pizza
Tamanna interview (Telugu) about Abhinetri
'అభినేత్రి'లో నటించడానికి కారణమదే - తమన్నా
You are at idlebrain.com > news today >
Follow Us

26 September 2016
Hyderaba
d

తెలుగుహిందీతమిళ భాషల్లో ప్రభుదేవామిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా తమన్నాతో ఇంటర్వ్యూ....

అలాంటివి కనపడవు...
- `అభినేత్రి` హర్రర్‌ కామెడి జోనర్‌ మూవీ అంటున్నారుకానీ సినిమాలో ఎక్కడా రక్తందెయ్యం వంటివి కనపడవు. సినిమాలో దెయ్యం ఉంటుంది కానీ కనపడదు. ఎక్కువగా భయపెట్టే అంశాలేవీ లేవు. ఫ్రెండ్లీ దెయ్యం అనుకోవచ్చు.

కొత్త తమన్నాను చూస్తారు...
- అభినేత్రిలో కొత్త తమన్నాను ఈ సినిమాలో చూస్తారు. దేవి
రూబీ అనే డ్యూయెల్‌ రోల్‌ చేశాను. సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయి.

అందుకే చేశాను...
- బాహుబలి వంటి సినిమా తర్వాత ఆడియెన్స్‌ నన్ను కొత్తగానే చూడాలనుకుంటున్నారు. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో కనపడాలనుకుంటున్నారు. అలాంటి సమయంలో నన్ను నేను కొత్తగా చూపించుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. ఆసమయంలో 
'అభినేత్రికథ విన్నాను. కొత్తగా అనిపించడంతో చేయడానికి ఆసక్తి చూపించాను.

చాలా కష్టం..ఇకపై చేయను...
- మూడు భాషల్లో ఒక సినిమాను చేయడమంటే ఎంత కష్టమో తెలిసింది. అంటే సినిమా చేయడం కష్టమని కాదు..కంటిన్యూగా వర్క్‌ చేయడం వల్ల అందరం బాగా అలసిపోయాం. మూడు భాషల్లో మూడు రకాల లిప్‌ మూమెంట్స్‌తో డైలాగ్స్‌ చెప్పడం
మూడు భాషల లిప్‌ మూమెంట్స్‌కు తగిన విధంగా డ్యాన్స్‌ మూమెంట్స్‌లో చిన్న వేరియేషన్స్‌తో మళ్లీ చేయడం ఇలాంటి చాలా కష్టమయ్యాయి.

 

Prabu Deva interview gallery

ప్రభుదేవాతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌...
- ప్రభుదేవాగారు చూడటానికి చాలా సింపుల్‌గానే కనపడతారు కానీ ఆయనలో చాలా సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌ ఉంది. కెమెరా ముందుకు వచ్చేసరికి ఆయనే వేరేలా ఉంటారు. ఈ సినిమాలో ఆయన ఎంటర్‌ కావడం
ఆయన తనదైన నటనతో సినిమాలో కామెడిని రేంజ్‌ను పెంచారు.

రెండు విబిన్నమైన పాత్రలు...
- ఈ సినిమాలో దేవి అనే విలేజ్‌ అమ్మాయిగా కనపడతాను. పాత్ర పరంగా నాకు ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయిలా కనిపించడమంటే చాలెంజ్‌గానే భావించాను. అలాగే మరో పాత్ర రూబీ. రెండింటిలో చాలా వేరియేషన్‌ ఉంది.

అందుకే డబ్బింగ్‌ చెప్పలేదు...
'ఊపిరిసినిమాలో నా పాత్రకు తెలుగు మాట్లాడినప్పుడుభాషను పలకడంలో సమస్య వచ్చినా చెల్లుబాటు అవుతుంది. అదే ఈ సినిమా విషయానికి వస్తే దేవి అనే పల్లెటూరి అమ్మాయి యాస్‌ చాలా వేరుగా ఉంటుంది. అలాంటి యాసలో నేను మాట్లాడినప్పుడు సెట్‌ కాకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకనే ఈ సినిమాకు నేను డబ్బింగ్‌ చెప్పలేదు.

స్పెషల్‌ సాంగ్‌ గురించి...
- హీరోయిన్స్‌ స్పెషల్‌ సాంగ్స్‌ చేయడమనే సంస్కృతి బాలీవుడ్‌లో ఎక్కువగాఉంది. కరీనాకపూర్‌
ప్రియాంకచోప్రాదీపికా వంటిస్టార్‌ హీరోయిన్స్‌ కూడా స్పెషల్‌సాంగ్స్‌లో నటించారు. ఒకప్పుడు దక్షిణాదినా ఆ కల్చర్‌ ఉండేది కాదు. స్పెషల్‌సాంగ్‌ను ఎబ్బెట్టుగా కాకుండా అందంగా చూపిస్తారు. బావుంటుందనిపిస్తే ఎవరైనా చేయవచ్చు. అందుకే నేను స్పెషల్‌సాంగ్స్‌ చేస్తున్నాను. ఇప్పుడు కాజల్‌శృతిహాసన్‌ తదితరులు కూడా స్పెషల్‌సాంగ్స్‌ చేస్తున్నారు.

నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌...
- అభినేత్రి అక్టోబర్‌ 7న విడుదలవుతుంది. తర్వాత విశాల్‌
నేను నటించిన ఒక్కడొచ్చాడు అక్టోబర్‌లోనే విడుదలవుతుంది. తర్వాత బాహుబలి షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. ఇవి కాకుండా తమిళంలో శింబుతో ఓ సినిమా చేయబోతున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved