్ అవుతారు. మొత్తం మీద ఫ‌న్ మూవీ. చాలా స్టైలిష్‌గా నటించాను. రీమిక్స్ చేయ‌డ‌మంటే టెన్ష‌న్‌. ఈ సినిమాలో కూడా ప‌ల్లెకు పోదాం..పారును చూద్దాం అనే సాంగ్‌లో ఓ బిట్‌ను మాత్ర‌మే ఉప‌యోగించాం. పూర్తి పాట‌ను రీమిక్స్ చేయ‌లేదు.ఈ పాట‌లో వేసిన పంచె క‌ట్టు గెట‌ప్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

నాగ‌శ్వ‌ర‌రెడ్డిగారు చాలా క్లారిటీ ఉన్న ద‌ర్శ‌కుడు. ఆయ‌న అంద‌రి ద‌గ్గ‌ర నుండి మంచి పెర్‌ఫార్మెన్స్‌ను రాబట్టుకున్నారు. కొత్త సుశాంత్‌ను తెర‌పై చూస్తారు. నేను చేసిన మూడు ఓ ఎత్తు అయితే ఈ సినిమా మ‌రో ఎత్తు. నా నెక్ట్స్ మూవీ బ‌య‌ట బ్యానర్‌లో ఉంటుంది. డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి. క‌చ్చితంగా హిట్ అవుతుందని ఎగ్జ‌యిట్ మెంట్‌తో ఉన్నాను`` అన్నారు.

Sushanth interview gallery

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved